అనుకున్నది ఒకటి... పాటలు
అనుకున్నది ఒకటి... పాటలు
Published Mon, Oct 7 2013 2:17 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
ఇప్పటివరకు 15 చిత్రాలకు పాటలు స్వరపరచిన సాకేత్ సాయిరామ్ ‘అనుకున్నది ఒకటి... అయ్యింది ఒకటి’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయ మవుతున్నారు. డాలీ భట్ నిర్మించిన ఈ చిత్రానికి పాటలు కూడా ఆయనే స్వరపరిచారు. విరాజ్, సిద్ధు గెహనా వశిష్ట్ ముఖ్య తారలు.
హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ఆడియో వేడుకలో తమ్మారెడ్డి భరద్వాజ్ సీడీలను ఆవిష్కరించి సునిల్‌కుమార్‌రెడ్డికి అందజేశారు. సాకేత్‌కి మంచి గుర్తింపు రావాలని భరద్వాజ్ ఆకాంక్షించారు. మంచి కథతో రూపొందిన ఈ చిత్రాన్ని ఆదరించాలని, సాకేత్‌కి మంచి పేరు రావాలని సునిల్‌కుమార్‌రెడ్డి చెప్పారు.
కథ నచ్చడంవల్లే ఈ సినిమా నిర్మించానని నిర్మాత అన్నారు. సాకేత్ సాయిరామ్ మాట్లాడుతూ - ‘‘కిడ్నాప్ నేపథ్యంలో సాగే కామెడీ ఎంటర్‌టైనర్ ఇది. ఇందులో ఉన్న అయిదు పాటలూ డిఫరెంట్‌గా ఉంటాయి’’ అని చెప్పారు.
Advertisement
Advertisement