Stir
-
హైదరాబాద్ సంస్థాన విముక్తి సమరంలో చరిత్రకెక్కిన పరకాల పోరు
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ స్వాతంత్య్ర పోరాటానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది పరకాల అమరధామం. అక్కడి మట్టి.. రజాకార్లు పారించిన రక్తపుటేర్లకు సాక్ష్యం.. నిరంకుశ నిజాం నుంచి స్వాతంత్య్రాన్ని కాంక్షించి అమరులైన యోధుల పోరాటానికి సాక్ష్యం. అదే.. మరో జలియన్ వాలాబాగ్ ఘటనగా చరిత్రలో నిలిచిపోయిన పరకాల ఊచకోత ఘటన. సరిగ్గా 73 ఏళ్ల క్రితం.. 1947, సెప్టెంబర్ 2న జాతీయ పతాకాన్ని ఎగురవేయాలనే కాంక్షతో చుట్టుపక్కల గ్రామాల నుంచి విశేష సంఖ్యలో హాజరైన ప్రజలపై రజాకార్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ మారణహోమం మరో జలియన్ వాలాబాగ్‌గా మారింది. రజాకార్లపై పోరాడి ఎందరో అసువులుబాసి అమరవీరులుగా నిలిచారు. అలాంటి ఉద్యమంలో హనుమకొండ జిల్లా పరకాలది ప్రత్యేక స్థానం. సెప్టెంబర్ 2, 1947న పరకాల సమీపంలో ఉన్న పైడిపల్లి తాళ్ల నుంచి విమోచనోద్యమకారులు భారత జాతీయ జెండా ఎగురవేయడానికి పరకాలకు వచ్చారు. రజాకార్లు ఈ విషయం పసిగట్టి ఉద్యమకారులు జాతీయజెండాను ఎగురవేయనీకుండా అడ్డుకోమని నిజాంతో ఆదేశం జారీ చేయించారు. ఖాసింరజ్వీ నేతృత్వంలో పరకాల సర్కిల్ ఇన్స్పెక్టర్ జియాఉల్లా, మేజిస్ట్రేట్ విష్ణువేశ్వర్ రావులు మూడు లారీల బలగాలను రంగంలోకి దింపారు. శాంతి భద్రతల పరిరక్షణ పేరుతో ఉద్యమకారులపై తుపాకీగుళ్ల వర్షం కురింపిచారు. పరకాల చాపలబండ వద్ద గుమిగూడిన ఉద్యమకారులపై దాడిచేశారు. కత్తులు, బల్లాలు, బరిశెలతో మారణకాండ కొనసాగించగా 19 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురిని రంగాపూర్ గ్రామంలో చెట్టుకు కట్టేసి గొడ్డలి, బరిసెలు, తుపాకులతో కాల్చి చంపారు. ఈ మారణహోమంలో శ్రీశైలం, గజ్జి పర్వతాలు (కనిపర్తి), కుంట అయిలయ్య (నాగుర్లపల్లె), బత్తుల సమ్మయ్య, ఆముధాపురం వీరన్న, మేకల పోచయ్య,(రాయపల్లె), మంత్రి కేదారి, పోతుగంటి పెద్దులు (దమ్మన్నపేట), గుండారపు కొమరయ్య, దాతుపెల్లి రాజయ్య, కుమ్మరి రాములు (రేగొండ), గెల్లే కట్టమల్లు (దామరంచపల్లె), జాలిగపు ముసలయ్య, తొనగరు పూర్ణాసింగ్ (చల్లగరిగె), కలువాల అంకూస్ (గోవిందాపురం) తదితరులు అమరులయ్యారు. ఆకుతోట మల్లయ్య, రాజ్‌మహ్మద్, వర్దెల్లి వీరయ్యలను చెట్లకు కట్టేసి కాల్చి చంపారు. నిజాం పోలీసులు, రజాకార్లు వెంటాడి 200 మందికిపైగా ఉద్యమకారులను తీవ్రంగా గాయపర్చారు. సాయుధ పోరాటానికి కేరాఫ్... నిజాం రాక్షసకృత్యాలను వ్యతిరేకిస్తూ రహస్య జీవితం గడుపుతున్న ఉద్యమనేతలు ప్రతీకారం తీర్చుకోవడానికి మహరాష్ట్రలోని చాందా బోర్డర్ క్యాంప్‌లో మాజీ ప్రధాని పీవీ నరసింహరావు సారథ్యంలో తొలివిడత వంద మంది సాయుధ శిక్షణ పొందారు. పిస్తోల్, రైఫిల్స్, మందు గుండు సామగ్రి సేకరించి చంద్రగిరి గుట్టలను కేంద్రంగా చేసుకొని సాయుధ పోరాటం జరిపారు. సాయధ దళాలు జమీందార్లు, జాగీర్దారులు, పెత్తందార్లు, మక్తెదారులకు చరమగీతం పాడాయి. ఈ దాడులను తట్టుకోలేక నిజాం పోలీసులు గ్రామాల్లో ప్రజలను విచక్షరహితంగా హింసించారు. చివరకు 1948 సెప్టెంబర్ 17న సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు నిజాం ప్రభుత్వం లొంగిపోవటంతో ఇక్కడి ప్రజలు స్వేచ్ఛా వాయువు పీల్చుకున్నారు. (క్లిక్ చేయండి: ‘కొరియర్’గా.. వారియర్‌గా!) రాత్రి వేళల్లో సమావేశాలు: చంద్రారెడ్డి అలియాస్ రంజిత్ నిజాం పాలనకు తిరుగుబాటుదారులైన ఎస్.మనోహర్‌రావు, కె.వి.నర్సింగరావు ఆదేశాలతో రాత్రివేళల్లో గ్రామాల్లో యువకులతో సమావేశాలు నిర్వహించేవాళ్లు. చాలామంది యువకులను మహారాష్ట్ర చందా ప్రాంతానికి పంపించి అక్కడ ఆజాద్ హింద్‌ఫౌజ్ నుంచి విరమణ పొందిన సైనికులతో ప్రత్యేక గెరిల్లా శిక్షణ ఇప్పించారు. జనవరిలో చందాకు వెళ్లిన వారిలో నేనూ ఉన్నా. 1948 మార్చి వరకు గెరిల్లా శిక్షణ పొందాను. అనంతరం మారుపేర్లతోనే స్వగ్రామాలకు చేరుకున్నాం. అదే సమయంలో ఉద్యమం తీవ్రంగా కొనసాగుతుండటంతో దామెర మండలంలోని చంద్రగిరి గుట్టలను షెల్టర్‌గా మార్చుకొని సాయుధపోరుకు శ్రీకారం చుట్టాం. చాపలబండ వద్ద రజాకార్ల తూటాల నుంచి తప్పించుకున్న నన్ను వారం రోజులకు పట్టుకున్నారు. చిత్రహింసలకు గురిచేసి.. చనిపోయాడనుకొని వెళ్లిపోయారు. కానీ కొన ఊపిరితో బయటపడ్డాను. (క్లిక్: మందు పాతరలు.. చివరి అస్త్రం) -
రైతు ఉద్యమం: టికాయత్ సంచలన ప్రకటన
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాల రద్దు ఉద్యమం కొత్త రూపం తీసుకుంటోంది. ఎన్ని వేధింపులు.. అడ్డంకులు సృష్టించినా రైతులు వెనుతిరగడం లేదు. చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లోనే రైతులు, రైతు నేతలు భీష్మించుకుని కూర్చున్నారు. గణతంత్ర దినోత్సవం రోజు ఎర్రకోటపై జెండా ఎగురేయడంపై ఉద్యమం తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా శనివారం జాతీయ రహదారుల దిగ్బంధం (చక్కా జామ్) కార్యక్రమం చేపట్టగా దేశవ్యాప్తంగా విశేష స్పందన లభించింది. అయితే తాము ఇప్పట్లో ఇళ్లకు వెళ్లమని.. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి వరకు అక్కడే కూర్చుంటామని రైతు సంఘాల నేతలు తేల్చిచెప్పారు. చక్కా జామ్ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ- ఉత్తరప్రదేశ్ రహదారి ఘాజీపూర్ సరిహద్దు వద్ద జరిగిన ఆందోళనలో భారత్ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికాయత్ మాట్లాడారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లో దురాక్రమణదారులు తమ ఉద్యమాన్ని హింసాత్మకం చేయాలని చూశారని ఆరోపణలు చేశారు. ఈ రహదారుల దిగ్బంధం ఈరోజుతో ముగిసేది కాదని.. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి వరకు కొనసాగుతుందని రాకేశ్ ప్రకటించారు. అప్పటివరకు రోడ్లపైనే వ్యవసాయం చేస్తామని సంచలన ప్రకటన చేశారు. రోడ్లను దున్ని వ్యవసాయం చేస్తామని స్పష్టం చేశారు. తాజాగా రైతుల ఈ పిలుపుతో ఉద్యమం తారస్థాయికి చేరనుంది. -
ద్వేషం.. క్షణికావేశం !
క్షణికావేశంతో యువత తమ భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంటున్నారు. కళాశాలలో చోటుచేసుకున్న చిన్న గొడవ చివరికి విద్యార్థి హత్యకు దారి తీసింది. విద్యార్థుల్లో పెరుగుతున్న హింసా ప్రవృత్తి అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. రాజంపేట: తాము చదువుతున్న కళాశాలలో విద్యార్థుల మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవ చివరికి ఓ విద్యార్థి ప్రాణాలను బలితీసుకుంది. సోదరభావంతో మెలగాల్సిన విషయాన్ని గాలికి వది లేసి సీనియర్, జూనియర్ అనే భేదభావంతో ఈర‡్ష్య, ద్వేషాలు పెంచుకుని చివరికి చంపుకొనే స్థాయికి వెళ్లారు. కళాశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో కాలు తగిలిందనే కారణంతో ఇద్దరు విద్యార్థుల మధ్య రగిలిన పగ కన్నవారికి కడుపుకోతను మిగిల్చింది. రాజంపేటలోని ఓ కళాశాలలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న సోము సాయి (20), అదే కళాశాలలో బీటెక్ ఫస్ట్ ఇయ ర్ చదువుతున్న వంశీల మధ్య కొన్ని రోజుల క్రి తం ఓ కార్యక్రమంలో చిన్న గొడవ జరిగింది. దీంతో సాయిపై వంశీపై కసి పెంచుకున్నాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం సాయితో సన్నిహితంగా మెలిగే సాయికుమార్ అనే విద్యార్థి సాయం తీసుకున్నాడు వంశీ. అతని ద్వారా మాట్లాడాలని చెప్పి సోము సాయిని అంతగా జనం సంచారంలేని ప్రదేశానికి పిలిపించాడు. అక్కడ వంశీ అతనితో మాట్లాడుతూనే కత్తితో దాడి చేశాడు. నివ్వెరపోయిన సాయికుమార్ పట్టణ పోలీసులకు లొంగిపోయి సోముసాయి హత్యకు దారితీసిన పరిస్థితులను వివరించినట్లు తెలిసింది. కాగా హత్య అనంతరం పాత పోలీసు స్టేషన్ సమీపంలో ఉంటున్న మరో విద్యార్థి వద్దకు వంశీ వెళ్లి అతని బైకు తీసుకుని పరారైనట్లు తెలిసింది. ఈ విషయాన్ని సీఐ యుగంధర్ ధ్రువీకరించారు. దీంతో పట్టణ పోలీసులు ఏ1గా వంశీ, ఏ2గా సాయికుమార్‌పై కేసు నమోదు చేశారు. ఒక్కగానొక్క కొడుకు లేకుండాపోయే... మండలంలోని వరదయ్యగారిపల్లెకు చెందిన పాలేటి శివయ్య, రత్నమ్మ దంపతుల ఏకైక కుమారుడు సోముసాయి. వీరు రాజంపేట పట్ట ణంలోని ఆర్ఎస్ రోడ్డులో చిల్లర అంగడి నిర్వహించుకుంటూ జీవి స్తున్నారు. కాగా తండ్రి కొన్ని రో జుల క్రితం షిర్డి సాయినాథున్ని దర్శించుకునేందుకు వెళ్లాడు. సో ముసాయి మృతితో ఆ దంపతులకు కడుపుకోత మిగిలింది. వి ద్యార్థి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం విద్యార్థులు నివా ళులర్పించి ర్యాలీగా మృతదేహాన్ని తీసుకెళ్లారు. మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఏఐటీఎస్ వైస్‌చైర్మన్ సోము సాయి కుటుంబాన్ని ఏఐటీఎస్ వైస్‌చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ నారాయణలు పరామర్శించారు. బిడ్డను కోల్పోయిన తల్లిని ఓదార్చారు. అలాగే మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. -
స్టేషన్లోనే తన్నుకున్నారు..!
బద్వేలు(అట్లూరు): బద్వేలు పోలీస్‌స్టేషన్‌లో ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు రాజు, మంత్రిగా రాజ్యమేలుతున్నారు. తప్పులు చేసిన వారి నుంచి డబ్బులు తీసుకుని కేసుల నుంచి తప్పిస్తున్నారు. పై అధికారులు సైతం వారు చెప్పినదే తడవుగా తలూపుతున్నట్లు సమాచారం. నాలుగు రోజుల క్రితం ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి తెచ్చుకున్న మామూళ్లను పంచుకోవడంలో తలెత్తిన విభేదాలు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఒకరు హెడ్‌కానిస్టేబుల్, మరొకరు కానిస్టేబుల్. హెడ్ కానిస్టేబుల్ రైటర్‌గా, కానిస్టేబుల్ ఐడీ పార్టీలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ స్టేషన్లో ఇటీవల చోటుచేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నాలుగు రోజుల క్రితం ఎర్రచందనం దుంగల లోడుతో వాహనం వెళ్తోందని.. ఆ ఇద్దరికి వేర్వేరుగా సమాచారం అందింది. వారు ఎవరికి వారు మైదుకూరు రోడ్డులోని చెన్నంపల్లి, నందిపల్లి మార్గంమధ్యలో ఆ వాహనాన్ని నిలిపారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించి ఆ వాహనాన్ని స్టేషన్‌కు తీసుకు రావాల్సింది పోయి స్మగ్లర్లతో బేరసారాలకు దిగారు. ఇద్దరు వేర్వేరుగా డిమాండ్ చేస్తే ఎలా.. ఇద్దరు కలసి చెప్పాలని వారు అన్నారు. దీంతో ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. వారు మూడు లక్షలు ఇచ్చినట్లు సమాచారం. అయితే ఆ మూడు లక్షల పంపకంలో హెడ్ కానిస్టేబుల్ నాకు రెండు భాగాలు కావాలనడంతో.. ఆయనకు కానిస్టేబుల్‌కు మధ్య గొడవ జరిగింది. స్టేషన్లోనే నోటి మాటలతో మొదలై బూతులకు దారి తీసింది. చివరకు కొట్టుకున్నారు. దీంతో ఆ స్టేషన్ ఎస్ఐ వారి మధ్య సర్దుబాటు చేసినట్లు తెలిసింది. అలాగే వారు ఆరుగురు మట్కా నిర్వాహకులను ఇటీవల తీసుకొచ్చారు. అందులో తండ్రీకొడుకు ఉండగా కొడుకును తప్పించి భారీ మొత్తంలో వసూలు చేసుకున్నట్లు సమాచారం. ఇలా అన్ని పంచాయితీలలో ఆ ఇద్దరిదే స్టేషన్లో కీలక పాత్ర. గతంలోనూ ఇంతే.. ఆ ఇద్దరూ ఎనిమిదేళ్లుగా ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు. గతంలో వీరిపై పలు అవినీతి ఆరోపణలు రావడంతో ఉన్నత అధికారులు ఒకరిని రైల్వేపోలీస్‌స్టేషన్‌కు, ఒకరిని జిల్లా చివరి మండలానికి పనిష్మెంట్ కింద సాగనంపారు. తర్వాత పలుకుబడిని ఉపయోగించుకుని నెలలలోనే మళ్లీ అదే స్టేషన్‌కు వచ్చారు. విచారణ చేస్తా.. ఈ విషయంపై బద్వేలు సీఐ రెడ్డెప్పను ‘సాక్షి’ వివరణ అడగగా.. ‘ఎవరండీ మీరు. ఎక్కడ రిపోర్టరు. మాస్టేషన్లో జరిగినట్లు నా దృష్టికి రాలేదు. అయినా సరే విచారణ చేస్తా’ అని అన్నారు. -
బంధం.. బలహీనం
మద్యంమత్తు.. భర్త చేతిలో భార్యను తీవ్రగాయాలు పాలుజేస్తే, ఆవేశం.. తమ్ముడి చేతిలో అన్న జీవితాన్నే బలితీసుకుంది. జిల్లాలో ఒకేరోజు జరిగిన ఈ సంఘటనలు దిజారుతున్న మానవ సంబంధాలను మరోమారు గుర్తు చేశాయి. ఆలిని నరికేశాడు.. ∙భార్యపై కత్తితో దాడి ∙పరిస్థితి తీవ్ర విషమం ∙పరారీలో నిందితుడు బైరెడ్డిపల్లె: మద్యం మహమ్మారి ఆ కుటుంబాన్ని దెబ్బతీసింది. తాగిన మైకంలో భర్త.. తాను మనిషినన్న విచక్షణ కోల్పో యాడు. మృగాడిగా మారి అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను కత్తితో కర్కశంగా నరికేశాడు. ఆ అభాగ్యురాలి ఆక్రందనలను పట్టించుకోకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు గుర్తించి.. ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో ఆ వివాహిత కొట్టుమిట్టాడుతోంది. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని కుప్పనపల్లెలో మంగళవారం భార్యపై భర్త కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఎస్ఐ ఉమామహేశ్వర్‌రెడ్డి కథనం మేరకు వి.కోట మండల ముమ్మిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన నవనీత (26)తో కుప్పనపల్లె గ్రామానికి చెందిన జగదీశ్వరాచారి(35)కి ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరి కాపురం కొన్ని రోజుల పాటు సజావుగా కొనసాగింది. అనంతరం భర్త జగదీశ్వరాచారి తాగుడుకు బానిసై భార్యను నిత్యం వేధించేవాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కత్తితో తల, నోటిపై నరకడంతో నవనీత అపస్మారక స్థితిలోకి చేరుకుంది. 108 సిబ్బంది కుప్పం పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నవనీతం పరిస్థితి పూర్తి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సంఘటనా స్థలం పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. కాగా జగదీశ్వరాచారి పరారీలో ఉన్నాడు. అన్నను హతమార్చాడు.. ∙కర్రతో కొట్టిచంపిన వైనం సత్యవేడు: తమ్ముడు కర్రతో కొట్టిన ఘటనలో సత్యవేడు మండలం పెద్ద ఈటిపాకం దళితవాడకు చెందిన రాబర్ట్(50) మృతి చెందాడు. ఎస్ఐ కథనం మేరకు వివరాలు.. సోమవారం రాత్రి పెద్ద ఈటిపాకం దళితవాడలో బంధువుల ఇంటికి జైపాల్ భోజనం కోసం వెళ్లాడు. భోజనం లేదని బంధువుల చెప్పారు. దీంతో వారితో గొడవకు దిగాడు. ఇంటికి వచ్చి బంధువులు భోజనం పెట్టలేదని తన అన్నకు చెప్పాడు. తరచూ అయినవారిపై గొడవకు వెళుతుంటే ఎవరూ నీకు భోజనం పెట్టరని.. రాబర్ట్ తమ్ముడు జైపాల్‌ను మందలించాడు. అనంతరం తమ్ముడితో మాట్లాడుతూ సమీపంలోని రోడ్డు వద్దకు వచ్చాడు. ఆవేశంలో విచక్షణ కోల్పోయిన జైపాల్ సమీపంలో దొరికిన కర్రతో కొట్టాడు. కింద పడి పోయిన అన్నను రోడ్డుకు సమీపంలోని శ్మశానం వరకు లాక్కెళ్లాడు. రాబర్ట్ తమ్ముడితో వెళ్లి ఎంతసేపటికీ రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆయన భార్య వెతుకులాట ప్రారంభించింది. భర్త గాయాలతో పడి ఉండడాన్ని గమనించి వెంటనే సత్యవేడు వైద్యశాలకు తరలించింది. వైద్యులు పరీక్షించి అప్పటికే రాబర్ట్ మరణించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
ఉద్రిక్తతకు దారితీసిన స్థల వివాదం
► పెందుర్తి సమీపంలో రెండు వర్గాల కొట్లాట ► ఇరువర్గాల్లో 28 మందిపై కేసుల నమోదు పెందుర్తి : ఓ స్థలం పట్టా కోసం ఒక కుటుంబంలో వచ్చిన చిన్నపాటి గొడవ కొట్లాటకు దారితీసింది. చినికి చినికి గాలివానై రక్తం చిందించింది. మొత్తానికి ఓ ఫ్యాక్షన్ సినిమాలో సన్నివేశాన్ని తలపించిన ఈ ఘటన పెందుర్తి సమీపంలోని అంబేద్కర్‌నగర్ వద్ద ఉన్న ఏకలవ్యకాలనీ(పందులకాలనీ)లో శుక్రవారం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం.. కాలనీలో గతంలో ప్రభుత్వం మంజూరు చేసిన పటా్టల విషయంలో ఓ కుటుంబంలో వివాదం నడుస్తుంది. వాడపల్లి దసరా అనే వ్యక్తి కుటుంబానికి చెందిన కొందరు వ్యకు్తలు సదరు పటా్టల అమ్మకంపై కొన్నాళు్లగా గొడవ పడుతున్నారు. దీనిపై శుక్రవారం మరోసారి కాలనీలో బహిరంగంగా ఒకరిని ఒకరు దూషించుకున్నారు. పరిస్థితి చేదాటి కర్రలు, రాళ్లు, ఇతర ఆయుధాలతో పరస్పరం దాడులకు దిగారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ కాలనీలో బీభత్సం సృష్టించారు. వీధుల్లో పరుగులు పెడుతూ రణరంగంగా మార్చేశారు. ఒకరిపై ఒకరు రాళ్లు రువు్వకుని, కర్రలతో దాడి చేసుకున్నారు. దీంతో పలువురికి తీవ్ర గాయాలయా్యయి. గాయపడ్డవారిలో మహిళలు కూడా ఉన్నారు. స్థానికులకూ గాయాలు పరస్పరం దాడులు చేసుకున్న సమయంలో కాలనీలో ఉన్న ఇతరులకు కూడా గాయాలయా్యయి. విచక్షణారహితంగా రాళ్లు, కర్రలు విసురుకోవడంతో గొడవ చూస్తున్న వారికి కూడా దెబ్బలు తగిలాయి. మరోవైపు గొడవ జరుగుతున్న సమాచారంతో ఘటనాస్థలికి వచ్చిన పోలీసులను సైతం ఇరువర్గాలు పట్టించుకోకుండా రాళ్లు రువు్వకున్నారు. దాదాపు గంటసేపు శ్రమించిన పోలీసులు అతికష్టం మీద పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆందోళనకారులను చెదరగొట్టి పలువురిని పోలీస్‌స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకోగా.. 28 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని సీఐ జె.మురళి చెప్పారు. -
గొడవ పెట్టుకుంటారు మొబైల్ కొట్టేస్తారు
గన్‌ఫౌండ్రీ: నగరంలోని పలు చౌరస్తాలలో ప్రయాణికులతో గొడవకు దిగి వారి వద్ద నుంచి ఖరీదైన మొబైల్ఫోన్లను దొంగిలిస్తున్న ఓ అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.25లక్షల విలువ గల 65 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం సైఫాబాద్‌లోని సెంట్రల్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ కమల్‌హాసన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్‌కు చెందిన మహ్మద్ ఇమ్రాన్ ఖురేషి(23), షారుఖ్ బెద్రి పతన్(21), ఫరజ్ పతన్(21), మహ్మద్ నయీం(55), మహ్మద్ అనాస్ ఖురేషి(19) రెండు గ్రూప్‌లుగా ఏర్పడి కారులో ఒంటరిగా డ్రెవింగ్ సీటు పక్కన ఫోన్ పెట్టుకొని ప్రయాణిస్తున్న వాహనదారులను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నట్లు తెలిపారు. వాహనదారులను కొంత దూరం వెంబడించి ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద కారు ఆపగానే ముందు టైర్ తమ కాళ్లపైకి వచ్చిందటూ ఒకరు గొడవ పడుతుండగా మరోవైపు నుంచి మరో ఇద్దరు వచ్చి ఫోన్లు ఎత్తుకెళ్లేవారన్నారు. ఇటీవల పలు పోలీస్స్టేషన్ల పరిధిలో ఈ తరహా ఫిర్యాదులు రావడంతో దీనిపై దృష్టి సారించమన్నారు. సైఫాబాద్ పోలీసులు మాసబ్‌ట్యాంక్ చౌరస్తాలో తనిఖీలు నిర్వహిస్తుండగా అక్కడ ఒక వాహనదారుడితో గొడవ పడుతున్న ముఠాను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడిందన్నారు. వీరు ట్రూప్ బ్యాండ్ సభ్యులుగా చెప్పుకుని అఫ్జల్‌గంజ్‌లోని ఒక లాడ్జిలో ఉంటున్నట్లు గుర్తించామన్నారు. ఈ ముఠా హైదరాబాద్‌తో పాటు బెంగుళూరు, ముంబాయి నగరాల్లోనూ ఈ తరహా దాడులకు పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. ప్రధాన సూత్రధారి బురతో పాటు ఇతర నిందితులు షాకీర్, సాజిద్ పరారీలో ఉండగా, అదుపులోకి తీసుకున్న ఐదుగురు నిందితులను రిమాండ్‌కు తరలించామన్నారు. సమావేశంలో ఏసీపీ సురేందర్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ పూర్ణచందర్, నరహరి, డీఎస్సైలు శ్రీకృష్ణ, నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జలం.. జగడం
శ్రీశైలం నుంచి నీళ్లిస్తేనే సాగర్ కుడి కాలువకు నీళ్లిస్తాం కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ 4 టీఎంసీల నీటి విడుదలపై మెలిక మరో వివాదానికి తెరతీసినట్లే..! సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ కుడి కాలువకు నాలుగు టీఎంసీలు విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మెలిక పెట్టింది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి సాగర్‌కు నీటిని విడుదల చేస్తేనే సాగర్ కుడి కాలువకు నీళ్లిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)కు లేఖ రాసింది. శ్రీశైలం రిజర్వాయర్‌లో 802.7 (డెడ్ స్టోరేజీ) అడుగుల మట్టంలో 30.35 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. డెడ్ స్టోరేజీ కారణంగా నీటిని దిగువకు విడుదల చేసే అవకాశాలు లేవు. ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణా జలాల వినియోగంపై ఈ నెల 20న కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ అయింది. ఈ సందర్భంగా సాగర్ కుడి కాలువకు తాగునీటి అవసరాలకు 8, కృష్ణా పుష్కరాలకు 4, సాగు, తాగునీటి అవసరాలకు ఎడమ కాలువకు 4.. మొత్తం 16 టీఎంసీల నీటిని తక్షణమే విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. అదే సమయంలో హైదరాబాద్ తాగునీటి అవసరాలు, ఇతరత్రా అవసరాల నిమిత్తం మొత్తం 7 టీఎంసీలు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. అయితే సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కనిష్ట స్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఆ మేరకు నీటì విడుదల సాధ్యం కాదని బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ అన్నారు. ఇరు రాష్ట్రాల నీటిపారుదల కార్యదర్శులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని.. అందువల్ల సాగర్ కుడి కాలువకు తక్షణమే 4 టీఎంసీలు విడుదల చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం ఈనెల 22న కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. ఆ మేరకు నీటిని విడుదల చేయాలని కోరుతూ ఈనెల 25న కృష్ణా బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనికి జవాబుగానే టీ సర్కార్ మంగళవారం కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. శ్రీశైలం ప్రస్తుత నీటిమట్టం 802.7 అడుగులే.. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. గరిష్టంగా 215.807 టీఎంసీలను నిల్వ చేయొచ్చు. కనీసం 854 (మినిమం డ్రా డౌన్ లెవల్) అడుగుల మట్టం ఉంటేనే నీటిని విడుదల చేయాలి. అంతకన్నా తక్కువ ఉంటే చేయకూడదు. కానీ 1996లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఎండీడీఎల్‌ను 834 అడుగులకు (జీవో 69) తగ్గించింది. దీనిపై అప్పట్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో 2004లో ప్రభుత్వం ఎండీడీఎల్‌ను 854 అడుగులకు పునరుద్ధరించింది. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో గతేడాది 790 అడుగుల వరకు నీటిని వాడుకునేలా ఇరు రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయి. కానీ 786 అడుగుల వరకు నీటిని వినియోగించుకున్నాయి. దీని వల్ల రాయలసీమ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. శ్రీశైలం రిజర్వాయర్‌లో 874 అడుగుల నీటిమట్టం ఉంటేనే దిగువకు నీటిని విడుదల చేయాలని సీమ రైతులు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు నీళ్లందించే అవకాశం ఉంటుంది. శ్రీశైలంలో ప్రస్తుతం 802.7 అడుగుల నీటిమట్టమే ఉంది. అయినా నీటి విడుదలకు ఏపీ ప్రభుత్వం అంగీకరిస్తే, గతేడాది తరహాలోనే తెలంగాణకు విద్యుదుత్పత్తి చేసుకునే అవకాశాన్ని కల్పించినట్లవుతుందని నిపుణులు అంటున్నారు. -
పచ్చని సంసారంలో ఫోన్ చిచ్చు..
దుండిగల్: ఫోన్ విషయంలో భార్యతో గొడవ జరగడంతో ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దుండిగల్ ఎస్ఐ పవన్ కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా కొల్లూరు గ్రామానికి చెందిన యహోషువా (24), మనీషాలు ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 11 నెలల పాప ఉంది. మనీషా ప్రస్తుతం గర్భవతి. వీరు ఏడాది క్రితం జీవనోపాధి కోసం నగరానికి వచ్చి గండిమైసమ్మ శ్రీరామ్‌నగర్ లో ఉంటున్నారు. యహోషువా స్థానిక ప్రైవేట్‌పరిశ్రమలో ఫిట్టర్‌గా పని చేస్తున్నాడు. మనీషాను చూసేందుకు ఆమె తల్లిదండ్రులు ఆదివారం వచ్చారు. వారితో యహోషువా మాట్లాడకుండా ముభావంగా ఉన్నాడు. మనీషాకు తల్లిదండ్రులు ఇంటి సామగ్రితో పాటు ఫోన్ కొనిచ్చారు. తనకు తెలియకుండా ఫోన్‌ను ఎలా కొనిస్తారంటూ యహోషువా భార్య తో గొడవ పడ్డాడు. ఇదే క్రమంలో రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన అతను 11 గంటల సమయంలో ఉరేసుకొనేందుకు యత్నించగా భార్య అడ్డుకుంది. తర్వాత నిద్రకు ఉపక్రమించారు. కాగా, తెల్లవారుజాము 4 గంటలకు మనీషా నిద్రలేచి చూసేసరికి భర్త ఫ్యాన్‌కు ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కంగనతో పెట్టుకుంటే అంతేనా?
గాసిప్ కంగనా రనౌత్, హృతిక్ రోషన్ మధ్య కొన్ని రోజులుగా జరుగుతున్న యుద్ధం గురించి తెలిసిందే. కొంత మంది కంగనా రనౌత్‌ది తప్పంటే, మరికొందరు హృతిక్‌దే తప్పని వాదిస్తున్నారు. ఈ మాజీ ప్రేమికుల తాజా గొడవ రోజు రోజుకీ ముదురు పాకాన పడుతోంది. ఇప్పుడు ఈ గొడవలోకి నటుడు అధ్యయన్ సుమన్ ఎంటరయ్యాడు. ఇతగాడికీ ఈ గొడవకీ లింకేంటి అనుకుంటున్నారా? అధ్యయన్ సుమన్ కొన్నాళ్లు కంగనాతో ప్రేమాయణం సాగించాడు. ఈ ఇద్దరూ కలిసి ‘రాజ్’ అనే సినిమాలో కూడా న టించారు. ఆ తర్వాత ప్రేమకు టాటా చెప్పేసుకుని, ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. అప్పట్నుంచీ కంగనాపై అధ్యయన్కి అక్కసు ఉందేమో ఇప్పుడు తీర్చేసుకున్నారు. అసలు కంగనా మామూలు అమ్మాయి కాదనీ, తనే హృతిక్ వెంటపడి ఉంటుందని అధ్యయన్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. అది మాత్రమే కాదు.. తామిద్దరూ ప్రేమించుకుంటున్నప్పుడు తనను కొట్టి హింసించేదని కూడా దిమ్మ తిరిగిపోయే మరో స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఇంకా.. కంగన గురించి బోల్డన్ని రహస్యాలను విప్పేశాడు అధ్యయన్. సరే... వీటి సంగతెలా ఉన్నా కంగన చేతబడులను నమ్ముతుందని కూడా అన్నాడు. దాంతో కంగనకు ఆమడ దూరం మెయిన్టైన్ చేస్తే మంచిదని ఇరుగూ పొరుగూ అనుకుంటున్నారట. అమ్మడితో పెట్టుకుంటే చేతబడే అని బాలీవుడ్లో జోకులు కూడా వేసుకుంటున్నారని సమాచారం. ఇంతకీ.. అధ్యయన్ కావాలని అలా అన్నాడా? లేక కంగన నిజంగానే ఆ బ్లాక్ మేజిక్‌ని నమ్ముతుందా? -
అదుపులోకి హరియాణా
జింద్‌లో కర్ఫ్యూ ఎత్తివేత, రోహ్తక్లో 4 గంటల పాటు పలు ప్రాంతాల్లో తగ్గని ఉద్రిక్తత.. రాస్తారోకోలు, ఆందోళనలు రోహ్తక్లో సీఎం ఖట్టర్ పర్యటన.. కాన్వాయ్‌ను ముట్టడించిన స్థానికులు చండీగఢ్: జాట్ల రిజర్వేషన్ పోరాటంతో అట్టుడుకుతున్న హరియాణాలో పరిస్థితి కాస్త తెరిపిచ్చింది. ఉద్రిక్తతలు తగ్గినా పలుచోట్ల కర్ఫ్యూ కొనసాగుతోంది. రిజర్వేషన్ల అంశాన్ని పరిశీలి స్తామని కేంద్రం హామీ ఇవ్వడంతో పలు చోట్ల ఆందోళనలను విరమించగా.. మరికొన్ని ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రజలు అత్యవసర వస్తువులను కొనుగోలు చేసేందుకు రోహ్తక్ ప్రాంతంలో 4 గంటలపాటు కర్ఫ్యూను సడలించి.. తిరిగి విధించారు. జింద్ జిల్లాలో కర్ఫ్యూను పూర్తిగా ఎత్తివేశారు. హిస్సార్, హన్సి, భివానిలలో నిరవధిక కర్ఫ్యూ కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు పహారా కాస్తున్నాయి. కాగా, సీఎం ఖట్టర్ రోహ్తక్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా పలువురు ఆందోళనకారులు సీఎం కాన్వాయ్‌ను ముట్టడించారు. పట్టణంలో విధ్వంసం సృష్టించినవారిని, లూటీలకు పాల్పడినవారిని పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు. తొలగిన అడ్డంకులు.. రహదారుల దిగ్బంధాన్ని ఆందోళనకారులు విరమించుకోవటంతో.. ప్రయాణికులు, నిత్యావసర వస్తువుల రవాణాకు కాస్తంత ఉపశమనం లభించింది. అంబాలా-ఢిల్లీ హైవేపై పానిపట్ వరకూ మార్గంపై అడ్డంకులు తొలగిపోయాయి. రైలు మార్గాలపై ధర్నాలను కూడా ఆందోళనకారులు విరమించారు. రిజర్వేషన్‌పై కమిటీ భేటీ జాట్ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అధ్యక్షతన ఏర్పాటుచేసిన ఉన్నతస్థాయి కమిటీ.. మంగళవారం హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సమావేశమైంది. కోటా అమలుకు సంబంధించిన పలు అంశాలపై చర్చించింది. మరోవైపు, పంజాబ్-హరియాణా హైకోర్టు కూడా జాట్ల ఆందోళనకు సంబంధించి ప్రస్తుత పరిస్థితిని వచ్చే సోమవారంలోగా వివరించాలని హరియాణా ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
నమస్తే పెట్టలేదని....
బంజారాహిల్స్: నమస్తే పెట్టలేదన్న చిన్న కారణం రెండు వర్గాల మధ్య గొడవకు దారితీసి కొట్టుకున్నారు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... జహీరానగ ర్కు చెందిన మహ్మద్ ఫిర్దోస్, అఫ్రోజ్, అన్వర్ తదితరులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో జహీరానగర్‌కు చెందిన కొందరు యువకులు అటుగా వెళ్తున్నారు. తమకు నమస్తే పెట్టలేదనే అక్కసుతో ఫిర్దోస్ తదితరులు వారితో గొడవకు దిగారు. ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకోవడంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అదే సమయంలో స్టేషన్‌కు వస్తున్న బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు రెండు వర్గాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరందరిపై న్యూసెన్స్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బ్రిటన్‌లో ‘చిల్లర’ గొడవ
ఆ నేడు 14 అక్టోబర్ 1969 విలువను బట్టి కరెన్సీ నాణేల రూపాలు, ఆకృతులు వేర్వేరుగా ఉండాలి. అప్పుడే వాటిలోని వ్యత్యాసాలను తేలిగ్గా కనిపెట్టగలం. లావాదేవీలను వేగంగా చేయగలం. కానీ ఎందుకనో ప్రభుత్వాలు కొన్నిసార్లు ఈ విషయాన్ని గమనించినట్టు కనిపించవు! అందుకు నిదర్శనమే మనం ఇప్పుడు రూపాయి, రెండు రూపాయల నాణేలతో పడుతున్న ‘చిల్లర’ గొడవ. సాధారణంగా చిల్లర గొడవ అంటే చిల్లర లేక పడే గొడవ. కానీ ఇప్పుడు చిల్లర ఉండీ గొడవ పడుతుండడం మన దగ్గర మూమూలయింది. భారత ప్రభుత్వం ఒక రూపాయి, రెండు రూపాయల నాణేల మధ్య వాటి వాటి రూపాలలో, సైజులలో పాటించవలసినంత వ్యత్యాసాన్ని పాటించకుండా ముద్రించడంతో.. సిటీ బస్సులలో, మార్కెట్లో అయోమయం ఎక్కువైంది. నాణేలను ఇచ్చిపుచ్చుకోవడంలో జాప్యం జరుగుతోంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితే 1969తో బ్రిటన్‌లో తలెత్తింది. ఆ ఏడాది అక్టోబర్ 14న ఏడు భుజాలతో ఇంగ్లండ్ ప్రభుత్వం విడుదల చేసిన 50 పెన్నీల నాణెం... అప్పటికే చెలామణిలో ఉన్న పది పెన్నీల నాణేన్ని పోలి ఉండడంతో జనంలో మొదటిరోజే తికమక మొదలైంది. ఆ తర్వాత కొద్ది కాలానికే బ్రిటన్ ఆ పొరపాటును దిద్దుకుని కొత్త నాణేన్ని విడుదల చేసింది. మన దగ్గర అలాంటి దిద్దుబాట్లు జరిగితే బాగుంటుంది. -
భార్యతో గొడవ పడి ఆత్మహత్య
హైదరాబాద్: భార్యతో గొడవపడిన వ్యక్తి తాగిన మైకంలో నీళ్ల ట్యాంక్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం హైదరాబాద్‌లోని మైనర్దేవ్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. లక్ష్మీగూడకు చెందిన వెంకటేష్ రాజీవ్ గృహకల్పలో నివాసముంటూ స్థానికంగా చేపల వ్యాపారం చేస్తున్నాడు. కాగా, వెంకటేష్ బుధవారం భార్య మీనాతో గొడవ పడ్డాడు. అయితే, అప్పటికే విపరీతంగా మద్యం సేవించిన వెంకటేష్ నీళ్ల ట్యాంక్ ఎక్కి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తారా చౌదరి ఇంట్లో గొడవ...ముగ్గురిపై కేసు
హైదరాబాద్:సినీ నటి తారా చౌదరి నివాసంలో గురువారం రాత్రి ఘర్షణ జరిగింది. ఇందుకు సంబంధించి ముగ్గురిపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలివీ.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని ఇందిరానగర్ ఫేజ్-3 వివేకానంద స్కూల్ సమీపంలో సినీ నటి తారాచౌదరి అలియాస్ రావిళ్ల రాజేశ్వరి నివాసముంటోంది. నివాసంతో పాటు సినిమా కార్యాలయం కూడా అక్కడ కొనసాగుతోంది. గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆమె నివాసంలో రామినేని దుర్గాప్రసాద్ అనే వ్యక్తి మద్యం మత్తులో తారాచౌదరిని వేధింపులకు గురి చేశాడు. దీంతో ఆమె...గత కొద్ది రోజుల నుంచి సినిమాలో హీరో వేషం కోసం తన కార్యాలయం చుట్టూ తిరుగుతున్న వీరమాచినేని సందీప్ అనే యువకుడిని పిలిపించింది. దీంతో సందీప్ తన స్నేహితుడు ఉదయ్, రాజేష్‌ను వెంటబెట్టుకుని ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడ హల్చల్ చేస్తున్న దుర్గాప్రసాద్‌ను సందీప్ అడ్డుకోబోయాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. తన భార్యతో గొడవ పడుతుంటే మధ్యలో మీకెందుకంటూ ప్రసాద్ వారిని నెట్టివేశాడు. సందీప్ రాయితో కొట్టడంతో ప్రసాద్‌కు గాయాలయ్యాయి. గొడవ పెద్దది కావటంతో తారాచౌదరి రాత్రి 10 గంటల సమయంలో పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు వారందరినీ స్టేషన్‌కు తరలించారు. దుర్గాప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సందీప్, ఉదయ్, రాజేష్‌లపై పోలీసులు ఐపీసీ 448, 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
అజ్ఞాతంలో విష్ణు, బెయిల్‌కు యత్నం
-
అజ్ఞాతంలో విష్ణు, బెయిల్‌కు యత్నం
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి అరెస్ట్‌కు మాదాపూర్ పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. వంశీచంద్ రెడ్డిపై దాడి కేసుకు సంబంధించి ప్రత్యేక టీమ్..గురువారం ఉదయం అదుపులోకి తీసుకునేందుకు అతని నివాసానికి వెళ్లారు. అయితే విష్ణు ఆ సమయంలో ఇంట్లో అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయన రెండు సెల్ఫోన్లు కూడా స్విచ్చ్ ఆఫ్ చేసి ఉన్నట్లు సమాచారం. మరోవైపు విష్ణు రంగారెడ్డి కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ పై విచారణను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. కాగా విష్ణువర్దన్‌రెడ్డి నిన్న గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యను కలిశారు. కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డితో జరిగిన గొడవకు సంబంధించిన వివరాలు ఆయనకు తెలిపారు. విష్ణువర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వంశీతో జరిగిన గొడవ విచారకరం.మా గొడవకు, పార్టీకి ఏ సంబంధం లేదు. మేమంతా కాంగ్రెస్ కుటుంబ స భ్యులం..' అని పేర్కొన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో ఇద్దరు నేతల మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. వంశీచంద్ రెడ్డిపై పోలీసులకిచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటారా అన్న ప్రశ్నకు విష్ణు స్పందించ లేదు -
పొన్నాలను కలిసిన విష్ణువర్దన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్‌రెడ్డి బుధవారం గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యను కలిశారు. కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డితో జరిగిన గొడవకు సంబంధించిన వివరాలు ఆయనకు తెలిపారు. అనంతరం విష్ణువర్దన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్యే వంశీతో జరిగిన గొడవ విచారకరం. మా గొడవకు, పార్టీకి ఏ సంబంధం లేదు. మేమంతా కాంగ్రెస్ కుటుంబ స భ్యులం..’ అని పేర్కొన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో ఇద్దరు నేతల మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. వంశీచంద్ రెడ్డిపై పోలీసులకిచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటారా అన్న ప్రశ్నకు విష్ణు స్పందించ లేదు. -
ఘర్షణెందుకురా మగడా అంటే...?
ఉత్త(మ)పురుష మావారికి నాతో గిల్లికజ్జాలు పెట్టుకోవడం అంటే చాలా సరదా. నాకేమో ఇంట్లో ప్రశాంతత ఇష్టం. ఏ చిన్న సంఘటన జరిగినా చాలు... దాంట్లోంచి ఏదో ఒక పాయింట్‌ను పట్టుకుని అదేపనిగా వాదిస్తుంటారాయన. ఆయన వాదనలెలా ఉంటాయంటే... నేనోరోజు పప్పు వండుతాను. ఆరోజు చికెన్ ఎందుకు చేయలేదని గొడవ. ఇవ్వాళ్ల శనివారం కదా అందుకే వండలేదంటాను నేను. అప్పుడు స్పీచ్ మొదలు... ‘‘నువ్వసలు జీవహింసే చేయదలచుకోలేదనుకో. ఇక చికెన్ తినడం పూర్తిగా మానెయ్. అంతేగానీ... శనివారం ఒక్కరోజు తినకుండా ఉండి, ఆ తర్వాతి రోజుల్లో తింటూ ఉంటే ఏం లాభం? పైగా నువ్వు ఆ ఒక్క రోజూ వండనంత మాత్రాన నిన్ను కోడిజనబాంధవురాలని ఎవరూ అనరు. అంతరించిపోతున్న కోడి జాతికి నువ్వు చేసిన సేవలకు నీకెవరూ పక్షివిభూషణ, పక్షిభూషణ, పక్షిరత్న లాంటి బిరుదేమీ ఇవ్వరు. కాబట్టి ఇలాంటివేవీ పెట్టుకోకు. ఇకనుంచి శనివారమైనా కోడి వండాల్సిందే’’ అంటూ లెక్చర్ ఇస్తారు. అసలు ఆయనకు ఇదేం బుద్ధో నాకు అర్థం కాదు. ఆయనకు తినాలని ఉంటే శనివారం మాత్రం నేను వండకుండా ఉంటానా? ‘‘ఇవ్వాళ్ల ఏం తింటారు మహానుభావా’’... అని నేను అడుగుతూనే ఉంటాను. ఓ పట్టాన జవాబివ్వరు. ఇక వంటకు ఆలస్యం అయిపోతోందంటూ హడావుడిగా ఏదో చేసేస్తాను. ఒకవేళ ఆయనకు నిజంగానే కోడి తినాలని ఉందే అనుకుందాం. మార్కెట్‌కు వెళ్లి చికెన్ తెచ్చి ఇవ్వవచ్చు కదా. అదేం చేయరు. కానీ... భోజనం తయారు అని నేననగానే ఆయనా తయారు... మళ్లీ గొడవకూ, ఘర్షణకు. ఆయన పెట్టే ఈ ఆరళ్లూ... ఈ అల్లర్లూ తట్టుకోలేక ఒక రోజున గట్టిగానే నిలదీశా. అలాంటి రియాక్షన్ నా నుంచి ఎదురు చూళ్లేదాయన. అందుకే కాస్త దెబ్బతిన్నట్టు చూశారు. కాస్త దార్లోకి వస్తూ వస్తూనే మళ్లీ ఎంత చెడ్డా ఆ పురుషాహంకారం కాస్త గాడి తప్పిస్తుంటుంది. ఆ పురుషాధిక్య బుద్ధి ఎక్కడికి పోతుందీ? అందుకే దిగి వస్తూ కూడా తన మాటల్లో కాస్త సైన్సూ, రొమాన్సూ కలగలిపి చెప్పారు. ‘‘ఏవోయ్... తరచు ఏదో ఒక విషయంపై గొడవ పడుతూ, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరెందుకూ, ఎప్పుడూ ఏదో ఘర్షణ లేకపోతే మీకు తోచదా?... గొడవ లేకుండా సంసార పడవ నడవదా అంటుంటావ్ కదా. ఎడ్డెమంటే తెడ్డెమంటూ అడ్డు వేస్తున్నామనుకో. అంటే ఏమిటన్నమాట? మన మధ్య ఘర్షణ ఉంటుందన్న మాట. ఘర్షణ అంటే మరేమిటో కాదు... ఫ్రిక్షన్. ఈ ఫ్రిక్షన్ వల్లనే గచ్చు మీద నడుస్తున్నా అడుగు కుదురుగా పడుతుంది. నడక చెదరకుండా సాగుతుంది. ఆ ఫ్రిక్షనే లేదనుకో. ఆ నడక గచ్చు మీద కాకుండా, రొచ్చులోన నడచినట్టయి, జర్రుమంటూ జారిపడతాం. కాబట్టి సంసారంలో నిత్యం కావాల్సిందే ‘ఘర్షణ’. అందుకే నిత్యం నీతో నా సంఘర్షణ’’ అంటూ ముగించారాయన. ఈ పురుషపుంగవులున్నారే! రొచ్చుమీద ఫ్రిక్షన్ తగ్గి కిందపడ్డా... తమ కాలుపైనే, పైపైనే అంటారు. ఏం మగాళ్లో ఏమో?! - వై! -
ఎమ్మెల్యే జయమంగళపై తెలుగు తమ్ముళ్ల వీరంగం
ముదినేపల్లి, న్యూస్‌లైన్ : పార్టీ కార్యకర్తల అభీష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణపై తెలుగు తమ్ముళ్లు తిరగబడ్డారు. ఎమ్మెల్యే, కార్యకర్తల మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగి టీడీపీలోని వర ్గవిభేదాలు మరోసారి బజారున పడ్డాయి. పార్టీ అధిష్టానం సైతం విస్మయం చెందే ఇలాంటి సంఘటన ముదినేపల్లిలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే మండలంలోని శ్రీహరిపురం సర్పంచ్ బడుగు జయమ్మ కుమారుడు భాస్కరరావు కాంగ్రెస్ పార్టీ స్థానిక ప్రముఖుడు. గుడ్లవల్లేరు మండలం వేమవరం కొండాలమ్మ గుడి వద్ద ఆదివారం ఆయన విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాగంటి బాబు, రాష్ట్ర కార్యదర్శి ఈడ్పుగంటి వెంకటరామయ్యలను, స్థానిక నేతలను ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని టీడీపీ మండల అధ్యక్షుడు కె.విఠల్, జిల్లా తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి చలసాని జగన్మోహనరావు, తెలుగు యువత మండల అధ్యక్షుడు పరసా విశ్వేశ్వరరావు, పార్టీ నాయకులు అడుసుమిల్లి రాము తీవ్రంగా వ్యతిరేకించారు. కార్యక్రమానికి హాజరుకావ ద్దంటూ ఎమ్మెల్యేను, ఇతర నాయకులను కోరారు. అయినప్పటికీ వీరి మాటలు పెడచెవిన పెట్టి ఎమ్మెల్యే వెంకటరమణ, రాష్ట్ర కార్యదర్శి ఈడ్పుగంటి వెంకటరామయ్యలు నాయకులతో కలిసి విందుకు తరలివెళ్లారు. దీంతో ఆగ్రహించిన తెలుగు యువత మండల అధ్యక్షుడు పరసా విశ్వేశ్వరరావు కైకలూరులోని ఎమ్మెల్యే నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలోని తన ఫొటోని చింపివేశారు. ఎమ్మెల్యేను నిలదీసిన వైనం... ఫొటో చించేసిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జయమంగళ విందు కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం స్థానిక పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో విందులో ఎందుకు పాల్గొన్నావంటూ ఎమ్మెల్యేను విఠల్, రాము, విశ్వేశ్వరరావు, చలసాని జగన్మోహనరావులు ప్రశ్నించి ఎమ్మెల్యే వర్గీయులను తీవ్ర పదజాలంతో దూషించారు. తాము వద్దన్న కాంగ్రెస్ కార్యకర్త ఆహ్వానాన్ని ఎందుకు మన్నించారని ప్రశ్నించారు. రాష్ట్ర కార్యదర్శి వెంకటరామయ్య మాటలు విని మండలంలోని పార్టీని నాశనం చేస్తున్నారని పేర్కొన్నారు. తాము వాస్తవాలను చెపుతున్నప్పటికీ వాటిని ఏమాత్రం ఖాతరు చేయకుండా ఈడ్పుగంటి నాయకత్వంలో పనిచేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే, కార్యకర్తల మధ్య మాటామాటా పెరిగి తోపులాటకు దారి తీసింది. ఒకరిపై ఒకరు చెయ్యి చేసుకునేందుకు సైతం ప్రయత్నించగా ఇరువర్గాల నాయకులు వారింపజేశారు. sదీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే క్రమశిక్షణలేని కార్యకర్తలు పార్టీలో ఉన్నా లేకున్నా ఒక్కటేనని, బయటకు వెళ్లిపోవాలని అన్నారు. ఈ తతంగం నడుస్తుండగానే ఇరు వర్గాల నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయంలో నానా హంగామా చేశారు. ప్రధాన రహదారిలో వచ్చి పోయే ప్రజలు ఈ తంతు చూసేందుకు పార్టీ కార్యాలయం ముందు గూమిగూడి తెలుగు తమ్ముళ్ల ఆగ్రహావేశాలను ముక్కున వేలేసుకుని తిలకించారు. తాగి పార్టీ పరువు తీస్తున్న ఎమ్మెల్యే... ఈ ఘటనపై టీడీపీలోని ఒక వర్గం నాయకులు తీవ్రంగా స్పందించారు. పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టారు. తరచూ ఎమ్మెల్యే మద్యం మత్తులో ఉంటూ కార్యకర్తలను తూలనాడుతూ పార్టీ పరువును గంగలో కలుపుతున్నారని టీడీపీ మండల అధ్యక్షుడు కె.విఠల్, తెలుగుయువత అధ్యక్షుడు పరసా విశ్వేశ్వరరావు విమర్శించారు. ఇందుకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈడ్పుగంటి వెంకటరామయ్య మద్దతు పలుకుతూ ఎమ్మెల్యే పతనానికి పరోక్షంగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యేను అల్లరి పాలు చేస్తే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధిష్టానం టిక్కెట్ ఇవ్వదని, ప్రత్యామ్నాయంగా తానే పోటీ చేయవచ్చనే దురుద్దేశంతో ఎమ్మెల్యేను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే కూడా తనకు టిక్కెట్ రాదనే ఉద్దేశంతో పార్టీని మండలంలో భూస్థాపితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే తాను చేసిన తప్పును సరిదిద్దుకుని నడవడిక మార్చుకోకుంటే రాజకీయంగా పతనం తప్పదని హెచ్చరించారు. -
సమైక్య హోరు 83వ రోజూ ఆగని జనోద్యమం
సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం వరుసగా 83వరోజూ సీమాంధ్ర జిల్లాల్లో ఉధృతంగా సాగింది. పలు జిల్లాల్లో భారీవర్షాలను సైతం లెక్కచేయక జనం రోడ్లపైకి వచ్చి సమైక్యనినాదాలు మార్మోగించారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం బోసుబొమ్మ సెంటర్లో రైతాంగ సమాఖ్య ఆధ్వర్యంలో రైతుగర్జన నిర్వహించారు. పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్లో నాన్‌పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. భీమవరం ప్రకాశం చౌక్‌లో విద్యార్థులు మానవహారంగా నిలబడ్డారు. చిత్తూరు జిల్లా పుంగ నూరులో ఆర్టీసీ కార్మికులు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. వీఆర్వోలు మురళి, రామకృష్ణ గోనెసంచుల్లో తలలు మాత్రం కనపడే విధంగా నిలబడి రాయలసీమ, కోస్తాంధ్ర ఫ్లకార్డులతో వినూత్నంగా నిరసన తెలిపారు. అనంతపురంలో భారీ ర్యాలీ చేపట్టి, టవర్ క్లాక్ వద్ద కేంద్ర మంత్రుల దిష్టి బొమ్మలను దహనం చేశారు. కృష్ణాజిల్లా జేఏసీ పిలుపు మేరకు చల్లపల్లిలో విద్యార్థులు, అవనిగడ్డలో ఎస్టీలు, కోడూరులో వ్యాయామ ఉపాధ్యాయులు దీక్షలు చేశారు. కర్నూలులో ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడించారు. జిల్లా వైద్య, ఆరోగ్య, రోడ్డు భవనాల శాఖల ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట రాస్తారోకో చేపట్టారు. ఆళ్లగడ్డ, డోన్లలో విద్యార్ధినీ, విద్యార్థినులు ర్యాలీలు నిర్వహించారు. -
24 గంటల పాటు తెలంగాణ బంద్
-
తిరుపతిలో టాక్సీడ్రైవర్స్ భారి ర్యాలీ
-
వైఎస్ఆర్ జిల్లాలో కొనసాగుతున్న విభజన సెగలు
కడప : వైఎస్ఆర్ జిల్లాలో రాష్ట్ర విభజన సెగలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం కూడా ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి కదల్లేదు. అన్ని డిపోల్లోనూ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వంటావార్పు చేపట్టారు. మరోవైపు చిత్తూరు జిల్లాలో మరో 72 గంటల పాటు జిల్లా బంద్ కొనసాగుతోంది. విద్యాసంస్థలు, ఆర్టీసీ కార్మికులు స్వచ్చందంగా బంద్ పాటిస్తున్నారు. ఎమ్మెల్యే సీకే బాబు నిరాహార దీక్ష ఆరో రోజుకు చేరుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు నేటి నుంచి మూడు రోజుల పాటు పెన్‌డౌన్ చేశారు. సమైక్యాంధ్ర జేఏసీ నెల్లూరు జిల్లాలో నేడు, రేపు ప్రభుత్వ కార్యాలయలకు బంద్ పాటిస్తున్నాయి. కర్నూలులో నేటి నుంచి మంత్రి టీజీ వెంకటేష్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు జరగనున్నాయి. కాగా నంద్యాలలో భూమా నాగిరెడ్డి నిరసన దీక్షకు దిగారు. అలాగే ఎంపీ నిమ్మల కిష్టప్ప లోక్‌సభ స్పీకర్‌కు రాజీనామా లేఖ ఇవ్వనున్నారు.