పారిస్: కరోనా మనందరి జీవితాల్లో పెను మార్పులు తెచ్చిందనండంలో ఎలాంటి సందేహం లేదు. మనతో పాటు ప్రపంచ దేశాల ప్రజలకు భారతీయ అలవాట్ల గొప్పతనం గురించి కరోనా సమయంలో బాగా తెలిసి వచ్చింది. ఈ నేపథ్యంలో స్వాగత పలకరింపుల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కరోనాకు ముందు విదేశీ పలకరింపుల్లో కరచాలనం, ఆలింగనం తప్పని సరిగా ఉండేవి. కానీ ప్రస్తుతం ఈ పరిస్థితి మారింది. ఇప్పుడు మనతో పాటు విదేశీయులు కూడా చక్కగా చేతులు జోడించి నమస్కారం, నమస్తే అంటూ స్వాగతం పలుకుతున్నారు. ఈ క్రమంలో జర్మనీ చాన్సలర్ ఏంజెల్ మార్కెల్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ మధ్య జరిగని నమస్తే స్వాగత పలకరింపుకు సంబంధించిన ఫోటోలు, వీడియో తెగ వైరలవుతున్నాయి. కరోనా మహమ్మారి, బెలారస్లో ఎన్నికల అనంతర తలెత్తిన అశాంతి, టర్కీతో పెరుగుతున్న ఉద్రిక్తతలతో సహా పలు విషయాల గురించి చర్చించడానికి ఇరువురు నాయకులు ఫ్రెంచ్ అధ్యక్షుడి వేసవికాల విడిదిలో సమావేశమవుతున్నారు. ఆ సమయంలో ఇలా ఒకరికొకరు నమస్తే చెప్పుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. (కరోనా వ్యాప్తికి విరుగుడు కనిపెట్టిన ప్రధాని)
Willkommen im Fort de Brégançon, liebe Angela! pic.twitter.com/lv8yKm6wWV
— Emmanuel Macron (@EmmanuelMacron) August 20, 2020
వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి, సామాజిక దూరం పాటించడం కోసం పలువురు ప్రపంచ దేశాధ్యక్షులు కరచాలనానికి స్వస్తి చెప్పి.. నమస్తేను ఎంచుకున్నారు. వీరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఉన్నారు. నమస్తేను మొదట ఆమోదించిన విదేశీ నేత ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి. ‘హ్యాండ్‌షేక్‌ను మర్చిపొండి. భారతీయ పద్దతి నమస్తేను అనుసరించండి. లేదంటే షాలోమ్ అని చెప్పండి’ అంటూ జనాలకు సూచించారు నెతన్యాహు. మార్చిలో, డొనాల్డ్ ట్రంప్ ఐరిష్ ప్రధాన మంత్రి లియో వరద్కర్‌ను చేతులు జోడించి నమస్కారం చెబుతూ పలకరించారు. ‘మేము ఈ రోజు కరచాలనం చేయలేదు. మేము ఒకరినొకరు చూసుకున్నాము. చూపుల ద్వారానే మేం ఏం చేయబోతున్నామో చెప్పుకున్నాము. ఇది ఒక విచిత్రమైన అనుభూతి’ అని ట్రంప్ విలేకరులతో అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment