స్టార్టింగ్‌ అప్పుడేనా? | Salman Khan to start Dabangg 3 on April 4 | Sakshi
Sakshi News home page

స్టార్టింగ్‌ అప్పుడేనా?

Published Sun, Dec 2 2018 2:53 AM | Last Updated on Sun, Dec 2 2018 2:53 AM

Salman Khan to start Dabangg 3 on April 4 - Sakshi

సల్మాన్‌ఖాన్‌

బాలీవుడ్‌ ‘దబాంగ్‌’ ఫ్రాంచైజీలో రానున్న థర్డ్‌ పార్ట్‌ ‘దబాంగ్‌ 3’. ఈ సినిమాను వచ్చే ఏడాది క్రిస్మస్‌కు రిలీజ్‌ చేయనున్నట్లు ఆల్రెడీ ప్రకటించారు టీమ్‌. కానీ ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లే షెడ్యూల్స్‌ గురించి క్లారిటీ లేదు. తాజాగా ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ వచ్చే ఏడాది ఏప్రిల్‌ 4న మొదలవుతుందని బాలీవుడ్‌ టాక్‌. ‘దబాంగ్‌ 3’ సినిమాలో సల్మాన్‌ఖాన్‌ హీరోగా నటిస్తారు. ప్రభుదేవా దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో సోనాక్షీ సిన్హా కథానాయికగా నటిస్తారు. ప్రస్తుతం ‘భారత్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు సల్మాన్‌ఖాన్‌. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది రంజాన్‌కు రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఇందులో కత్రినా కైఫ్‌ కథానాయిక.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement