సల్మాన్‌పై నెటిజన్ల వ్యంగ్యాస్త్రాలు | Cycle Riding Photo Posted By Salman | Sakshi
Sakshi News home page

సల్మాన్‌పై నెటిజన్ల వ్యంగ్యాస్త్రాలు

Sep 10 2020 6:12 PM | Updated on Sep 10 2020 6:51 PM

Cycle Riding Photo Posted By Salman - Sakshi

ముంబై: బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ ఏది చేసినా సంచలనమే. బాలీవుడ్‌లో రూ.100 కోట్ల కలెక్షన్‌ల సినిమాలకు చిరునామాగా మారిన సల్మాన్‌, తాజాగా సైకిల్‌ తొక్కుతున్న ఫోటోను సోషల్‌ మీడియాలో ఫోస్ట్‌ చేశాడు. అయితే తన ఫ్యాన్స్‌కు జాగ్రత్తగా ఉండమని సలహా ఇచ్చాడు(స్టే స్టేఫ్‌ అని ఇంగ్లీషులో). కాగా సల్మాన్‌ సలహాపై నెటిజన్లు వ్యంగ్యంగా స్పందించారు. సల్మాన్‌ సైకిల్‌ తొక్కుతున్నప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఓ నెటిజన్‌ వ్యంగ్యంగా స్పందించాడు.

మీరు ఫుట్‌పాత్‌పై సైకిల్‌ తొక్కొద్దంటు మరో నెటిజన్‌ సల్మాన్‌కు సూచించాడు. అయితే బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య నేపథ్యంలో జరుగుతున్న సంఘటనలపై స్పందించాలని ఓ నెటిజన్‌ సల్మాన్‌ను కోరాడు. బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో మీరు సైకిల్‌ తొక్కుతున్న దృష్యాలను పోస్ట్ చేయడంలో ఆంతర్యమేమిటని ఓ నెటిజన్‌ ప్రశ్నించారు. అయితే బాలీవుడ్‌ మీకు జీవితానిచ్చిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని మరో నెటిజన్‌ సల్మాన్‌కు సూచించాడు. (చదవండి: కత్రినా కోసం ఆనవాయితీకి బ్రేక్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement