
ఉత్తర కర్ణాటకలోని గోకర్ణకు చెందిన జ్యోత్స్న కాగల్‌ను చూస్తే ‘74 సంవత్సరాలు’ అని నమ్మడం చాలా కష్టం. దీనికి కారణం ఆమె చలాకీతనం. 74 ఏళ్ల వయసులో కొందరికి నడవడం కష్టం కావచ్చు. అయితే జ్యోత్స్న మాత్రం వేగంగా నడవడంతో పాటు వేగంగా సైకిల్ తొక్కుతూ వీధి వీధీ తిరుగుతుంది. 1968లో తన తొలి సైకిల్‌ను కొన్నది.
ఆ రోజుల్లో ఆడవాళ్లు సైకిల్ తొక్కడం అనేది అతి అరుదైన దృశ్యం. అలాంటి రోజుల్లో సైకిల్‌పై మెరుపు వేగంతో దూసుకుపోయే జ్యోత్స్నను చూసి సర్వజనులు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టేవారు. ఆమె పేరు తెలియక ‘సైకిల్ అమ్మాయి’ అని పిలిచేవారు.
ఆమె గోకర్ణలోని మహాబలేశ్వర్ కో–ఆపరేటివ్ సొసైటీకి తొలి మహిళా అధ్యక్షురాలిగా పనిచేసింది. ధ్యానం, యోగాలతో జ్యోత్స్న దినచర్య మొదలవుతుంది. సైకిల్ సవారీ తన విజయ రహస్యం అని చెబుతున్న జ్యోత్స్న కాగల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment