అజ్ఞాతంలో విష్ణు, బెయిల్కు యత్నం
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి అరెస్ట్కు మాదాపూర్ పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. వంశీచంద్ రెడ్డిపై దాడి కేసుకు సంబంధించి ప్రత్యేక టీమ్..గురువారం ఉదయం అదుపులోకి తీసుకునేందుకు అతని నివాసానికి వెళ్లారు. అయితే విష్ణు ఆ సమయంలో ఇంట్లో అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయన రెండు సెల్ఫోన్లు కూడా స్విచ్చ్ ఆఫ్ చేసి ఉన్నట్లు సమాచారం. మరోవైపు విష్ణు రంగారెడ్డి కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ పై విచారణను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.
కాగా విష్ణువర్దన్‌రెడ్డి నిన్న గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యను కలిశారు. కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డితో జరిగిన గొడవకు సంబంధించిన వివరాలు ఆయనకు తెలిపారు. విష్ణువర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వంశీతో జరిగిన గొడవ విచారకరం.మా గొడవకు, పార్టీకి ఏ సంబంధం లేదు. మేమంతా కాంగ్రెస్ కుటుంబ స భ్యులం..' అని పేర్కొన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో ఇద్దరు నేతల మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. వంశీచంద్ రెడ్డిపై పోలీసులకిచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటారా అన్న ప్రశ్నకు విష్ణు స్పందించ లేదు