క్రిష్-3లో అమితాబ్ బచ్చన్!
క్రిష్-3లో అమితాబ్ బచ్చన్!
Published Mon, Aug 26 2013 5:35 PM | Last Updated on Fri, Sep 1 2017 10:08 PM
బాలీవుడ్, టాలీవుడ్ చిత్రసీమలో వాయిస్ ఓవర్ ట్రేండ్ జోరుగా సాగుతోంది. ఇటీవల కాలంలో టాలీవుడ్ లో మహేశ్ బాబు, రవితేజ, సునీల్ లు వాయిస్ ఓవర్లలో అభిమానులను ఆకట్టుకోవడమే కాకుండా ఆ చిత్రాలకు క్రేజ్ కూడా సంపాదించిపెట్టారు.
అయితే అదే ట్రేండ్ బాలీవుడ్ లో కొనసాగుతోంది. తాజాగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ క్రిష్-3 చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చినట్టు సమాచారం. క్రిష్-3 చిత్రంలో వివేక్ ఒబెరాయ్ పాత్రకు బిగ్ బీ అమితాబ్ గొంతును అరువు ఇచ్చినట్టు తెలిసింది. వివేక్ ఒబెరాయ్ పాత్రను పరిచయం చేస్తూ, ఆపాత్రకు సంబంధించిన వివరాలను తెలిపేందుకు అమితాబ్ గొంతును దర్శకుడు వినియోగించుకున్నట్టు తెలుస్తోంది.
వాయిస్ ఓవర్ వార్తలను అమితాబ్ ధృవీకరించారు. క్రిష్-3 చిత్రంలో వివేక్ ఒబెరాయ్ పాత్రకు అత్యంత ప్రాధాన్యత ఉందని.. మొత్తం మూడు చిత్రాలకు సంబంధించిన అంశమని.. అందుకే వాయిస్ ఓవర్ కు ఒప్పుకున్నానని బిగ్ తెలిపారు. క్రిష్-3 చిత్రంలో వివేక్ ఓబెరాయ్ విలన్ గా నటిస్తున్నాడని దర్శకుడు రాకేశ్ రోషన్ వెల్లడించారు.
Advertisement
Advertisement