vansicand Reddy
-
'బోగస్ సర్వేలతో టీఆర్ఎస్ మైండ్‌గేమ్'
హైదరాబాద్: బోగస్ సర్వేలు, బోగస్ సభ్యత్వంతో టీఆర్ఎస్ మైండ్‌గేమ్ ఆడుతుదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి.అంతా బోగస్ కాకుంటే ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి ఫిరాయించిన వారిపై అనర్హతవేటు వేసి ఉప ఎన్నికలకు సిద్దంకావాలని ఆయన సవాల్ చేశారు. గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పరిపాలన బోగస్, సర్వేలు బోగస్, పార్టీ సభ్యత్వం బోగస్, ఇచ్చిన హామీలు బోగస్, హామీలను అమలుచేశామని చెప్పడం బోగస్ అని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతున్నదన్నారు. బడ్జెట్ లెక్కలన్నీ బోగస్ అని కాగ్ నివేదిక వెల్లడించిందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నినాదాలుగా ఉన్న నీళ్లు రాలేదు, నిధుల్లేవు, నియామకాలు అసలేలేవని వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. ఇప్పటిదాకా ప్రచారం చేసుకోవడం, ప్రజలను నమ్మించి మోసం చేయడం తప్ప ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలుచేయలేదన్నారు. పార్టీ సభ్యత్వానికి ఎక్కడా లేని ఆదరణ వస్తున్నదని ప్రచారం చేసుకోవడం పెద్ద బోగస్ అని వ్యాఖ్యానించారు. కాంట్రాక్టర్లను టీఆర్ఎస్ నాయకులు బెదిరించి, వేధించి సభ్యత్వ పుస్తకాలను నింపి పంపుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ నాయకులు ఈ విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నారని అన్నారు. టీఆర్ఎస్కు 100 సీట్లు వస్తాయని చేయించుకున్న సర్వే కూడా బోగస్ అని అన్నారు. టీఆర్ఎస్ పాలనపై సీఎం కేసీఆర్‌కు నమ్మకంలేకనే ఇలాంటి అబద్దాల సర్వేలతో ప్రజలను మోసం చేస్తున్నాడని, ప్రజాభిప్రాయాన్ని వక్రీకరిస్తున్నారని చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్కు, సీఎం కేసీఆర్‌కు నైతికత ఉంటే, గెలుస్తామనే నమ్మకముంటే ఇతరపార్టీల నుంచి చేరినవారి స్థానాల్లో ఉప ఎన్నికలకు సిద్దంకావాలని సవాల్ చేశారు. సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి, రీడిజైన్‌లో లోపాలు వంటివాటిపై కాంగ్రెస్‌పార్టీ చేసిన విమర్శలకు కట్టుబడి ఉన్నామన్నారు. పాలమూరు-రంగారెడ్డి మొదటి పంపుహౌజు రీడిజైన్‌ను వ్యతిరేకిస్తున్నామన్నారు. జడ్చర్లకు రైల్వేలైను, జిల్లా ప్రజల ప్రయోజనాలకోసం ముఖ్యమంత్రిని జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కలిసినట్టుగా వంశీచంద్‌రెడ్డి వెల్లడించారు. -
బీసీలపై కేసీఆర్ కపట ప్రేమ: వంశీచంద్
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్లో బీసీలకు రూ.6,738 కోట్లు కేటాయించినా కేవలం రూ.3 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టా రని, ఇప్పుడేమో బీసీల దృష్టి మళ్లించడానికి సీఎం కపట ప్రేమ చూపిస్తున్నారని ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, బీసీ సబ్‌ప్లాన్ అమలు చేస్తామని చెప్పిన సీఎం, దాని నుంచి తప్పించుకోవడా నికి బీసీలకు తాయిలాలను ప్రకటిస్తున్నారని ధ్వజమెత్తారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు నిధులను కేటాయించాలని, వాటిని ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. -
వారికీ కల్యాణలక్ష్మి వర్తింపజేయాలి
సాక్షి, హైదరాబాద్: అగ్రకులాల్లోని పేదలకూ కల్యాణ లక్ష్మి పథకాన్ని వర్తింపజేయాలని ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఆవరణలోని మీడియాపాయింట్ వద్ద మాట్లాడుతూ.. జీవో 5 ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 1.5 లక్షలు, పట్టణప్రాంతాల్లో 2 లక్షల ఆదాయం కన్నా తక్కువ ఉన్న ఈబీసీలకు కల్యాణ లక్ష్మి వర్తిస్తుందన్నారు. అయితే ఈబీసీ ధ్రువీకరణ ఉన్నవారికే ఈ పథకం వర్తిస్తుందని చెప్పడం వల్ల తెలంగాణలో ఎక్కువ జనాభా ఉన్న రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య, వెలమ కులాల్లోని పేదలకు కల్యాణలక్ష్మికి నోచుకోవడం లేదన్నారు. జీవో 231 ప్రకారం 13 కులాలకే ఈబీసీ ధ్రువపత్రాలు ఇస్తున్నారని, రెడ్డి, బ్రాహ్మణ, వెలమ, వైశ్య కులాలకు ఇవ్వడం లేదన్నారు. జీవో 5 ప్రకారం తక్కువ ఆదాయం ఉన్న అగ్రకులాలకు కల్యాణలక్ష్మి పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. -
అజ్ఞాతంలో విష్ణు, బెయిల్‌కు యత్నం
-
అజ్ఞాతంలో విష్ణు, బెయిల్‌కు యత్నం
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి అరెస్ట్‌కు మాదాపూర్ పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. వంశీచంద్ రెడ్డిపై దాడి కేసుకు సంబంధించి ప్రత్యేక టీమ్..గురువారం ఉదయం అదుపులోకి తీసుకునేందుకు అతని నివాసానికి వెళ్లారు. అయితే విష్ణు ఆ సమయంలో ఇంట్లో అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయన రెండు సెల్ఫోన్లు కూడా స్విచ్చ్ ఆఫ్ చేసి ఉన్నట్లు సమాచారం. మరోవైపు విష్ణు రంగారెడ్డి కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ పై విచారణను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. కాగా విష్ణువర్దన్‌రెడ్డి నిన్న గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యను కలిశారు. కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డితో జరిగిన గొడవకు సంబంధించిన వివరాలు ఆయనకు తెలిపారు. విష్ణువర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వంశీతో జరిగిన గొడవ విచారకరం.మా గొడవకు, పార్టీకి ఏ సంబంధం లేదు. మేమంతా కాంగ్రెస్ కుటుంబ స భ్యులం..' అని పేర్కొన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో ఇద్దరు నేతల మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. వంశీచంద్ రెడ్డిపై పోలీసులకిచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటారా అన్న ప్రశ్నకు విష్ణు స్పందించ లేదు -
పొన్నాలను కలిసిన విష్ణువర్దన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్‌రెడ్డి బుధవారం గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యను కలిశారు. కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డితో జరిగిన గొడవకు సంబంధించిన వివరాలు ఆయనకు తెలిపారు. అనంతరం విష్ణువర్దన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్యే వంశీతో జరిగిన గొడవ విచారకరం. మా గొడవకు, పార్టీకి ఏ సంబంధం లేదు. మేమంతా కాంగ్రెస్ కుటుంబ స భ్యులం..’ అని పేర్కొన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో ఇద్దరు నేతల మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. వంశీచంద్ రెడ్డిపై పోలీసులకిచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటారా అన్న ప్రశ్నకు విష్ణు స్పందించ లేదు.