
నిందితుడు వంశీ (ఫైల్),హత్యకు గురైన సోముసాయి
క్షణికావేశంతో యువత తమ భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంటున్నారు. కళాశాలలో చోటుచేసుకున్న చిన్న గొడవ చివరికి విద్యార్థి హత్యకు దారి తీసింది. విద్యార్థుల్లో పెరుగుతున్న హింసా ప్రవృత్తి అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది.
రాజంపేట: తాము చదువుతున్న కళాశాలలో విద్యార్థుల మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవ చివరికి ఓ విద్యార్థి ప్రాణాలను బలితీసుకుంది. సోదరభావంతో మెలగాల్సిన విషయాన్ని గాలికి వది లేసి సీనియర్, జూనియర్ అనే భేదభావంతో ఈర‡్ష్య, ద్వేషాలు పెంచుకుని చివరికి చంపుకొనే స్థాయికి వెళ్లారు. కళాశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో కాలు తగిలిందనే కారణంతో ఇద్దరు విద్యార్థుల మధ్య రగిలిన పగ కన్నవారికి కడుపుకోతను మిగిల్చింది. రాజంపేటలోని ఓ కళాశాలలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న సోము సాయి (20), అదే కళాశాలలో బీటెక్ ఫస్ట్ ఇయ ర్ చదువుతున్న వంశీల మధ్య కొన్ని రోజుల క్రి తం ఓ కార్యక్రమంలో చిన్న గొడవ జరిగింది. దీంతో సాయిపై వంశీపై కసి పెంచుకున్నాడు.
ముందుగా వేసుకున్న పథకం ప్రకారం సాయితో సన్నిహితంగా మెలిగే సాయికుమార్ అనే విద్యార్థి సాయం తీసుకున్నాడు వంశీ. అతని ద్వారా మాట్లాడాలని చెప్పి సోము సాయిని అంతగా జనం సంచారంలేని ప్రదేశానికి పిలిపించాడు. అక్కడ వంశీ అతనితో మాట్లాడుతూనే కత్తితో దాడి చేశాడు. నివ్వెరపోయిన సాయికుమార్ పట్టణ పోలీసులకు లొంగిపోయి సోముసాయి హత్యకు దారితీసిన పరిస్థితులను వివరించినట్లు తెలిసింది. కాగా హత్య అనంతరం పాత పోలీసు స్టేషన్ సమీపంలో ఉంటున్న మరో విద్యార్థి వద్దకు వంశీ వెళ్లి అతని బైకు తీసుకుని పరారైనట్లు తెలిసింది. ఈ విషయాన్ని సీఐ యుగంధర్ ధ్రువీకరించారు. దీంతో పట్టణ పోలీసులు ఏ1గా వంశీ, ఏ2గా సాయికుమార్‌పై కేసు నమోదు చేశారు.
ఒక్కగానొక్క కొడుకు లేకుండాపోయే...
మండలంలోని వరదయ్యగారిపల్లెకు చెందిన పాలేటి శివయ్య, రత్నమ్మ దంపతుల ఏకైక కుమారుడు సోముసాయి. వీరు రాజంపేట పట్ట ణంలోని ఆర్‌ఎస్ రోడ్డులో చిల్లర అంగడి నిర్వహించుకుంటూ జీవి స్తున్నారు. కాగా తండ్రి కొన్ని రో జుల క్రితం షిర్డి సాయినాథున్ని దర్శించుకునేందుకు వెళ్లాడు. సో ముసాయి మృతితో ఆ దంపతులకు కడుపుకోత మిగిలింది. వి ద్యార్థి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం విద్యార్థులు నివా ళులర్పించి ర్యాలీగా మృతదేహాన్ని తీసుకెళ్లారు.
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఏఐటీఎస్ వైస్‌చైర్మన్
సోము సాయి కుటుంబాన్ని ఏఐటీఎస్ వైస్‌చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ నారాయణలు పరామర్శించారు. బిడ్డను కోల్పోయిన తల్లిని ఓదార్చారు. అలాగే మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment