లండన్ : ప్రపంచవ్యాప్తంగా ఇద్దరు మనుషులు కలిస్తే సాధారణంగా షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం ఇప్పటి వరకు చూశాము. అయితే కరోనా మహమ్మారి దెబ్బకు ఇప్పుడు షేక్ హ్యాండ్‌ల పరంపర మరుగున పడి, భారతీయుల సంస్కృతిలో భాగమైన నమస్కారం విస్తృతంగా వాడుకలోకి వస్తోంది. భారతీయ సంప్రదాయం ప్రకారం ఇద్దరు మనుషులు ఎదురైతే వినమ్రతతో రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తారు. (నాన్న కోసం నది దాటాడు)
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యువల్ మక్రాన్‌లు గురువారం కలుసుకున్నారు. ఈ క్రమంలోనే వారిద్దరూ ఇదివరకులా షేక్‌హ్యాండ్‌లు ఇచ్చుకోకుండా, నమస్కారంతో పలకరించుకున్నారు. వీరితో పాటూ బ్రిటన్ రాజవంశీయులు సైతం తమ అధికారిక కార్యక్రమాల్లో అగ్రనేతలను కలుసుకున్నప్పుడు నమస్కారంతోనే పలకరిస్తున్నారు.(డీఏసీఏపై ట్రంప్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ)
గ్లోబలైజేషన్‌తో వివిధదేశాల నుంచి ప్రాజెక్టులే కాకుండా వారి అలవాట్లు కూడా భారత్‌లోకి రావడంతో కార్పోరేట్ సంస్థల్లో షేక్ హ్యాండ్ సంస్కృతి దాదాపు వచ్చింది. ఈ క్రమంలోనే అగ్గికి ఆజ్యం పోసినట్టు కరోనా వైరస్ వ్యాప్తికి షేక్ హ్యాండ్ సంస్కృతికి కూడా ఒక కారణం కావడంతో, వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఇప్పుడందరూ నమస్కారాన్ని వాడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment