
కరోనా వైరస్ పేరు వింటనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. కరోనాకు మందు లేకపోవడంతో ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలన్నీ భారతీయ సంస్కృతిని పాటిస్తున్నాయి. సామాన్యుల నుంచి మొదలకుని పలు దేశాధినేతలు.. షేక్ హ్యాండ్‌కు స్వస్తి పలికి భారతీయ సంప్రదాయమైన ‘నమస్తే’ను ఫాలో అవుతున్నారు. ఇతరులను నమస్తే అంటూ పలకరించడం ప్రారంభించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రధాని మోదీ కూడా ప్రపంచం మొత్తం నమస్తేను ఆదరిస్తుందని అన్నారు. పలు కారణాలతో మన అలవాటు(నమస్తే)కు ముగింపు పలికినవారు.. తిరిగి ప్రారంభించడానికి ఇదే మంచి సమయమని అన్నారు.
తాజాగా వైట్‌హౌస్‌లో సమావేశమైన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఐర్లాండ్ ప్రధాని లియో వరద్కర్‌లు ఒకరినొకరు నమస్తే అంటూ పలకరించుకున్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ..‘నేను ఇండియాలో పర్యటించినప్పుడు అక్కడ షేక్ హ్యాండ్ ఇవ్వడం చూడలేదు. వాళ్లు చాలా సులువుగా నమస్తే చెప్పుకుంటార’ని తెలిపారు. మరికొందరకు విదేశీ ప్రముఖులు కూడా షేక్‌హ్యాండ్ గుడ్ బై చెప్పి.. నమస్తే బాట పట్టారు.
నమస్తే బాటలో..
► ఇజ్రాయెల్ ప్రధాని బెంజమీన్ నెతన్యాహు షేక్‌హ్యాండ్ ఇవ్వడం మానుకోవాలని ప్రజలను కోరారు. దానికి బదులుగా భారతీయ సంప్రదాయ పద్ధతిలో నమస్తే చెప్పుకోవాలని పిలుపునిచ్చారు.
► ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మక్రాన్ కూడా అతిథులను నమస్తే అంటూ పలకరిస్తున్నారు. పారిస్ పర్యటనకు వచ్చిన స్పెయిన్ రాజు ఫెలిపేకు మక్రాన్ నమస్తేతో స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
► ప్రిన్స్ చార్లెస్ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చేందకు భయపడిపోతున్నారు. లండన్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన ప్రిన్స్ చార్లెస్.. షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించి వెంటనే నమస్తే చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యూకే దాదాపు 500 మందికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. దీంతో బ్రిటన్ రాజ కుటుంబం కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది.
చదవండి : ఐపీఎల్ 2020 వాయిదా
కరోనాపై కీలక నిర్ణయం తీసుకోనున్న ఏపీ ప్రభుత్వం





Comments
Please login to add a commentAdd a comment