రోజుకు 50 మెయిల్స్ పంపింది!
చినికి చినికి గాలివానగా మారినట్లు అనే సామెత అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు హృతిక్ రోషన్, కంగనా రనౌత్‌ల వ్యవహారం అలానే మారింది. ‘క్రిష్-3’లో నటించిన సమయంలో ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందనే వార్త ప్రచారమైంది. అయితే, ఆ సమయంలో తన భార్య సుజానే ఖాన్ నుంచి విడిపోవడానికి హృతిక్ ఇష్టపడకపోవడంతో కంగన, అతనికి దూరమయ్యారట. ఇటు హృతిక్ కానీ, అటు కంగన కానీ తమ గురించి వచ్చిన వార్తలకు అప్పట్లో స్పందించలేదు. అంత సెలైంట్‌గా ఉండిపోయిన ఈ ఇద్దరూ ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోయేలా రచ్చ... రచ్చ చేసుకుంటున్నారు. ఇద్దరూ పరస్పరంలీగల్ నోటీసులు పంపించుకునే దాకా వివాదం ముదిరిపోయింది. ఆ నోటీసుల్లో ఇద్దరూ చేసిన ఆరోపణల విషయానికొస్తే...
♦ ‘‘మన దృష్టిని ఆకర్షించడానికి ‘సిల్లీ ఎక్స్‌లు’ లేనిపోనివి ప్రచారం చేస్తారు?’’ అని రెండు నెలల క్రితం ప్రచురితమైన ఓ ఇంటర్వ్యూలో కంగన అన్నారు. ఆ మాట హృతిక్‌ను ఆగ్రహానికి గురి చేసింది. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కంగనతో చట్టపరంగా డీల్ చేయాలనుకున్నారు. అంతే... కంగనా రనౌత్‌కు లాయర్ నోటీసు పంపించారు. ఆ నోటీసులో ఏముందంటే...
♦ కొంతకాలంగా ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ద్వారా హృతిక్‌కీ, మీకూ (కంగన) మధ్య ఏదో ఉందని సంకేతం అందేలా మాట్లాడుతున్నారు. మీకు, తనకూ మధ్య ఏమీ లేదనీ, తనను అవమానాల పాలు చేయడానికీ, పబ్లిసిటీ కోసం అలా చేస్తున్నా రనీ నా క్లయింట్ అంటున్నారు. ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి, హృతి క్‌కీ, మీకూ మధ్య ఏమీ లేదని బాహాటంగా స్పష్టం చేయాలి.
♦ ‘క్వీన్’ సినిమాలో మీరు అద్భుతంగా నటించారంటూ హృతిక్ నుంచి మీకు ఇ-మెయిల్ వచ్చిందంటూ కరణ్ జోహార్ (దర్శక- నిర్మాత) బర్త్‌డే పార్టీలో మీరు హృతిక్‌కి ధన్యవాదాలు తెలిపారు. అప్పుడు హృతిక్ అది తన ఇ-మెయిల్ కాదనీ, తన అసలైన మెయిల్ ఐడీని మీకిచ్చారు. అంతకు ముందు మీరు పేర్కొన్న ఐడీ తనది కాదని అప్పట్లో ఆయన సిటీ పోలీసుల ‘సైబర్ సెల్’కి ఫిర్యాదు చేశారు. ఇక... హృతిక్ అసలు మెయిల్ ఐడీ తెలుసు కున్న మీరు అప్పట్నుంచీ ఆయనకు కుప్పలు తెప్పలుగా మెయి ల్స్ పంపారు. మొత్తం 1,439 మెయిల్స్ మీ నుంచి వచ్చాయి. రోజుకి 50 మెయిల్స్ పంపారని నా క్లయింట్ పేర్కొన్నారు. వాటిని పట్టించుకోకపోయినా ఆయన మానసిక ఒత్తిడికి గుర య్యారు. మెయిల్స్ పంపడమే కాక, నా క్లయింట్‌తో మీకు ఎఫైర్ ఉందని ప్రచారం చేశారు. పైగా ‘సిల్లీ ఎక్స్’ అని పేర్కొన్నారు.
♦ ‘క్రిష్ 3’ షూటింగ్ అప్పుడు మద్యం మత్తులో మీరు రచ్చ చేసి నప్పుడు మీ సిస్టర్ రంగోలీ క్షమాపణలు చెప్పడంతో పాటు, మీరు ‘యాస్పర్జెర్’ అనే మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని పేర్కొన్నారని నా క్లయింట్ చెప్పారు. మీలోని ఆ లోపాన్ని ఎవరికీ చెప్పొద్దని ఆమె కోరుకున్నారు. ఇప్పటివరకూ నా క్లయింట్ ఆ మాట మీద నిలబడ్డారు.