
రాకేష్ రోషన్, హృతిక్ రోషన్
‘‘మా నాన్నగారు (దర్శక–నిర్మాత, నటుడు రాకేష్ రోషన్) ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరు. 71 ఏళ్ల వయసులోనూ ప్రతిరోజూ రెండు గంటలు వ్యాయామం చేస్తున్నారు. ఆయనకు ఉన్నటువంటి ధృడసంకల్పం మనందరికీ ఈ సమయంలో ఉండాలి’’ అంటున్నారు హృతిక్ రోషన్. లాక్‌డౌన్ నేçపథ్యంలో అందరూ ఇళ్లకు పరిమితం కావాల్సిన పరిస్థితి. ఈ ఖాళీ సమయంలో తండ్రి వ్యాయామం చేస్తున్న వీడియోను షేర్ చేశారు హృతిక్.
‘‘గత ఏడాదే మా నాన్నగారు క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడ్డారు. ఇప్పుడు ఈ వయసులోనూ క్రమశిక్షణగా వ్యాయామం చేస్తున్నారు. ఆరోగ్యం పట్ల ఆయనకు ఉన్న పట్టుదలను చూసి వైరస్ కూడా భయపడుతుందనిపిస్తోంది’’ అని షేర్ చేసిన వీడియోకు కామెంట్ జోడించారు. ఇదిలా ఉంటే లాక్‌డౌన్ పూర్తయ్యాక 1980లో వచ్చిన హిందీ చిత్రం ‘ది బర్నింగ్ ట్రైన్’ రీమేక్‌లోను, 1982లో వచ్చిన ‘సత్తే పే సత్తా’ రీమేక్‌లోనూ హృతిక్ నటించే అవకాశాలు ఉన్నాయట.
Comments
Please login to add a commentAdd a comment