నాకు నచ్చిన వ్యక్తి ఇంకా లభించలేదు: ప్రియాంక చోప్రా | Haven't found the special one yet: Priyanka Chopra | Sakshi
Sakshi News home page

నాకు నచ్చిన వ్యక్తి ఇంకా లభించలేదు: ప్రియాంక చోప్రా

Published Sun, Nov 3 2013 3:48 PM | Last Updated on Sat, Sep 2 2017 12:15 AM

నాకు నచ్చిన వ్యక్తి ఇంకా లభించలేదు: ప్రియాంక చోప్రా

నాకు నచ్చిన వ్యక్తి ఇంకా లభించలేదు: ప్రియాంక చోప్రా

'నాకు నచ్చే విధంగా ఉండే జీవిత భాగస్వామి ఇంకా లభించలేదు' అని బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా ఓ ప్రశ్నకు సమాధానమిచ్చింది. అయినా ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలను కోవడం లేదు అని అన్నారు. తాను లైఫ్ లో ఇంకా స్ఠిరపడలేదు.. నాకు కావాల్సిన ప్రత్యేకమైన వ్యక్తి తారసపడలేదు అని ప్రియాంక తెలిపింది.
 
నా సోదరుడు సిద్ధార్థ్ చోప్రా వివాహం నిశ్చయమైంది. గత మూడేళ్లుగా తాను ప్రేమిస్తున్న కనిక మాథూర్ తోనే వివాహం జరుపడానికి తన తల్లితండ్రులు ఒప్పుకున్నారని మీడియాకు వెల్లడించింది. సోదరుడి పెళ్లి విషయం మీడియాలో రావడంతో తన పెళ్లిపై కూడా రూమర్లు వస్తున్నాయన్నారు. పెళ్లి విషయంపై తనపై ఎలాంటి ఒత్తిడి లేదు అని ప్రియాంక వెల్లడించింది. 
 
ప్రియాంక చోప్రా నటించిన 'క్రిష్ 3' చిత్రం ఇటీవల విడుదలైంది. 'గూండే', బాక్సర్ మేరికామ్ జీవిత కథ అధారంగా సంజయ్ లీలా భన్సాలీ రూపొందిస్తున్న చిత్రంలోనూ, జోయా అక్తర్ చిత్రంలో ప్రస్తుతం నటిస్తోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement