మా ఇద్దరి మధ్య ప్రేమా..? | we are just friends - pooja hegde | Sakshi
Sakshi News home page

మా ఇద్దరి మధ్య ప్రేమా..?

Published Fri, Jun 12 2015 11:21 PM | Last Updated on Sun, Sep 3 2017 3:38 AM

మా ఇద్దరి మధ్య ప్రేమా..?

మా ఇద్దరి మధ్య ప్రేమా..?

పూజా హెగ్డే, హృతిక్ రోషన్ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని, వారిద్దరూ ప్రస్తుతం ప్రేమ పక్షుల్లా విహరిస్తున్నారని హిందీ రంగంలో ప్రచారమవుతోంది. ఈ ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టాలనుకున్నారు పూజా. దీని గురించి ఆమె మాట్లాడుతూ -‘‘హృతిక్‌కి, నాకూ మధ్య ప్రేమా...? మా స్నేహానికి ఇలాంటి రంగు పూయడం సరికాదు. ఆయన నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే.
 
 అంతకుమించి ఏమీ లేదు. ఏమైనా ఉందని ఎవరైనా అనుకుంటే నేనేం చేయలేను’’ అన్నారు. హృతిక్‌తో తాను నటిస్తున్న ‘మొహంజదారో’ చిత్రవిశేషాలను పూజా చెబుతూ - ‘‘ఈ చిత్రంలో మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్‌వుట్ అయ్యింది. గుజరాత్‌లోని  భుజ్ ప్రాంతంలో 100 రోజుల పాటు మండుటెండ ల్లో ఈ  సినిమా షూటింగ్ జరిపాం.
 
 మా యూనిట్ సభ్యుల్లో చాలామంది ఎండ తాకిడికి తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయేవారు. ఎండలకు నేనైతే బాగా నల్లబడ్డాను. ఆ ట్యాన్ అంతా పోవడానికి చాలా సమయం పట్టింది. అందరం కష్టపడి చేశాం కాబట్టి, భుజ్‌లో చిత్రీకరించిన సన్నివేశాలు చాలా బాగా  వచ్చాయి’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement