హైదరాబాద్: భార్యతో గొడవపడిన వ్యక్తి తాగిన మైకంలో నీళ్ల ట్యాంక్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం హైదరాబాద్లోని మైనర్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. లక్ష్మీగూడకు చెందిన వెంకటేష్ రాజీవ్ గృహకల్పలో నివాసముంటూ స్థానికంగా చేపల వ్యాపారం చేస్తున్నాడు. కాగా, వెంకటేష్ బుధవారం భార్య మీనాతో గొడవ పడ్డాడు. అయితే, అప్పటికే విపరీతంగా మద్యం సేవించిన వెంకటేష్ నీళ్ల ట్యాంక్ ఎక్కి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.