ఇక నా వల్ల కాదు..! | Priyanka Chopra not too keen on biopics based on sports | Sakshi
Sakshi News home page

ఇక నా వల్ల కాదు..!

Published Tue, Sep 30 2014 11:22 PM | Last Updated on Sat, Sep 2 2017 2:11 PM

ఇక నా వల్ల కాదు..!

ఇక నా వల్ల కాదు..!

మేరీ కోమ్ పాత్రలో ప్రియాంక చోప్రా అద్భుతంగా ఒదిగిపోవడం ఆమెకు తలనొప్పిగా తయారైందట. మళ్లీ ఆమెను క్రీడాకారిణిగా నటింపజేసి, క్యాష్ చేసుకోవాలని చాలామంది దర్శక, నిర్మాతలు ప్రియాంక వెంటబడుతున్నారట. కొంతమంది రచయితలైతే కథలు సిద్ధం చేసుకుని మరీ ప్రియాంకను కలుస్తున్నారట. దాంతో విసుగు చెందిన ఈ బ్యూటీ ‘‘ఇక నేను క్రీడాకారిణి పాత్ర చేయను. ఒక క్రీడాకారిణి జీవిత కథ క్లిక్ అయ్యింది కదా అని.. వరుసగా అలాంటి సినిమాలే చేయమంటే, ఇక నావల్ల కాదు. నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టం లేక కాదు. ఇష్టం కదా అని పదే పదే తాగితే అమృతం కూడా వెగటు పుడుతుందట. అలా, ఒకే తరహా పాత్రలు చేస్తే ప్రేక్షకులు విసుగు చెందుతారు. ఓ నటిగా విభిన్న తరహా పాత్రలు చేయాలన్నది నా సంకల్పం. భవిష్యత్తులో వెనక్కి తిరిగి చూసుకుంటే చెప్పుకోవడానికి ఓ పది, ఇరవై సినిమాలైనా ఉండాలిగా’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement