NAMASTE
-
‘నమస్తే’ అంటూ చేతులు జోడించారు..
మాస్కో: ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ సంస్కృతిలో భాగమైన ‘నమస్తే’ పదం బాగా ప్రాచుర్యం పొందింది. కరోనా నుంచి తప్పించుకోవడానికి షేక్‌హ్యాండ్ బదులు చేతులతో నమస్కారం చేయడం శ్రేయస్కరమని పాశ్చాత్య దేశాలు గ్రహిస్తున్నాయి. కాగా ప్రస్తుతం భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యాలో పర్యటిస్తున్నారు. రష్యాలో జరగనున్న షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ కీలక సమావేశంలో పాల్గొనేందుకు రక్షణ మంత్రి నిన్న రాత్రి మాస్కో చేరుకున్నారు. రష్యన్ సైనికాధికారుల్లో ఒకరు షేక్ హ్యాండ్ ఇవ్వబోగా సున్నితంగా తిరస్కరించిన రాజ్ నాథ్ ‘నమస్తే’ అంటూ చేతులు జోడించారు. మరో సైనికాధికారి సైతం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించగా నమస్కారం చేయడంతో ఆ అధికారి సైతం ప్రతి నమస్కారం చేయడం విశేషం. మరోవైపు భారత్, రష్యా ద్వైపాక్షిక రక్షణ శాఖ బలోపేతం కావడానికి ఈ సమావేశాలు కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు తెలిపారు. కాగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఇరు దేశాల సహకరించుకో బాగా ఉపయోగించారు. గతంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో నమస్తే పదాన్ని బాగా ఉపయోగించారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా వచ్చినపుడు నమస్తే ట్రంప్ పేరుతో ఎన్నో కార్యక్రమాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నమస్తే పదం సోషల్ మీడియాలో వైరల్ అయింది. రష్యాలో రాజ్‌నాథ్ ‘నమస్తే’ పెట్టడం ద్వారా భారతీయుల మనసులు గెలుచుకున్నారు. చదవండి: రఫెల్ రాక.. రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు -
కరోనా ఎఫెక్ట్.. దండం పెట్టేస్తున్నారు
పారిస్: కరోనా మనందరి జీవితాల్లో పెను మార్పులు తెచ్చిందనండంలో ఎలాంటి సందేహం లేదు. మనతో పాటు ప్రపంచ దేశాల ప్రజలకు భారతీయ అలవాట్ల గొప్పతనం గురించి కరోనా సమయంలో బాగా తెలిసి వచ్చింది. ఈ నేపథ్యంలో స్వాగత పలకరింపుల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కరోనాకు ముందు విదేశీ పలకరింపుల్లో కరచాలనం, ఆలింగనం తప్పని సరిగా ఉండేవి. కానీ ప్రస్తుతం ఈ పరిస్థితి మారింది. ఇప్పుడు మనతో పాటు విదేశీయులు కూడా చక్కగా చేతులు జోడించి నమస్కారం, నమస్తే అంటూ స్వాగతం పలుకుతున్నారు. ఈ క్రమంలో జర్మనీ చాన్సలర్ ఏంజెల్ మార్కెల్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ మధ్య జరిగని నమస్తే స్వాగత పలకరింపుకు సంబంధించిన ఫోటోలు, వీడియో తెగ వైరలవుతున్నాయి. కరోనా మహమ్మారి, బెలారస్లో ఎన్నికల అనంతర తలెత్తిన అశాంతి, టర్కీతో పెరుగుతున్న ఉద్రిక్తతలతో సహా పలు విషయాల గురించి చర్చించడానికి ఇరువురు నాయకులు ఫ్రెంచ్ అధ్యక్షుడి వేసవికాల విడిదిలో సమావేశమవుతున్నారు. ఆ సమయంలో ఇలా ఒకరికొకరు నమస్తే చెప్పుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. (కరోనా వ్యాప్తికి విరుగుడు కనిపెట్టిన ప్రధాని) Willkommen im Fort de Brégançon, liebe Angela! pic.twitter.com/lv8yKm6wWV — Emmanuel Macron (@EmmanuelMacron) August 20, 2020 వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి, సామాజిక దూరం పాటించడం కోసం పలువురు ప్రపంచ దేశాధ్యక్షులు కరచాలనానికి స్వస్తి చెప్పి.. నమస్తేను ఎంచుకున్నారు. వీరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఉన్నారు. నమస్తేను మొదట ఆమోదించిన విదేశీ నేత ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి. ‘హ్యాండ్‌షేక్‌ను మర్చిపొండి. భారతీయ పద్దతి నమస్తేను అనుసరించండి. లేదంటే షాలోమ్ అని చెప్పండి’ అంటూ జనాలకు సూచించారు నెతన్యాహు. మార్చిలో, డొనాల్డ్ ట్రంప్ ఐరిష్ ప్రధాన మంత్రి లియో వరద్కర్‌ను చేతులు జోడించి నమస్కారం చెబుతూ పలకరించారు. ‘మేము ఈ రోజు కరచాలనం చేయలేదు. మేము ఒకరినొకరు చూసుకున్నాము. చూపుల ద్వారానే మేం ఏం చేయబోతున్నామో చెప్పుకున్నాము. ఇది ఒక విచిత్రమైన అనుభూతి’ అని ట్రంప్ విలేకరులతో అన్నారు. -
విశ్వవ్యాప్తమవుతున్న భారతీయ సంస్కృతి
లండన్ : ప్రపంచవ్యాప్తంగా ఇద్దరు మనుషులు కలిస్తే సాధారణంగా షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం ఇప్పటి వరకు చూశాము. అయితే కరోనా మహమ్మారి దెబ్బకు ఇప్పుడు షేక్ హ్యాండ్ల పరంపర మరుగున పడి, భారతీయుల సంస్కృతిలో భాగమైన నమస్కారం విస్తృతంగా వాడుకలోకి వస్తోంది. భారతీయ సంప్రదాయం ప్రకారం ఇద్దరు మనుషులు ఎదురైతే వినమ్రతతో రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తారు. (నాన్న కోసం నది దాటాడు) బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యువల్ మక్రాన్లు గురువారం కలుసుకున్నారు. ఈ క్రమంలోనే వారిద్దరూ ఇదివరకులా షేక్హ్యాండ్లు ఇచ్చుకోకుండా, నమస్కారంతో పలకరించుకున్నారు. వీరితో పాటూ బ్రిటన్ రాజవంశీయులు సైతం తమ అధికారిక కార్యక్రమాల్లో అగ్రనేతలను కలుసుకున్నప్పుడు నమస్కారంతోనే పలకరిస్తున్నారు.(డీఏసీఏపై ట్రంప్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ) గ్లోబలైజేషన్‌తో వివిధదేశాల నుంచి ప్రాజెక్టులే కాకుండా వారి అలవాట్లు కూడా భారత్‌లోకి రావడంతో కార్పోరేట్ సంస్థల్లో షేక్ హ్యాండ్ సంస్కృతి దాదాపు వచ్చింది. ఈ క్రమంలోనే అగ్గికి ఆజ్యం పోసినట్టు కరోనా వైరస్ వ్యాప్తికి షేక్ హ్యాండ్ సంస్కృతికి కూడా ఒక కారణం కావడంతో, వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఇప్పుడందరూ నమస్కారాన్ని వాడుతున్నారు. -
కరోనా ఎఫెక్ట్.. ఇక నమస్తే విశ్వవ్యాప్తం
కరోనా వైరస్ పేరు వింటనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. కరోనాకు మందు లేకపోవడంతో ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలన్నీ భారతీయ సంస్కృతిని పాటిస్తున్నాయి. సామాన్యుల నుంచి మొదలకుని పలు దేశాధినేతలు.. షేక్ హ్యాండ్‌కు స్వస్తి పలికి భారతీయ సంప్రదాయమైన ‘నమస్తే’ను ఫాలో అవుతున్నారు. ఇతరులను నమస్తే అంటూ పలకరించడం ప్రారంభించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రధాని మోదీ కూడా ప్రపంచం మొత్తం నమస్తేను ఆదరిస్తుందని అన్నారు. పలు కారణాలతో మన అలవాటు(నమస్తే)కు ముగింపు పలికినవారు.. తిరిగి ప్రారంభించడానికి ఇదే మంచి సమయమని అన్నారు. తాజాగా వైట్‌హౌస్‌లో సమావేశమైన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఐర్లాండ్ ప్రధాని లియో వరద్కర్లు ఒకరినొకరు నమస్తే అంటూ పలకరించుకున్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ..‘నేను ఇండియాలో పర్యటించినప్పుడు అక్కడ షేక్ హ్యాండ్ ఇవ్వడం చూడలేదు. వాళ్లు చాలా సులువుగా నమస్తే చెప్పుకుంటార’ని తెలిపారు. మరికొందరకు విదేశీ ప్రముఖులు కూడా షేక్‌హ్యాండ్ గుడ్ బై చెప్పి.. నమస్తే బాట పట్టారు. నమస్తే బాటలో.. ► ఇజ్రాయెల్ ప్రధాని బెంజమీన్ నెతన్యాహు షేక్‌హ్యాండ్ ఇవ్వడం మానుకోవాలని ప్రజలను కోరారు. దానికి బదులుగా భారతీయ సంప్రదాయ పద్ధతిలో నమస్తే చెప్పుకోవాలని పిలుపునిచ్చారు. ► ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మక్రాన్ కూడా అతిథులను నమస్తే అంటూ పలకరిస్తున్నారు. పారిస్ పర్యటనకు వచ్చిన స్పెయిన్ రాజు ఫెలిపేకు మక్రాన్ నమస్తేతో స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ► ప్రిన్స్ చార్లెస్ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చేందకు భయపడిపోతున్నారు. లండన్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన ప్రిన్స్ చార్లెస్.. షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించి వెంటనే నమస్తే చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యూకే దాదాపు 500 మందికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. దీంతో బ్రిటన్ రాజ కుటుంబం కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. చదవండి : ఐపీఎల్ 2020 వాయిదా కరోనాపై కీలక నిర్ణయం తీసుకోనున్న ఏపీ ప్రభుత్వం -
కరోనా వ్యాప్తికి విరుగుడు కనిపెట్టిన ప్రధాని
జెరూసలేం: కోవిడ్-19(కరోనా వైరస్) రక్కసి ప్రపంచ దేశాలకు నిద్ర లేకుండా చేస్తోంది. మనుషుల ప్రాణాలను హరించుకుపోతున్న దీని నివారణకు మందు కనిపెట్టే పనిలో శాస్త్రవేత్తలు తలమునకలయ్యారు. ఇదిలా ఉండగా ‘చికిత్స కన్నా నివారణ మేలు’ అన్న విధానాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమీన్ నెతన్యాహు అవలంభిస్తున్నారు. రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో దేశప్రజలకు సూచనలిచ్చారు. ఆయన తాజాగా కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి, వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాముఖంగా మాట్లాడుతూ దేశ ప్రజలు షేక్‌హ్యాండ్ ఇవ్వడం మానుకోవాలని కోరారు. దానికి బదులుగా భారతీయ సంప్రదాయ పద్ధతిలో నమస్తే చెప్పుకోవాలని కోరారు. (అప్పుట్లోనే ‘కరోనా’ను ఊహించారా?) రెండు చేతులను జోడించి నమస్కారం ఎలా పెట్టాలో కూడా చూపించారు. భారతీయ విధానంలోనే ఇతరులను పలకరించాలని, లేకపోతే షాలోమ్(హాయ్) చెప్పినా సరిపోతుందన్నారు. కానీ షేక్‌హ్యాండ్ మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఇవ్వకండని పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్‌లో ఇప్పటివరకు 15 మంది కరోనా బారిన పడగా, భారత్‌లో 28 కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా మూడువేల మంది దీనివల్ల ప్రాణాలు కోల్పోగా 90వేల మందికి పైగా ఈ వ్యాధితో బాధపడుతున్నారు. కాగా కరోనా మహమ్మారి గాలి ద్వారా సులువుగా ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించి వెళ్లాలని, అలాగే వ్యక్తిగత శుభ్రతతోపాటు, తరచూ చేతులు సబ్బుతో కడుక్కోవాలని సూచిస్తున్నారు. (దేశం కోసం గాయపడ్డాను: నెతన్యాహు భావోద్వేగం) -
నమస్తేను చైనీస్‌లో ఏమంటారు?
-
నమస్తేను చైనీస్‌లో ఏమంటారు?
న్యూఢిల్లీ/తేజ్‌పూర్: నమస్తే! అంటూ సరిహద్దుల్లో చైనా సైనికుల్ని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పలకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శనివారం సిక్కింలోని నాథులా సరిహద్దును ఆమె సందర్శించినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రతిగా చైనా సైనికులు కూడా నవ్వుతూ నమస్తే చేశారు. ‘నమస్తే అంటే అర్థం తెలుసా’ అని సీతారామన్ చైనా సైనికుల్ని ప్రశ్నించగా వారు కొంత అయోమయంగా ముఖం పెట్టారు. సాయపడేందుకు భారత సైనికులు ముందుకు రాగా రక్షణ మంత్రి వారిస్తూ.. వారినే సొంతంగా అర్థం చెప్పనివ్వండి అని సూచించారు. కొద్దిసేపటి అనంతరం ఒక చైనా సైనికుడు నవ్వుతూ.. ‘నమస్తే అంటే మిమ్మల్ని కలిసినందుకు ఆనందంగా ఉందని అర్థం’ అని చెప్పాడు. నమస్తేను మీ భాషలో ఏమంటారు? అని సీతారామన్ ప్రశ్నించగా.. ‘ని హావ్’ అంటూ చైనా సైనికులు సమాధానమిచ్చారు. ఈ వీడియోను రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. మరోవైపు ఆదివారం అస్సాంలోని తేజ్‌పూర్ ఎయిర్ బేస్ వద్ద సైనిక సన్నద్ధతపై సీనియర్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అధికారులతో సీతారామన్ సమీక్షించారు. సుఖోయ్ యుద్ధ విమానాల సన్నద్ధత, ఇతర అంశాలపై మంత్రి సమీక్షించారని రక్షణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. -
నమస్తే పెట్టలేదని....
బంజారాహిల్స్: నమస్తే పెట్టలేదన్న చిన్న కారణం రెండు వర్గాల మధ్య గొడవకు దారితీసి కొట్టుకున్నారు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... జహీరానగ ర్కు చెందిన మహ్మద్ ఫిర్దోస్, అఫ్రోజ్, అన్వర్ తదితరులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో జహీరానగర్‌కు చెందిన కొందరు యువకులు అటుగా వెళ్తున్నారు. తమకు నమస్తే పెట్టలేదనే అక్కసుతో ఫిర్దోస్ తదితరులు వారితో గొడవకు దిగారు. ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకోవడంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అదే సమయంలో స్టేషన్‌కు వస్తున్న బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు రెండు వర్గాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరందరిపై న్యూసెన్స్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నమస్తే మూవీ స్టిల్స్
-
‘నమస్తే’ ఆడియో ఆవిష్కరణ
-
నా జీవితంలో అదే జరిగింది : రాజా
‘‘ఓ మంచి కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. మనిషికి దేవుడి అండ ఉంటే, ఈ ప్రపంచంలో ఎవరూ అనాథలు కాదు. నా జీవితంలో అదే జరిగింది. నా చిన్నప్పుడే మా అమ్మా నాన్న చనిపోయారు. ఒక అనాథకు మరో అనాథ తోడై అసలు అనాథలే లేకుండా ఎలా చేశారు? అనేదే ఈ చిత్రం కథాంశం. పృథ్వీ రత్నం మంచి పాటలు స్వరపరిచారు’’ అని హీరో రాజా చెప్పారు. మాస్టర్ వరుణ్ జీ సమర్పణలో ఎ. రామ్‌కిషన్ జీ నిర్మించిన చిత్రం ‘నమస్తే’. రాజా, గెహనా వశిష్ట జంటగా నటించిన ఈ చిత్రానికి పానుగంటి శశిధర్ దర్శకుడు. హైదరాబాద్‌లో ఈ చిత్ర ఆడియో వేడుకలో పాల్గొన్న రచయిత చిన్నికృష్ణ సీడీని ఆవిష్కరించి, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు విజయేం దర్‌రెడ్డికి అందించారు. ప్రచార చిత్రాలను దర్శకుడు వి. సముద్ర, దేవీప్రసాద్ ఆవిష్క రించారు. సినిమా మీద మక్కువతో వ్యాపార రంగం నుండి ఇక్కడికొచ్చాననీ, ఈ చిత్రాన్ని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించా రనీ నిర్మాత చెప్పారు.