
బాలీవుడ్‌లో అగ్రకథానాయికల జాబితాలో పేరు సంపాదించుకున్నారు నటి సోనాక్షీ సిన్హా. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ నటించిన ‘దబాంగ్’ (2010) సినిమాతో సోనాక్షి హీరోయిన్‌గా పరిచయమైన సంగతి తెలిసిందే. హీరోయిన్‌గా తొమ్మిదేళ్ల సక్సెస్ జర్నీని కంప్లీట్ చేశారామె. ఈ సందర్భంగా సోనాక్షి మాట్లాడుతూ – ‘‘హీరోయిన్‌గా నా తొలి చిత్రం ‘దబాంగ్’ విడుదలై అప్పుడే తొమ్మిదేళ్లు గడిచిపోయాయంటే నమ్మలేకపోతున్నాను. అంత టైమ్ ఇంత త్వరగా గడిచిపోయిందా? అనిపిస్తోంది. ఏదో నిన్ననే ‘దబాంగ్’ చిత్రం విడుదలైన ఫీలింగ్‌లో ఉన్నా. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూ నటిగా అద్భుతమైన నా జర్నీని ఇలానే కొనసాగించడానికి కష్టపడతాను’’ అన్నారు. ప్రస్తుతం ‘దబాంగ్ 3’ చిత్రంలో సల్మాన్‌ఖాన్, సోనాక్షి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబరు 20న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment