పాదరక్షల విలువ లక్షా పాతిక వేలు!
విలాసవంతమైన జీవితం రాసి పెట్టి ఉంటే.. విలువైన వస్తువులు సైతం కాళ్ల దగ్గరకొస్తాయి. అవి దక్కించుకున్నవాళ్లు ఆనందంలో తేలిపోతే, పరాయివాళ్లు మాత్రం కుళ్లుకుంటారు. ప్రస్తుతం కంగనా రనౌత్ కాళ్లను అలంకరించిన పాదరక్షలు చూసి, కొంతమంది అసూయపడుతున్నారు. కారణం వాటి విలువ అక్షరాలా లక్షా పాతికవేల రూపాయలు. మీరు చదివింది నిజమే. అయితే అవి కంగనా సొంత డబ్బుతో కొనుక్కున్నవి కాదు.
‘క్రిష్ 3’ సినిమా కోసం కొన్నవి. హృతిక్‌రోషన్, ప్రియాంకచోప్రా, కంగనా రనౌత్ తదితరుల కాంబినేషన్‌లో స్వీయ దర్శకత్వంలో రాకేష్ రోషన్ రూపొందిస్తున్న చిత్రం ఇది. ఇందులో కంగనా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేస్తున్నారట. ఓ డిఫరెంట్ లుక్‌తో కనిపిస్తారట కంగనా.డ్రెస్‌లు, నగలు, పాదరక్షలు.. ఇలా అన్నీ వెరైటీగా ఉంటాయని సమాచారం. ఈ చిత్రంలో కంగనా రకరకాల పాదరక్షలతో కనిపిస్తారట. వాటిలో లక్షా పాతిక వేల పాదరక్షలు ప్రత్యేక ఆకర్షణ అవుతాయని ఊహించవచ్చు. ఇప్పటికే ఇవి బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యాయి.