'హృతిక్ భార్యను నేనే'
'హృతిక్ భార్యను నేనే'
Published Fri, Oct 18 2013 8:10 PM | Last Updated on Fri, Sep 1 2017 11:45 PM
బాలీవుడ్ తారలు ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్ ల మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఇద్దరు తారల మధ్య వివాదానికి కారణం 'క్రిష్ 3' చిత్రమైంది. క్రిష్3 చిత్ర ఆరంభంలోనే ప్రియాంకతో నటించేందుకు కంగనా విముఖత చూపింది.
అయితే క్రిష్3 చిత్రంలో తానే హీరోయిన్ అని.. నేను హృతిక్ భార్యగా నటిస్తున్నాను అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అంతేకాక జాక్వలైన్ ఫెర్నాండేజ్, చిత్రంగద సింగ్ రిజెక్ట్ చేసిన పాత్రను కంగనా పోషించింది అని వివాదస్పద వ్యాఖ్య చేయడంతో అసలు విషయం మొదలైంది.
ప్రియాంక వ్యాఖ్యలపై కంగనా మాట్లాడుతూ.. క్రిష్3 చిత్రంలో తనది ప్రాధాన్యత ఉన్న పాత్రనేనని అన్నారు. తనను రెండవ హీరోయిన్ అని ప్రియాంక అనడం ఒప్పుకోనని కంగనా తెలిపింది. ఈ చిత్రం ఇద్దరు హీరోయిన్ల చిత్రం కాదని.. ఎవరి పాత్రలు వారికి ప్రాధాన్యతతో ఉన్నవే అని కంగనా తెలిపింది.
Advertisement
Advertisement