జయసుధ.. ఈ పేరు తెలుగువారికి పరిచయం అక్కర్లేదు. అంతలా తెలుగు సినీ ప్రియుల గుండెల్లో తన పేరును లిఖించుకుంది. ఆనాటి స్టార్స్ ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు లాంటి దిగ్గజాల సరసన తనదైన నటనతో మెప్పించింది. తెలుగు, తమిళ తదితర భాషల్లో హీరోయిన్‌గా చాలా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత సహాయ నటిగా ఎన్నో సినిమాలు చేసింది. ఇప్పటికీ వెండితెరపై అభిమానులను అలరిస్తోంది. గతేడాది విజయ్ నటించిన చిత్రం వారీసు(వారసుడు)లో తల్లి పాత్రలో మెరిసింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన జయసుధ తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
తన భర్త ఆత్మహత్యకు అప్పులు కారణం కాదని వివరించింది. తాము నిర్మించిన చిత్రాలతో కష్టాలు పడ్డామని తెలిపింది. నా భర్త నితిన్ ఆరు సినిమాలు తీశారు. వాటిలో మూడు సక్సెస్ కాగా.. మరో మూడు చిత్రాలు ఫెయిల్ అయ్యానని పేర్కొంది. అందరూ అనుకున్నట్లు మాకు ఎలాంటి అప్పులు లేవని జయసుధ వివరించింది.
జయసుధ మాట్లాడుతూ.. 'నా భర్త ఫ్యామిలీలో వాళ్ల బ్రదర్ కూడా అలానే చనిపోయారు. వాళ్ల మా అత్తగారి తరఫున ఇద్దరు అలాగే సూసైడ్ చేసుకున్నారు. ఆయన సూసైడ్‌కు నేను కారణం కాదు. ఆ పరిస్థితి మన ఫ్యామిలీలో ఎవరికీ రాకూడదని కోరుకుంటున్నా. నేనే కదా సంపాదించేది. అప్పట్లో అప్పులంటే మాకు భయమే లేదు. మాకు సూసైడ్ చేసుకునేంత అప్పులు ఉండేవి కావు. కానీ సోషల్ మీడియా వచ్చాక ఎక్కువగా చెడునే ప్రచారం చేస్తున్నారు. కానీ ఇక్కడ మంచి కూడా ఉంది. నేను కూడా రోజు సోషల్ మీడియా చూస్తాను.' అని అన్నారు. ఆయనను కాపాడేందుకు మేము.. నా భర్త తరఫు ఫ్యామిలీ కూడా ఆయనను కాపాడడానికి చివరి వరకు ప్రయత్నించామని జయసుధ తెలిపారు. కానీ విధిరాత అనేది ఒకటి ఉంటుంది కదా? అని ఆమె అన్నారు.
ఆయన మరణం తర్వాత నేను షాక్‌లో ఉన్నానని తెలిపింది. కానీ ఆ తర్వాత దిల్ రాజు నిర్మించిన శతమానంభవతి సినిమా చేసినట్లు వివరించింది. ఫస్ట్ చేయకూడదని అనుకున్నా.. కానీ సినిమా చేయడం వల్లే ఆ విషాదం నుంచి బయటపడినట్లు జయసుధ వెల్లడించింది. ఆ సమయంలో నా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్‌గా ఉన్నారని జయసుధ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment