jayasudha husband
-
జయసుధ భర్త మరణం.. అప్పులపై జయసుధ క్లారిటీ!
జయసుధ.. ఈ పేరు తెలుగువారికి పరిచయం అక్కర్లేదు. అంతలా తెలుగు సినీ ప్రియుల గుండెల్లో తన పేరును లిఖించుకుంది. ఆనాటి స్టార్స్ ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు లాంటి దిగ్గజాల సరసన తనదైన నటనతో మెప్పించింది. తెలుగు, తమిళ తదితర భాషల్లో హీరోయిన్గా చాలా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత సహాయ నటిగా ఎన్నో సినిమాలు చేసింది. ఇప్పటికీ వెండితెరపై అభిమానులను అలరిస్తోంది. గతేడాది విజయ్ నటించిన చిత్రం వారీసు(వారసుడు)లో తల్లి పాత్రలో మెరిసింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన జయసుధ తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తన భర్త ఆత్మహత్యకు అప్పులు కారణం కాదని వివరించింది. తాము నిర్మించిన చిత్రాలతో కష్టాలు పడ్డామని తెలిపింది. నా భర్త నితిన్ ఆరు సినిమాలు తీశారు. వాటిలో మూడు సక్సెస్ కాగా.. మరో మూడు చిత్రాలు ఫెయిల్ అయ్యానని పేర్కొంది. అందరూ అనుకున్నట్లు మాకు ఎలాంటి అప్పులు లేవని జయసుధ వివరించింది. జయసుధ మాట్లాడుతూ.. 'నా భర్త ఫ్యామిలీలో వాళ్ల బ్రదర్ కూడా అలానే చనిపోయారు. వాళ్ల మా అత్తగారి తరఫున ఇద్దరు అలాగే సూసైడ్ చేసుకున్నారు. ఆయన సూసైడ్‌కు నేను కారణం కాదు. ఆ పరిస్థితి మన ఫ్యామిలీలో ఎవరికీ రాకూడదని కోరుకుంటున్నా. నేనే కదా సంపాదించేది. అప్పట్లో అప్పులంటే మాకు భయమే లేదు. మాకు సూసైడ్ చేసుకునేంత అప్పులు ఉండేవి కావు. కానీ సోషల్ మీడియా వచ్చాక ఎక్కువగా చెడునే ప్రచారం చేస్తున్నారు. కానీ ఇక్కడ మంచి కూడా ఉంది. నేను కూడా రోజు సోషల్ మీడియా చూస్తాను.' అని అన్నారు. ఆయనను కాపాడేందుకు మేము.. నా భర్త తరఫు ఫ్యామిలీ కూడా ఆయనను కాపాడడానికి చివరి వరకు ప్రయత్నించామని జయసుధ తెలిపారు. కానీ విధిరాత అనేది ఒకటి ఉంటుంది కదా? అని ఆమె అన్నారు. ఆయన మరణం తర్వాత నేను షాక్‌లో ఉన్నానని తెలిపింది. కానీ ఆ తర్వాత దిల్ రాజు నిర్మించిన శతమానంభవతి సినిమా చేసినట్లు వివరించింది. ఫస్ట్ చేయకూడదని అనుకున్నా.. కానీ సినిమా చేయడం వల్లే ఆ విషాదం నుంచి బయటపడినట్లు జయసుధ వెల్లడించింది. ఆ సమయంలో నా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్‌గా ఉన్నారని జయసుధ పేర్కొంది. -
మూడో పెళ్లిపై జయసుధ క్లారిటీ..
-
నేను.. మావారు: జయసుధ
-
నేను.. మావారు: జయసుధ
హైదరాబాద్ : తన భర్త నితిన్ కపూర్ ఆత్మహత్య విషయాన్ని సంచలనం చేయకుండా, సంయమనం పాటించినందుకు సీనియర్ నటి జయసుధ ఫేస్బుక్ ద్వారా మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె తమ దాంపత్య జీవితంపై పలు విషయాలను ఆమె పంచుకున్నారు. ‘ఇవాళ నా పెళ్లి రోజు. 32 ఏళ్ల క్రితం నేను, నితిన్ కపూర్ ఇదేరోజు ఒకటయ్యాం. మేం గడిపిన మధుర క్షణాలు గుర్తుకు వస్తున్నాయి. నితిన్ గురించి నాకు అన్ని విషయాలు తెలుసు. కానీ ఆయన ఇప్పుడు దేవతలతో ఉన్నారు. డిప్రెషన్ అనేది చాలా తీవ్రమైంది. ఇది మా జీవితాల్లో చీకటి రోజులు. నాకు, మా కుటుంబానికి మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు’ అంటూ నితిన్ కపూర్‌తో కలిసి దిగిన ఫోటోను జయసుధ తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. (జయసుధ భర్త ఆత్మహత్య) కాగా జయసుధ భర్త నితిన్ కపూర్(58) ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ముంబైలోని అంధేరి ప్రాంతంలోని తన సోదరి నివాసంలో ఆయన మంగళవారం మధ్యాహ్నం బిల్డింగ్ ఆరో అంతస్తుపై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు. డిప్రెషన్‌తో బాధపడుతున్న నితిన్ ఏడాదిన్నరగా సైకియాట్రిస్ట్ వద్ద ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. -
జయసుధ భర్త ఆత్మహత్య
- ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య - కొద్దిరోజులుగా ముంబైలోని సోదరి నివాసంలో ఉంటున్న నితిన్ కపూర్ - డిప్రెషన్‌తో బాధపడుతున్న నితిన్ - ఆత్మహత్యకు అదే కారణం! - మృతి పట్ల ప్రముఖుల సంతాపం సాక్షి, ముంబై/హైదరాబాద్: ప్రముఖ సినీనటి జయసుధ భర్త నితిన్ కపూర్(58) ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొద్దిరోజులుగా ముంబైలోని అంధేరి ప్రాంతంలోని తన సోదరి నివాసంలో ఉంటున్న ఆయన.. మంగళవారం మధ్యాహ్నం బిల్డింగ్ ఆరో అంతస్తుపై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు. డిప్రెషన్‌తో బాధపడుతున్న నితిన్ ఏడాదిన్నరగా సైకియాట్రిస్ట్ వద్ద చికిత్స పొందుతున్నారు. డిప్రెషన్ కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. భర్త మృతి వార్త తెలియగానే జయసుధ ఇద్దరు కుమారులతో కలసి హుటాహుటిన ముంబై బయల్దేదారు. మూడేళ్లుగా జయసుధ కుటుంబం గండిపేట మండలం నెక్నాంపూర్ పంచాయతీ పరిధిలోని ఫైర్‌ఫీల్డ్ గేటెడ్ కమ్యూనిటీ కాలనీలో నివసిస్తోంది. జయసుధ–నితిన్ దంపతులకు నిహార్, శ్రేయాన్ ఇద్దరు కుమారులు. రెండేళ్ల క్రితం తెలుగు సినిమా ‘బస్తీ’ద్వారా శ్రేయాన్ హీరోగా తెరంగేట్రం చేశారు. జయసుధ ప్రతి అడుగులోనూ నితిన్‌కపూర్ అండగా నిలిచారు. ఒకప్పటి ప్రముఖ హిందీ హీరో జితేంద్రకు ఈయన వరుసకు సోదరుడు. నితిన్ కపూర్‌ను దర్శకుణ్ణి చేయాలనేది జితేంద్ర కోరిక. సుమారు 200 సినిమాల్లో హీరోగా నటించిన జితేంద్ర.. పలు తెలుగు సినిమాలను హిందీలో రీమేక్ చేశారు. అప్పుడు దర్శకరత్న దాసరి నారాయణరావు వద్ద తమ్ముడు నితిన్‌ని సహాయ దర్శకుడిగా చేర్చారు. రాజేశ్‌ఖన్నా హీరోగా దాసరి దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘ఆశాజ్యోతి’తో పాటు పలు చిత్రాలకు ఆయన వద్ద నితిన్ సహాయ దర్శకుడిగా పనిచేశారు. అప్పట్లో దాసరి దర్శకత్వం వహించిన సినిమాల్లో ఎక్కువగా జయసుధ హీరోయిన్గా నటించారు. సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న నితిన్కపూర్తో జయసుధకు ఏర్పడిన పరిచయం కొన్నాళ్లకు స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. కానీ ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి ఈ జంట కొంచెం కష్టపడాల్సి వచ్చింది. జయసుధ తెలుగమ్మాయి, నితిన్ ఉత్తరాది కావడంతో మొదట ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. దర్శకులు దాసరి, రాఘవేంద్రరావు కుటుంబ పెద్దలను ఒప్పించడంలో సహాయం చేశారు. జితేంద్ర కోరుకున్నట్టు నితిన్‌కపూర్ దర్శకుడు కాలేకపోయినా.. నిర్మాతగా మారారు. జయసుధతో కలసి జేఎస్కె బ్యానర్ స్థాపించి, ‘కాంచనసీత’, ‘కలికాలం’, ‘హ్యాండ్సప్’, ‘మేరాపతి సిర్ఫ్ మేరా’చిత్రాలను నిర్మించారు. పలువురు తెలుగు, తమిళ, హిందీ సినీ ప్రముఖులతో నితిన్కపూర్కు సత్సంబంధాలున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
సినీనటి జయసుధ భర్త ఆత్మహత్య