Gehana
-
నా వయసున్నోళ్లు లవ్‌స్టోరీస్ కూడా చేస్తున్నారు
‘‘చోర్ బజార్’ ఎంటర్టైన్మెంట్, కమర్షియల్, కలర్‌ఫుల్ ఫిల్మ్. ఈ చిత్రంలో వైవిధ్యమైన పాత్ర చేశాను. ఇదొక మాస్ ఫిలిం. నా జానర్ దాటి బయటికొచ్చి ఈ సినిమా చేశాను’’ అని నటి అర్చన (‘నిరీక్షణ’ ఫేమ్) అన్నారు. ఆకాష్ పూరి, గెహనా సిప్పీ జంటగా జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చోర్ బజార్’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ చిత్రంలో కీలక పాత్ర చేసిన అర్చన మాట్లాడుతూ– ‘‘నా గురువులు, దర్శకులు నన్ను ఉన్నత స్థాయిలో నిలబెట్టారు. 300 సినిమాల్లో చేసిన హీరోయిన్‌కి ఎలాంటి గుర్తింపు ఇవ్వాలో అలాంటి గుర్తింపును భారతీయ సినిమా, నా దర్శకులు నాకు ఇచ్చారు.. ఆ గౌరవాన్ని పాడు చేసుకునే హక్కు నాకు లేదు. నేను చెన్నైలో ఉంటున్నాను. షూటింగ్ కోసం హైదరాబాద్ రాలేకపోయేదాన్ని. అందుకే తెలుగులో గ్యాప్ వచ్చింది. ఒకప్పుడు హీరో సరసన నటించిన హీరోయిన్ కొంత కాలానికి అదే హీరోకి సోదరి, వదిన, తల్లి, అత్త అవుతోంది. మన సినిమాల్లో మహిళా పాత్రలకు 80 శాతం ప్రాధాన్యత ఉండటం లేదు. మరాఠీలో మహిళలకు ఎక్కువ వైవిధ్యమైన పాత్రలు దక్కుతున్నాయి. నా వయసువాళ్లు అక్కడ లవ్ స్టోరీస్‌లో నటిస్తున్నారు.. బోల్డ్ సీన్స్ చేస్తున్నారు. ‘చోర్ బజార్లో’ నాది అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ పాత్ర. ఆయన్ను ప్రేమించి, ఆయన కోసం పెళ్లి కూడా చేసుకోకుండా ఉండిపోయే పాత్ర నాది. ఈ మూవీలో హీరో పేరు బచ్చన్ సాబ్. మా ఇద్దరికీ అమితాబ్ అంటే ఇష్టం. అర్చన అంటే నెక్ట్స్ డోర్ ఉమెన్ అనే ఇమేజ్ ఉంది.. ఆ గుర్తింపును ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాను. ప్రస్తుతం తమిళంలో ఒకటి, కన్నడలో ఒక ఆర్ట్ ఫిలిం చేస్తున్నాను. అలాగే ఓ వెబ్ సిరీస్‌లోనూ నటించనున్నాను’’ అన్నారు. -
నమస్తే మూవీ స్టిల్స్
-
‘నమస్తే’ ఆడియో ఆవిష్కరణ
-
నా జీవితంలో అదే జరిగింది : రాజా
‘‘ఓ మంచి కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. మనిషికి దేవుడి అండ ఉంటే, ఈ ప్రపంచంలో ఎవరూ అనాథలు కాదు. నా జీవితంలో అదే జరిగింది. నా చిన్నప్పుడే మా అమ్మా నాన్న చనిపోయారు. ఒక అనాథకు మరో అనాథ తోడై అసలు అనాథలే లేకుండా ఎలా చేశారు? అనేదే ఈ చిత్రం కథాంశం. పృథ్వీ రత్నం మంచి పాటలు స్వరపరిచారు’’ అని హీరో రాజా చెప్పారు. మాస్టర్ వరుణ్ జీ సమర్పణలో ఎ. రామ్‌కిషన్ జీ నిర్మించిన చిత్రం ‘నమస్తే’. రాజా, గెహనా వశిష్ట జంటగా నటించిన ఈ చిత్రానికి పానుగంటి శశిధర్ దర్శకుడు. హైదరాబాద్‌లో ఈ చిత్ర ఆడియో వేడుకలో పాల్గొన్న రచయిత చిన్నికృష్ణ సీడీని ఆవిష్కరించి, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు విజయేం దర్‌రెడ్డికి అందించారు. ప్రచార చిత్రాలను దర్శకుడు వి. సముద్ర, దేవీప్రసాద్ ఆవిష్క రించారు. సినిమా మీద మక్కువతో వ్యాపార రంగం నుండి ఇక్కడికొచ్చాననీ, ఈ చిత్రాన్ని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించా రనీ నిర్మాత చెప్పారు. -
అనుకున్నది ఒకటి... పాటలు
ఇప్పటివరకు 15 చిత్రాలకు పాటలు స్వరపరచిన సాకేత్ సాయిరామ్ ‘అనుకున్నది ఒకటి... అయ్యింది ఒకటి’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయ మవుతున్నారు. డాలీ భట్ నిర్మించిన ఈ చిత్రానికి పాటలు కూడా ఆయనే స్వరపరిచారు. విరాజ్, సిద్ధు గెహనా వశిష్ట్ ముఖ్య తారలు. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ఆడియో వేడుకలో తమ్మారెడ్డి భరద్వాజ్ సీడీలను ఆవిష్కరించి సునిల్కుమార్రెడ్డికి అందజేశారు. సాకేత్‌కి మంచి గుర్తింపు రావాలని భరద్వాజ్ ఆకాంక్షించారు. మంచి కథతో రూపొందిన ఈ చిత్రాన్ని ఆదరించాలని, సాకేత్‌కి మంచి పేరు రావాలని సునిల్‌కుమార్‌రెడ్డి చెప్పారు. కథ నచ్చడంవల్లే ఈ సినిమా నిర్మించానని నిర్మాత అన్నారు. సాకేత్ సాయిరామ్ మాట్లాడుతూ - ‘‘కిడ్నాప్ నేపథ్యంలో సాగే కామెడీ ఎంటర్టైనర్ ఇది. ఇందులో ఉన్న అయిదు పాటలూ డిఫరెంట్‌గా ఉంటాయి’’ అని చెప్పారు.