
హృతిక్‌కి సుజానే గుడ్‌బై
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, సుజానే.. తమ 13 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలికారు. ‘‘నాతో విడిపోవడానికి సుజానే నిర్ణయించుకోవడంతో మా 17 సంవత్సరాల అనుబంధానికి తెరపడింది’’ అని హృతిక్ ఓ ప్రకటనలో తెలిపారు. తమ కుటుంబానికి ఇది జీర్ణించుకోలేని విషయమని, తమ ప్రైవసీకి భంగం కలిగించకూడదని హృతిక్ మీడియాకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హృతిక్, సుజానేలకు ఇద్దరు కొడుకులు. రెహాన్ (7), హ్రిదాన్ (5). బాలీవుడ్ నటుడు సంజయ్ ఖాన్ కూతురైన సుజానేతో హృతిక్ వివాహం 2000 సంవత్సరంలో జరిగింది. గత కొద్దికాలంగా హృతిక్, సుజానేలు విడిపోతున్నారంటూ వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. గత మూడు నెలలుగా వీరిద్దరూ విడివిడిగానే ఉంటున్నట్టు సమాచారం. అంతేకాకుండా పబ్లిక్ ఫంక్షన్లో కూడా వీరిద్దరూ కలిసి కనిపించలేదు. హృతిక్‌కు సంబంధించిన అన్ని కార్యక్రమాలకు సుజానే దూరంగా ఉన్నారు. సెప్టెంబర్‌లో రాకేశ్ రోషన్ జన్మదినం సందర్భంగా ఇలా కనిపించి అలా మాయమైందని వార్తలు వెలువడ్డాయి.