
మాధురీ వీరాభిమానిని: హృతిక్
ముంబయి: అలనాటి అందాల తార మాధురీ దీక్షిత్కు తాను వీరాభిమానినని బాలీవుడ్ నటి హీరో హృతిక్ రోషన్ అన్నారు. హృతిక్ నటించిన క్రిష్ 3 ప్రమోషన్లో భాగంగా మాధురీతో కలసి 'జలక్ దిఖ్లా ఝా 6' అనే గ్రాండ్ఫైనల్ కార్యక్రమంలో స్టేజిపై కనువిందు చేయనున్నారు. 'నేను చిన్నప్పటి నుంచి మాధురీ అభిమానిని. ఆమె నవ్వు చాలా బాగుంటుంది. అత్యంత ప్రభావంతులైన మహిళల్లలో ఆమె ఒకరు' అని హృతిక్ చెప్పారు. హృతిక్, మాధురీ నటించిన సినిమాల్లోని కొన్ని సూపర్ హిట్ పాటలకు ఈ జోడి డ్యాన్ చేశారు. క్రిష్3లో నటించిన అందాల తార ప్రియాంక చోప్రా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంది. హృతిక్, ప్రియాంక కూడా తాజా సినిమాలోని ఓ పాటకు నర్తించారు. ఈ కార్యక్రమం కలర్స్ చానెల్లో ఈరోజు (శనివారం) ప్రసారం కానుంది.