ఆలియాభట్‌కు కరోనా పాజిటివ్‌..‌ | Alia Bhatt Tests COVID-19 Positive Days After Ranbir Kapoor Recovers | Sakshi
Sakshi News home page

ఆలియాభట్‌కు కరోనా.. కోలుకున్న ప్రియుడు రణ్‌బీర్‌

Published Fri, Apr 2 2021 8:59 AM | Last Updated on Fri, Apr 2 2021 10:52 AM

Alia Bhatt Tests COVID-19 Positive Days After Ranbir Kapoor Recovers - Sakshi

ముంబై : బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఆలియాభట్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆలియా..తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నానని, వైద్యుల సలహా మేరకు అన్ని ప్రోటోకాల్స్‌ పాటిస్తున్నానని పేర్కొంది. ఈ సందర్భంగా తనకు మద్ధతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింంది. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం ఆలియా.. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గంగుభాయ్‌ కతియావాడి సినిమాలో నటిస్తుం‍ది. ఈ సినిమా షూటింగ్‌లో ఉండగానే స్వల్ప అస్వస్థతకు లోనైంది.  పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో షూటింగ్‌కు బ్రేక్‌ పడనుంది. తెలుగులోనూ రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోనూ ఆలియా నటిస్తుంది. 

ఆయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో ‘బ్రహ్మాస్త్ర’ సినిమా చేస్తుంది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ కపుల్‌ రణ్‌బిర్‌ కపూర్‌, అలియా భట్‌లు తొలిసారి జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక‌్షన్‌ పనులు జరుపుకుంటుంది. కరణ్‌ జోహార్‌ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మూవీ తఖ్త్‌ సహా పలు సినిమాలు ఆలియా చేతిలో ఉన్నాయి. గతంలో ఆలియా ప్రియుడు రణ్‌బీర్‌ కపూర్‌కు సైతం కరోనా సోకిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కోవిడ్‌ నుంచి బయటపడిన నేపథ్యంలో ఆలియాకు కరోనా సోకింది. ఇటీవలె అమీర్‌ఖాన్, మిలింద్‌, ఆర్‌ మాధవన్‌, ‌రణబీర్‌ కపూర్ పరేష్‌ రావల్‌, కార్తీక్ ఆర్యన్, బప్పీలహిరి సహా పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. 

చదవండి : తనే నా గర్ల్‌ ఫ్రెండ్‌, త్వరలోనే పెళ్లి : రణ్‌బీర్‌
పెళ్లి తర్వాత నటించన్నావ్‌.. మరి ఇదేంటి?!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement