కడప : వైఎస్ఆర్ జిల్లాలో రాష్ట్ర విభజన సెగలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం కూడా ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి కదల్లేదు. అన్ని డిపోల్లోనూ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వంటావార్పు చేపట్టారు.
మరోవైపు చిత్తూరు జిల్లాలో మరో 72 గంటల పాటు జిల్లా బంద్ కొనసాగుతోంది. విద్యాసంస్థలు, ఆర్టీసీ కార్మికులు స్వచ్చందంగా బంద్ పాటిస్తున్నారు. ఎమ్మెల్యే సీకే బాబు నిరాహార దీక్ష ఆరో రోజుకు చేరుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు నేటి నుంచి మూడు రోజుల పాటు పెన్డౌన్ చేశారు. సమైక్యాంధ్ర జేఏసీ నెల్లూరు జిల్లాలో నేడు, రేపు ప్రభుత్వ కార్యాలయలకు బంద్ పాటిస్తున్నాయి.
కర్నూలులో నేటి నుంచి మంత్రి టీజీ వెంకటేష్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు జరగనున్నాయి. కాగా నంద్యాలలో భూమా నాగిరెడ్డి నిరసన దీక్షకు దిగారు. అలాగే ఎంపీ నిమ్మల కిష్టప్ప లోక్సభ స్పీకర్కు రాజీనామా లేఖ ఇవ్వనున్నారు.
వైఎస్ఆర్ జిల్లాలో కొనసాగుతున్న విభజన సెగలు
Published Mon, Aug 5 2013 8:19 AM | Last Updated on Fri, Sep 1 2017 9:40 PM
Advertisement
Advertisement