Alia Bhatt Covid Positive: డబుల్‌ క్వారంటైన్‌! | Alia Bhatt Tested Covid Positive - Sakshi
Sakshi News home page

డబుల్‌ క్వారంటైన్‌!

Published Sat, Apr 3 2021 8:06 AM | Last Updated on Sat, Apr 3 2021 9:06 AM

Alia Bhatt Tests COVID-19 Positive Went Two Times In Qarantine   - Sakshi

డబుల్‌ హోమ్‌ క్వారంటైన్‌ను ఎక్స్‌పీరియన్స్‌ చేస్తున్నారు హీరోయిన్‌ ఆలియా భట్‌. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా భట్‌ టైటిల్‌ రోల్‌ చేస్తున్న సినిమా ‘గంగూబాయి కతియావాడి’. ఈ సినిమా షూటింగ్‌లో దర్శకుడు సంజయ్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో ఆలియా కూడా క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఇలా హోమ్‌ క్వారంటైన్‌ను పూర్తి చేశారో లేదో అలా మరోసారి క్వారంటైన్‌కి వెళ్లారు ఆలియా. ఈసారి ఆలియాకు కరోనా సోకింది. ‘

‘నాకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంటున్నాను. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. వైద్యుల సలహాలు పాటిస్తున్నాను. నేను కోలుకోవాలని ఆశిస్తున్న అందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు ఆలియా. ఇలా డబుల్‌ హోమ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లారు ఆలియా. ఈ సంగతి ఇలా ఉంచితే.. ఆలియా ప్రియుడు రణ్‌బీర్‌ కపూర్‌కు కూడా ఆ మధ్య కరోనా సోకిన విషయం తెలిసిందే. ఇటీవలే రణ్‌బీర్‌కు నెగటివ్‌ వచ్చింది.

చదవండి : మలైకాకు కోవిడ్‌ వ్యాక్సిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement