అతను పంపినవి డిలిట్ చేసేశాడు!
చినికి చినికి గాలివానగా మారినట్లు అనే సామెత అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు హృతిక్ రోషన్, కంగనా రనౌత్‌ల వ్యవహారం అలానే మారింది. ‘క్రిష్-3’లో నటించిన సమయంలో ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందనే వార్త ప్రచారమైంది. అయితే, ఆ సమయంలో తన భార్య సుజానే ఖాన్ నుంచి విడిపోవడానికి హృతిక్ ఇష్టపడకపోవడంతో కంగన, అతనికి దూరమయ్యారట. ఇటు హృతిక్ కానీ, అటు కంగన కానీ తమ గురించి వచ్చిన వార్తలకు అప్పట్లో స్పందించలేదు. అంత సెలైంట్‌గా ఉండిపోయిన ఈ ఇద్దరూ ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోయేలా రచ్చ... రచ్చ చేసుకుంటున్నారు. ఇద్దరూ పరస్పరంలీగల్ నోటీసులు పంపించుకునే దాకా వివాదం ముదిరిపోయింది. ఆ నోటీసుల్లో ఇద్దరూ చేసిన ఆరోపణల విషయానికొస్తే...
హృతిక్‌కి దీటుగా సమాధానం చెప్పాలనుకున్న కంగనా రనౌత్ తన లాయర్ ద్వారా జవాబు నోటీసు పంపించారు. అందులో ఆమె కూడా ఘాటుగానే స్పందించారు. కంగన పంపించినదానిలో ఏముందంటే..
♦ నా క్లయింట్ (కంగన) ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొత్తగా పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. పబ్లిసిటీ కోసం మీ (హృతిక్ లాయర్‌ని ఉద్దేశించి) క్లయింట్ పేరుని వాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమెకంటూ ప్రత్యేకమైన స్టార్‌డమ్ సంపాదించుకున్నారు. ఎటువంటి సినిమా నేపథ్యం లేకుండా స్వశక్తితో పైకొచ్చారామె. ఈ నిజాన్ని ఒప్పుకుని, మీ క్లయింట్ నోటీసుని ఉపసంహరించుకోవాలి. ఆధారం లేని ఆరోపణలు, మితిమీరిన నిందలు చేయడం తగదు.
♦ నా క్లయింట్ అమాంతంగా ఆకర్షితురాలు కావడానికి టీనేజర్ కాదు. ఇద్దరి మధ్య ఏమేం జరిగాయో అవన్నీ ఇద్దరి సమ్మతంతోనే జరిగాయి. మీ క్లయింట్ అండదండలు నా క్లయింట్‌కి ఉన్నాయనడం ఆమోదనీయం కాదు. భార్యతో విడాకుల వ్యవహారం సాగుతున్న నేపథ్యంలో మీ క్లయింటే ఒక కొత్త ఇ-మెయిల్ ఐడీ క్రియేట్ చేసి, నా క్లయింట్‌తో కమ్యూనికేట్ కావాలనుకున్నారు. అలా చేయడం వల్ల తన ప్రతిష్ఠకు భంగం కలగకుండా చూసుకోవాలనుకున్నారు. చివరికి నా క్లయింట్ ఐడీని హ్యాక్ చేసి, ఆయన పంపించిన మెయిల్స్‌ను తొలగించేశారు. నా క్లయింట్ నుంచి వచ్చే ఇ-మెయి ల్స్‌ని నిరాకరిస్తున్నట్లు మీ క్లయింట్ నుంచి ఎలాంటి సందేశమూ రాలేదు. నా క్లయింట్‌ను ‘బ్లాక్’ చేసే ప్రయత్నమూ చేయలేదు. ఇ- మెయిల్స్ మీ క్లయింట్ ఆమోదంతోనే అందాయనే ఋజువు అది.
♦ మీ క్లయింట్ (హృతిక్) తనదైన ఊహల్లో బతుకుతున్నారు. అందులో భాగంగానే తన గురించి తాను ఎక్కువ ఊహించుకుంటు న్నారు. ఇంటర్వ్యూలో నా క్లయింట్ ‘సిల్లీ ఎక్స్‌లు’ అని పేర్కొన్నారే తప్ప, మీ క్లయింట్ పేరెక్కడా ప్రస్తావించలేదు. ఆ మాట తనను ఉద్దేశించినదే అని మీ క్లయింటే తనకు ఆపాదించుకున్నారు. మీ క్లయింట్ ఆపాదించి నట్లు నా క్లయింట్ ‘యాస్పర్జెర్’తో బాధపడట్లేదు. ఆమెకు మానసిక రుగ్మత లేదు.