కంగనతో పెట్టుకుంటే అంతేనా? | Adhyayan not sorry for calling Kangana abusive, writes fresh tweets | Sakshi
Sakshi News home page

కంగనతో పెట్టుకుంటే అంతేనా?

Published Mon, May 2 2016 8:22 AM | Last Updated on Sun, Sep 3 2017 11:12 PM

కంగనతో పెట్టుకుంటే అంతేనా?

కంగనతో పెట్టుకుంటే అంతేనా?

గాసిప్
కంగనా రనౌత్, హృతిక్ రోషన్ మధ్య కొన్ని రోజులుగా జరుగుతున్న యుద్ధం గురించి తెలిసిందే. కొంత మంది కంగనా రనౌత్‌ది తప్పంటే, మరికొందరు హృతిక్‌దే తప్పని వాదిస్తున్నారు. ఈ మాజీ ప్రేమికుల తాజా గొడవ రోజు రోజుకీ ముదురు పాకాన పడుతోంది. ఇప్పుడు ఈ గొడవలోకి నటుడు అధ్యయన్ సుమన్  ఎంటరయ్యాడు. ఇతగాడికీ ఈ గొడవకీ లింకేంటి అనుకుంటున్నారా? అధ్యయన్ సుమన్ కొన్నాళ్లు కంగనాతో ప్రేమాయణం సాగించాడు. ఈ ఇద్దరూ కలిసి ‘రాజ్’ అనే సినిమాలో కూడా న టించారు.

ఆ తర్వాత ప్రేమకు టాటా చెప్పేసుకుని, ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. అప్పట్నుంచీ కంగనాపై అధ్యయన్‌కి అక్కసు ఉందేమో ఇప్పుడు తీర్చేసుకున్నారు. అసలు కంగనా మామూలు అమ్మాయి కాదనీ, తనే హృతిక్ వెంటపడి ఉంటుందని అధ్యయన్ స్టేట్‌మెంట్ ఇచ్చేశాడు. అది మాత్రమే కాదు.. తామిద్దరూ ప్రేమించుకుంటున్నప్పుడు తనను కొట్టి హింసించేదని కూడా దిమ్మ తిరిగిపోయే మరో స్టేట్‌మెంట్ ఇచ్చేశాడు. ఇంకా.. కంగన గురించి బోల్డన్ని రహస్యాలను విప్పేశాడు అధ్యయన్. సరే... వీటి సంగతెలా ఉన్నా కంగన చేతబడులను నమ్ముతుందని కూడా అన్నాడు.

దాంతో కంగనకు ఆమడ దూరం మెయిన్‌టైన్ చేస్తే మంచిదని ఇరుగూ పొరుగూ అనుకుంటున్నారట. అమ్మడితో పెట్టుకుంటే చేతబడే అని బాలీవుడ్‌లో జోకులు కూడా వేసుకుంటున్నారని సమాచారం. ఇంతకీ.. అధ్యయన్ కావాలని అలా అన్నాడా? లేక కంగన నిజంగానే ఆ బ్లాక్ మేజిక్‌ని నమ్ముతుందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement