ఒక్క సెల్ఫీ భాయ్‌! | Salman Khan cycles to his shoot for Dabangg-3 | Sakshi
Sakshi News home page

ఒక్క సెల్ఫీ భాయ్‌!

Published Sun, Sep 8 2019 5:50 AM | Last Updated on Sun, Sep 8 2019 5:50 AM

Salman Khan cycles to his shoot for Dabangg-3 - Sakshi

సల్మాన్‌ఖాన్‌

బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ ముంబై రోడ్లపై సైకిల్‌ తొక్కారు. పెద్ద పెద్ద కార్లలో ప్రయాణించే సల్మాన్‌ సడన్‌గా ఇలా సైకిల్‌తో రోడ్డు ఎక్కడానికి కారణం ఉంది. ముంబైలో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సల్మాన్‌ఖాన్‌ హీరోగా నటిస్తున్న ‘దబాంగ్‌ 3’ చిత్రీకరణ ముంబైలోనే జరుగుతోంది. వర్షాల వల్ల కారులో వెళితే ట్రాఫిక్‌ సమస్యలు ఇబ్బంది పెడతాయని సల్మాన్‌ ఊహించి ఉంటారు. అందుకే సైకిల్‌పై ‘దబాంగ్‌ 3’ సెట్స్‌కు వెళ్లారు. సల్మాన్‌ వంటి సూపర్‌స్టార్‌ రోడ్డుపై కనిపిస్తే అభిమానులు ఊరుకోరు కదా.. వెంటనే ఒక్క సెల్ఫీ భాయ్‌ అని అడిగారు. స్మైల్‌తో సల్మాన్‌ పోజిచ్చారు. ఇలా చాలా మంది సెల్ఫీస్‌లో బందీ అయిపోయారు సల్మాన్‌. ఇక ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ‘దబాంగ్‌ 3’ సినిమాలో సోనాక్షీ సిన్హా కథానాయికగా నటిస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్‌కు ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement