నా జీవితంలో అదే జరిగింది : రాజా | Hero Raja and Gehana Vasisth's Movie NAMASTE Audio Launched | Sakshi
Sakshi News home page

నా జీవితంలో అదే జరిగింది : రాజా

Published Sun, Oct 26 2014 11:13 PM | Last Updated on Sat, Sep 2 2017 3:25 PM

నా జీవితంలో అదే జరిగింది : రాజా

నా జీవితంలో అదే జరిగింది : రాజా

‘‘ఓ మంచి కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. మనిషికి దేవుడి అండ ఉంటే, ఈ ప్రపంచంలో ఎవరూ అనాథలు కాదు. నా జీవితంలో అదే జరిగింది. నా చిన్నప్పుడే మా అమ్మా నాన్న చనిపోయారు. ఒక అనాథకు మరో అనాథ తోడై అసలు అనాథలే లేకుండా ఎలా చేశారు? అనేదే ఈ చిత్రం కథాంశం. పృథ్వీ రత్నం మంచి పాటలు స్వరపరిచారు’’ అని హీరో రాజా చెప్పారు. మాస్టర్ వరుణ్ జీ సమర్పణలో ఎ. రామ్‌కిషన్ జీ నిర్మించిన చిత్రం ‘నమస్తే’. రాజా, గెహనా వశిష్ట జంటగా నటించిన ఈ చిత్రానికి పానుగంటి శశిధర్ దర్శకుడు. హైదరాబాద్‌లో ఈ చిత్ర ఆడియో వేడుకలో పాల్గొన్న రచయిత చిన్నికృష్ణ సీడీని ఆవిష్కరించి, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు విజయేం దర్‌రెడ్డికి అందించారు. ప్రచార చిత్రాలను దర్శకుడు వి. సముద్ర, దేవీప్రసాద్ ఆవిష్క రించారు. సినిమా మీద మక్కువతో వ్యాపార రంగం నుండి ఇక్కడికొచ్చాననీ, ఈ చిత్రాన్ని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించా రనీ నిర్మాత చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement