నమస్తే పెట్టలేదని.... | Did not Namaste .... | Sakshi
Sakshi News home page

నమస్తే పెట్టలేదని....

Published Tue, Feb 23 2016 11:46 PM | Last Updated on Sun, Sep 3 2017 6:15 PM

నమస్తే పెట్టలేదని....

నమస్తే పెట్టలేదని....

బంజారాహిల్స్: నమస్తే పెట్టలేదన్న చిన్న కారణం రెండు వర్గాల మధ్య గొడవకు దారితీసి కొట్టుకున్నారు.  బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... జహీరానగ ర్‌కు చెందిన మహ్మద్ ఫిర్దోస్, అఫ్రోజ్, అన్వర్ తదితరులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో జహీరానగర్‌కు చెందిన కొందరు యువకులు అటుగా వెళ్తున్నారు. తమకు నమస్తే పెట్టలేదనే అక్కసుతో ఫిర్దోస్ తదితరులు వారితో గొడవకు దిగారు.

ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకోవడంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అదే సమయంలో స్టేషన్‌కు వస్తున్న బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు రెండు వర్గాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  వీరందరిపై న్యూసెన్స్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement