![Hrithik Roshan mother Pinkie Roshan has tested positive for COVID-19 - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/23/pinkie_tests_positive.jpg.webp?itok=FSHQA2UF)
పింకీ రోషన్
దర్శక–నిర్మాత రాకేష్ రోషన్, హీరో హృతిక్ రోషన్ తల్లి పింకీ రోషన్‌కు కరోనా సోకింది. ప్రస్తుతం ఆమె క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఈ విషయం గురించి పింకీ రోషన్ మాట్లాడుతూ – ‘‘ప్రతీ 20 రోజులకు ఓసారి మా కుటుంబ సభ్యులందరం, అలాగే మా స్టాఫ్ అందరూ కోవిడ్ టెస్ట్ చేయించుకుంటున్నాం. ఇటీవల చేసిన టెస్ట్‌లో నాకు పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అయితే నాకు ఏ లక్షణాలూ లేవు. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంటున్నాను. క్రమశిక్షణగా యోగా చేయడం, వ్యాయామం వల్ల మీ మీద కోవిడ్ అంత ప్రభావం చూపించలేకపోయింది అని మా డాక్టర్లు అన్నారు. ఇంకో వారంలో మళ్లీ టెస్ట్ చేయించుకుంటాను. కచ్చితంగా నెగటివ్ వస్తుంది అనుకుంటున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment