Pooja Hegde Home With Stylish And Smart Interior Design Video Goes Viral - Sakshi
Sakshi News home page

Pooja Hegde Home Tour: పూజా హెగ్డే కలల సౌధాన్ని మీరెప్పుడైనా చూశారా?

Published Wed, Nov 16 2022 8:07 PM | Last Updated on Wed, Nov 16 2022 10:47 PM

Pooja Hegde Home with stylish Smart Interior Design Video - Sakshi

అందాల భామ పూజా హెగ్డే టాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే  బుట్టబొమ్మగా అభిమానుల్లో ఆమె పేరు స్థిరంగా నిలిచిపోయింది. తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటనతో తనదైన ముద్ర వేసింది. బాలీవుడ్‌ అగ్ర హీరోలతో పలు సినిమాల్లోనూ నటించింది. అంతే కాకుండా పలు వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా ఉంటోంది పూజా.

తాజాగా ఈ బుట్టబొమ్మ తన ఇంటిని అభిమానులకు పరిచయం చేసింది. అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్‌తో అలంకరించిన తన కలల సౌధాన్ని వివరిస్తూ ఓ వీడియోలో వివరించింది. అత్యంత ఖరీదైన ఇంటి నిర్మాణాన్ని ఓ రీల్‌ వీడియోతో ఫ్యాన్స్‌కు వివరిస్తూ ఆమె ఇంటిని పరిచయం చేసింది. ఏషియన్ పెయింట్స్ 'వేర్ ది హార్ట్ ఈజ్ సీరీస్' వీడియోలలో భాగంగా పూజా  తన ఇంటిని 'ట్రైలర్' రూపంలో చూపించింది.

పూజా తన ఇంటి డిజైన్ వివరిస్తూ..'నా తల్లిదండ్రులు ఉద్యోగం చేస్తున్నారు. మా నాన్న ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వచ్చి పని ఒత్తిడిని ఎప్పుడు తీసుకురాలేదు. ఆయన ఒక చిన్నపిల్లడిలా మాతో ఆటలు ఆడేవారు. దానికి ప్రధాన కారణం  మా ఇంటి వాతావరణమే.' అంటూ చెప్పుకొచ్చింది బుట్టబొమ్మ. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement