పూజా హెగ్డే ప్రేమలో హృతిక్? | Hrithik Roshan in love with Pooja Hegde? | Sakshi
Sakshi News home page

పూజా హెగ్డే ప్రేమలో హృతిక్?

Published Thu, Jun 4 2015 11:47 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

పూజా హెగ్డే ప్రేమలో హృతిక్? - Sakshi

పూజా హెగ్డే ప్రేమలో హృతిక్?

 పూజా హెగ్డే, హృతిక్ రోషన్ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని బాలీవుడ్‌లో గుసగుసలు వినబడుతున్నాయి. ‘ఒక లైలా కోసం’, ‘ముకుంద’,  చిత్రాల్లో నటించిన ఈ కన్నడ భామ ప్రస్తుతం అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘మొహంజదారో’ చిత్రంలో హృతిక్ రోషన్ సరసన నటిస్తున్నారు. ఈ షూటింగ్ సమయంలోనే హృతిక్, పూజా హెగ్డేలు దగ్గరయ్యారని, పైగా గుజరాత్‌లో షూటింగ్ అయిపోగానే ఇద్దరూ కలిసి ముంబైకి జంటగా చెక్కేశారని టాక్.  ఈ విషయంలో ఎంత నిజముందో తెలీదు కానీ నిప్పు లేనిదే పొగ రాదు కదా అంటున్నారు బాలీవుడ్ జనాలు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement