Jyotsna
-
సైరా... సైకిల్ సవారీ.. ఆమెకు 74 సంవత్సరాలు అంటే నమ్మడం కష్టం
ఉత్తర కర్ణాటకలోని గోకర్ణకు చెందిన జ్యోత్స్న కాగల్ను చూస్తే ‘74 సంవత్సరాలు’ అని నమ్మడం చాలా కష్టం. దీనికి కారణం ఆమె చలాకీతనం. 74 ఏళ్ల వయసులో కొందరికి నడవడం కష్టం కావచ్చు. అయితే జ్యోత్స్న మాత్రం వేగంగా నడవడంతో పాటు వేగంగా సైకిల్ తొక్కుతూ వీధి వీధీ తిరుగుతుంది. 1968లో తన తొలి సైకిల్‌ను కొన్నది. ఆ రోజుల్లో ఆడవాళ్లు సైకిల్ తొక్కడం అనేది అతి అరుదైన దృశ్యం. అలాంటి రోజుల్లో సైకిల్‌పై మెరుపు వేగంతో దూసుకుపోయే జ్యోత్స్నను చూసి సర్వజనులు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టేవారు. ఆమె పేరు తెలియక ‘సైకిల్ అమ్మాయి’ అని పిలిచేవారు. ఆమె గోకర్ణలోని మహాబలేశ్వర్ కో–ఆపరేటివ్ సొసైటీకి తొలి మహిళా అధ్యక్షురాలిగా పనిచేసింది. ధ్యానం, యోగాలతో జ్యోత్స్న దినచర్య మొదలవుతుంది. సైకిల్ సవారీ తన విజయ రహస్యం అని చెబుతున్న జ్యోత్స్న కాగల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
Jyotsna Cheruvu: స్థిరత్వమే సక్సెస్ సూత్రం
హైదరాబాద్ నగరం... దుర్గం చెరువు వంతెనకు సస్పెండెడ్ రోప్ ప్లాట్‌ఫామ్. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంలో ఓ వలయాకారపు షాఫ్ట్. బహుళ అంతస్తుల నిర్మాణంలో పాసెంజర్ అండ్ మెటీరియల్ హాయిస్ట్. ఇవన్నీ సాంకేతికరంగం రూపొందించుకున్న అద్భుతమైన ఆవిష్కరణలు. వీటి రూపకల్పన... తయారీలో కీలకమైన మహిళ... జ్యోత్స్న చెరువు. ‘ఇండిపెండెంట్‌గా నిలబడాలంటే ఇండిపెండెంట్‌గా ఆలోచించాలి, ఇండిపెండెంట్‌గా నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే మీరు పదిమంది నడిచే దారిలో పదకొండవ వ్యక్తిగా మిగలకుండా మీదైన కొత్త çపథాన్ని నిర్మించుకోగలుగుతా’ రంటూ మహిళలకు సందేశమిస్తుంటారు... సీఎమ్ఏసీ, మెకనైజేషన్ అండ్ ఆటోమేషన్ ఇన్ కన్స్ట్రక్షన్ కంపెనీ డైరెక్టర్ జ్యోత్స్న చెరువు. ‘ప్రౌడ్ టు మేక్ ఇన్ ఇండియా, ఎక్స్పోర్ట్ దెమ్ యాజ్ మేడ్ ఇన్ ఇండియా’ నినాదంతో పరిశ్రమను విజయవంతంగా నిర్వహిస్తున్న జ్యోత్స్న చెరువు తన వైవిధ్యభరితమైన పారిశ్రామిక ప్రయాణాన్ని సాక్షితో పంచుకున్నారు. ► సీబీఐటీ స్టూడెంట్‌ని! ‘‘నేను పుట్టింది నెల్లూరు జిల్లా బిట్రగుంటలో. తాత అప్పుడు అక్కడ రైల్వే ఉద్యోగి. అలా అది మా అమ్మమ్మగారి ఊరైంది. నాన్న బ్యాంకు ఉద్యోగరీత్యా మేము పెరిగిందీ, చదువు, కెరీర్ అంతా హైదరాబాద్‌లోనే. మా కాలేజ్ రోజుల్లో అమ్మాయిలు సివిల్ ఇంజనీరింగ్‌ని పెద్దగా తీసుకునేవాళ్లు కాదు. నాకు సీబీఐటీలో సివిల్ ఇంజనీరింగ్ సీటు వచ్చింది. చేరిన తర్వాత సబ్జెక్ట్‌లో ఉన్న అందం తెలిసి వచ్చింది. ఆనందంగా ఆస్వాదిస్తూ కోర్సు పూర్తి చేశాను. ఆ తర్వాత ఉస్మానియాలో ఎంబీఏ చేశాను. మా వారు మెకానికల్ ఇంజనీర్. పెళ్లి తర్వాత కొంతకాలం ఇద్దరమూ ఉద్యోగం చేశాం. మా వారి ఉద్యోగరీత్యా పూనాకి వెళ్లాం. అప్పుడు పిల్లలు చిన్నవాళ్లు. నేనక్కడ ఉద్యోగంలో చేరలేదు, కానీ హోమ్ బ్యూటిఫికేషన్ వంటి సర్వీస్ ప్రాజెక్టులు మొదలుపెట్టాను. మార్కెట్ అవగాహన ఉంది కాబట్టి నిర్మాణ రంగం మీద దృష్టి పెట్టమని ఓ రిటైర్డ్ పర్సన్ చెప్పిన మాట నన్ను పారిశ్రామికవేత్తగా నిలిపాయి. ► నిర్మాణరంగంలో సాంకేతిక వేగం! పిల్లలు పెద్దవుతున్నారు, హైదరాబాద్‌కి వెళ్లిపోదామనే ఆలోచన వచ్చిన నాటికి హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణరంగం కొత్త రూపు సంతరించుకుంటోంది. 25–30 అంతస్తుల భవనాల నిర్మాణం మొదలైన రోజులవి. అది నాకు బాగా కలిసి వచ్చింది. నిర్మాణరంగంలో అవసరమైన కొత్త టెక్నాలజీతో కూడిన ఎక్విప్మెంట్ తయారీని ప్రారంభించాం. ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్మెంట్ని అప్పటివరకు చైనా, యూరప్ నుంచి దిగుమతి చేసుకుంటూ వచ్చిన నిర్మాణసంస్థలకు అవన్నీ ఇండియాలోనే దొరకడం మంచి సౌలభ్యం కదా. అలా 2006లో మొదలైన మా కంపెనీ ఇప్పుడు దేశవ్యాప్తంగా మూడు వందలకు పైగా సంస్థలకు సేవలందిస్తోంది. వ్యాపారం అంటే... సమాజం లోని అవసరాన్ని గుర్తించి ఆ అవసరాన్ని తీర్చడం, ఒక సమస్యకు పరిష్కారం చూపించడం. అప్పుడే బిజినెస్ విజయవంతమవుతుంది. మా కంపెనీ సిద్ధాంతం నాలుగు ‘ఎస్’లు... స్పీడ్, సేఫ్టీ, సేవింగ్స్, స్ట్రెంగ్త్. పని వేగంగా జరగాలి, పనిలో పాల్గొనే కార్మికులకు రక్షణ కల్పించాలి, ప్రాజెక్టు వ్యయం తగ్గాలి, పని చేసే కార్మికుని శక్తిని ఇనుమడింప చేయాలి. మా క్లయింట్ అవసరానికి తగినట్లు కస్టమైజ్డ్ ఎక్విప్మెంట్ను డిజైన్ చేయడం, తయారు చేయడం, ఇన్స్టాల్ చేయడం, యాన్యుయల్ మెయింటెనెన్స్ సర్వీస్ ఇవ్వడం, ఆ కంపెనీ ప్రాజెక్టు మరో చోటకు మారినప్పుడు ఎక్విప్మెంట్ని ఆ ప్రదేశానికి తీసుకువెళ్లి అమర్చడం... ఇలా ఉంటుంది మా పని. ఇప్పుడు దేశం ఎల్లలు దాటి విదేశాలకు కూడా విస్తరించాం. నా రంగంలో నేను లక్ష్యంగా పెట్టుకున్న శిఖరానికి చేరాననే చెప్పాలి. నా వంతు బాధ్యతగా మహిళా సమాజానికి, యువతకు కెరీర్ ప్లానింగ్ గురించి చెబుతున్నాను. కోవె (కన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్) తెలంగాణ అధ్యక్షురాలిగా వేలాది మహిళలకు, యువతకు ఎంటర్‌ప్రెన్యూరల్ మైండ్‌సెట్ క్లాసులు చెప్తున్నాను. కంపెనీ నిర్వహణలో ఉద్యోగులను కలుపుకుపోవడం చాలా అవసరం. పని వరకే చేయించుకుని మిగిలిన విషయాల్లో వాళ్లను డార్క్‌లో ఉంచరాదు. కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలను వారితో చర్చించాలి. ఈ కంపెనీతో కొనసాగితే కెరీర్లో పైకి ఎదగగలమనే భరోసా కలిగితేనే ఉద్యోగులు మనతో కొనసాగుతారు. ఇలాంటి అనేక విషయాలను చెబుతుంటాను. ఈ జర్నీ నాకు సంతోషంగా ఉంది. ఏటా ఈ ఏడాది ఎంతమంది మహిళలకు దిశానిర్దేశం చేశానని లెక్కచూసుకున్నప్పుడు కనిపించే పెద్ద సంఖ్య నాకు ఆత్మసంతృప్తి కలిగించే విషయం ’’ అని వివరించారు జ్యోత్స్న చెరువు. లీడర్‌గా ఎదిగేది కొందరే! మా దగ్గరకు ట్రైనింగ్‌కు వచ్చిన మహిళలకు నేను చెప్పే తొలిమాట ‘మీ స్ట్రెంగ్త్ ఏమిటో మీరు తెలుసుకోండి’ అని. వాళ్లకు ఏం వచ్చో తెలిసిన తర్వాత వాళ్లకు ఎటువంటి కెరీర్ సౌకర్యంగా ఉంటుందో సూచిస్తాను. ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలంటే... మొదటగా ఉండాల్సింది స్థిరత్వం. చిన్న ఉదాహరణ చెబుతాను... ఒక ఇస్త్రీ షాపు వ్యక్తి రోజూ కచ్చితంగా షాపు తెరవకపోతే మనం దుస్తులు ఇవ్వం కదా! రోజూ ఠంచన్‌గా పని చేసే వ్యక్తికి మాత్రమే ఇస్తాం. ఇంటి ముందుకు వచ్చే వాళ్ల దగ్గర కూరగాయలు కొనాలన్నా అంతే. మన సర్వీస్ అందుకునే క్లయింట్ ప్రత్యామ్నాయాన్ని వెతుక్కునే పరిస్థితిని కల్పించకూడదు. ఎందరు వచ్చినా, ఎవరూ రాకపోయినా సరే వర్క్‌ప్లేస్‌ని మూతవేయరాదు. నేను నా రంగంలో సంపాదించుకున్న నమ్మకం అదే. ఏ సమయంలో ఫోన్ వచ్చినా సరే... ఎవరో ఒకరు హాజరవుతారనే భరోసా కల్పించడంలో విజయవంతం అయ్యాం. మా దగ్గరకు కోర్సులో చేరిన పాతిక మందిలో చివరకు ఆ కోర్సును ఉపయోగపెట్టుకునేవాళ్లు పదికి మించరు. కోర్సు సమయంలో ‘ఇంటికి బంధువులు వచ్చార’ని క్లాసు మానేసే వాళ్లు ఎంటర్ ప్రెన్యూర్‌గా కూడా కొనసాగలేరు. బిజినెస్ రంగంలో ఉన్న ఇద్దరు మగవాళ్లు కలిస్తే తమ వ్యాపారం గురించి, ఇతరుల వ్యాపారం గురించి, విస్తరణకు ఉన్న అవకాశాల గురించి మాట్లాడుకుంటారు. అదే ఇద్దరు మహిళలు రిలేషన్ షిప్ మీద మాట్లాడినంతగా తమ ప్రొఫెషన్ గురించి చర్చించరు. ప్రొఫెషన్ గురించి మాట్లాడగలిగిన మహిళలే లీడర్లుగా ఎదుగుతారు, ఫీల్డ్‌లో విజయవంతంగా నిలబడగలుగుతారు. – జ్యోత్స్న చెరువు, డైరెక్టర్, సిఎమ్ఏసీ, ప్రెసిడెంట్, కోవె తెలంగాణ – వాకా మంజులారెడ్డి ఫొటోలు : మోహనాచారి -
Career pedia: నేర్చుకుంటే సాధించవచ్చు
గతంతో పోల్చితే ఈ రోజుల్లో చదువుకున్నవారి సంఖ్య బాగా పెరుగుతోంది. మంచి కంపెనీలలో ఉద్యోగమూ సంపాదిస్తున్నారు. ‘కానీ, ఆ ఆనందం వారిలో కొన్నాళ్లలోనే ఆవిరైపోతుంది..’ అంటున్నారు జ్యోత్సా్నరెడ్డి. నైపుణ్యాల లేమి కారణంగా నవతరం ఎదుర్కొంటున్న ఒత్తిడిని గమనించి, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను ఏర్పాటు చేసి, వారిలో అవగాహన కలిగిస్తున్నారు. కాలేజీలలో వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నారు. ‘ప్రపంచానికి ఇప్పుడు మార్కులు, పర్సెంటేజీలు కాదు నైపుణ్యాలు కావాలి’ అని చెబుతున్న ఈ కెరీర్ గైడ్ హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ‘కెరీర్ పీడియా’ ద్వారా తన సేవలను అందిస్తున్నారు. మల్టిపుల్ కంపెనీలలో ఉద్యోగం చేసిన అనుభవం సొంతం చేసుకున్న జ్యోత్స్న తను తీసుకున్న నిర్ణయం గురించి, యువతరం ఎదుర్కొంటున్న ఒత్తిడి గురించి, వాటి పరిష్కారాల దిశగా తాము చేస్తున్న ప్రయాణం గురించి వివరించారిలా... ‘‘ఎంబీయే పూర్తయ్యాక బెంగళూరు, హైదరాబాద్‌లో అనేక కంపెనీలలో ఉద్యోగాలు చేశాను. అక్కడ గమనించిన వాటిలో ముఖ్యమైనది యువత ఎంత ఎక్కువ శాతంలో ఉద్యోగంలో చేరుతున్నారో.. అంతే శాతంలో రిజెక్ట్ కూడా అవడం. కారణం... వారు చదువుకున్న కాలేజీలలో పాఠ్యాంశాలే తప్ప ఇతర నైపుణ్యాలు నేర్పించరు. విద్యార్థులు కూడా వాటి మీద దృష్టి పెట్టరు. కొందరు మాత్రమే రాణించడానికి, మిగతావాళ్లు వెనకబడటానికి గల కారణాలేంటో కొన్నాళ్లు గమనించాను. ఉద్యోగంలో చేరినా.. పని సకాలంలో పూర్తిచేసే సామర్థ్యం చాలా మందిలో ఉండటం లేదు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు, టెక్నికల్ నాలెడ్జ్ అంతంత మాత్రమే. ఇలాంటప్పుడు కంపెనీలపై కూడా వీరి వల్ల ఒత్తిడి ఉంటుంది. కొన్నాళ్లు కొత్తగా చేరిన ఉద్యోగుల పనితీరును గమనించి, వారి ఫైల్స్ పక్కన పెట్టేస్తుంటారు. ఒక్క ఐటీ రంగమే కాదు, ఇతర రంగాల్లోనూ నైపుణ్యాల లేమి అనే సమస్య ఉంది. దీనికి కోవిడ్ కూడా ఒక అడ్డంకి అయ్యింది. కంపెనీలు చాలా వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్‌ను ఎడాప్ట్ చేసుకున్నాయి. క్యాంపస్ సెలక్షన్స్ లేవు. దీంతో విద్యార్థుల్లో సంస్థలకు కావల్సిన క్వాలిటీ శాతం బాగా తగ్గింది. సంస్థలు ఇప్పుడు క్వాలిటీ ఎంప్లాయీస్ కోసం అన్వేషిస్తున్నాయి. ఉద్యోగులకు నైపుణ్యాలు కల్పిస్తే కంపెనీలకు కావాల్సిన టెక్నికల్ మాన్ పవర్‌ను అందించగలం అనుకున్నాం. మావారు రాహుల్‌రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవడంతో ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలకు మద్దతుగా నిలిచారు. మా ఇద్దరిదీ ఒకే రంగం అవడం వల్ల తీసుకున్న నిర్ణయాలను త్వరగా అమలు చేయగలుగుతున్నాం. మార్కులు కాదు ముఖ్యం.. నిజానికి ఇదొక ప్రయోగాత్మక కార్యక్రమమనే చెప్పవచ్చు. విద్యార్థులు–సంస్థల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాలనుకున్నాను. అయితే, ఇందుకు కావల్సిన వనరుల గురించి కూడా ఆలోచించాం. అప్పటికే మాకున్న మాతృసంస్థ ‘ఇన్ప్రాగ్’ ద్వారా ఆర్థికసాయం తీసుకుంటున్నాం. పేద విద్యార్థులకు ఉచిత సేవలు అందించడానికి, అలాగే ఇతరులకూ నామమాత్రపు ఫీజుతో స్కిల్స్‌లో శిక్షణ ఇవ్వడానికి సాధ్యమయ్యింది. ‘చిన్న వయసులోనే పెద్ద బాధ్యతను తీసుకున్నారు’ అని తెలిసిన వారంటుంటారు. కష్టమైనా ఇష్టంతో చేస్తున్న పని. ఎంతో మందికి ఉపయోగపడే పని’ అని చెబుతుంటాను. అత్యాధునిక నైపుణ్యాలకు అన్ని రంగాల్లోనూ అధిక డిమాండ్ ఉంది. అందుకని విద్యార్థులు ముందుగా స్పెషలైజేషన్‌లో భాగంగా వారి నైపుణ్యాలను అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది’ అని వివరించారు ఈ కెరీర్ప్లానర్. చదువుకుంటూనే నైపుణ్యాలు ‘ఇది కొంచెం కష్టమైన పనే. కానీ, విద్యార్థులు తమ డిగ్రీ స్థాయిలోనే నైపుణ్యాలను అలవర్చుకుంటే, తర్వాత ఉద్యోగావకాశాలకు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఇది గుర్తించి కాలేజీల్లో వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నాం. డిగ్రీస్థాయివారి మాత్రమే కాదు ఇతర డిప్లొమా కోర్సులు చేసిన వారికి కూడా వారి కెరీర్ లక్ష్యాలను సాధించడానికి ప్రోత్సహిస్తున్నాం. ఫలితంగా విద్యార్థి డిగ్రీ నాలుగేళ్లలోనే స్కిల్స్ పెంచుకుంటే, నేరుగా సంస్థల్లో తమ నైపుణ్యాలను చూపవచ్చు. విద్యార్థులు ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు సంపాదన మొదలుపెట్టడానికి ఫ్రీలాన్స్ అవకాశాలను కూడా సెట్ చేస్తున్నాం. ఇందుకు ఆన్‌లైన్‌ను వేదికగా చేసుకున్నాం.’ – నిర్మలారెడ్డి -
Jyotsna Bose: కరోనా వారియర్.. సడలని పిడికిలి
కార్మిక సంఘాల పోరుబాటలో జీవిత చరమాంకం వరకు పిడికిలి బిగించి ముందు వరుసలో నడిచిన జ్యోత్స్న బోస్.. కరోనా పై పోరులో మరణానంతరం కూడా యోధురాలిగానే నిలిచిపోయారు. కరోనాతో మరణించిన జ్యోత్స్నపై ‘పేథలాజికల్ అటాప్సీ’ (వ్యాధి అధ్యయనం కోసం చేసే శవ పరీక్ష) జరగడంతో.. దేశంలోనే తొలిసారి కరోనా ప్రభావాల పరిశోధనలకు ఉపయోగపడిన తొలి మహిళగా ఆమె గుర్తింపు పొందారు. జ్యోత్స్న కోల్‌కతాలోని బెలెఘటలో ఉంటారు. ఆమెకు కరోనా సోకినట్లు ఈ నెల 10న ఆమె కుటుంబం గుర్తించింది. ఆమె మనువరాలు తీస్తా బసు వైద్యురాలు. ప్రాథమిక చికిత్సతో నాలుగు రోజులైనా తగ్గకపోవడంతో జ్యోత్స్నను ఆమె మే 14 న బెలెఘటలోనే ఒక ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మే 16న ఆమె మర ణించారు. తను చనిపోతే తన అవయవాలను దానం చేయాలని పదేళ్ల క్రితమే ఆమె అనుమతి పత్రంపై సంతకాలు పెట్టారు. అయితే ఇప్పుడామె చనిపోయింది కరోనాతో. అవయవదానం కుదరదు. అలాగని ఆమె అంతిమ కోరికను నెరవేర్చకుండా ఎలా... అనుకున్నారు తీస్తా బసు. జ్యోత్స్న ఆసుపత్రిలో చేరిన రోజు వేరొక ఆసుపత్రిలో కరోనాతో మరణించిన బ్రోజోరాయ్ అనే వ్యక్తికి కోల్‌కతాలోని ఆర్.జి.కార్ మెడికల్ కాలేజీలో పేథలాజికల్ అటాప్సీ జరిగింది. అది స్ఫురించి, జోత్స్న మృతదేహాన్ని కూడా అక్కడికి పంపించారు తీస్తా బసు. మే 20 న అక్కడ ఆమెకు అటాప్సీ జరిగింది. దేశంలోనే తొలిసారి కరోనా పరిశోధనలకు తోడ్పడిన మహిళగా జోత్స్న చరిత్రలో నిలిచిపోయారు. ఆమె తర్వాత కోల్‌కతాలో ప్రముఖ నేత్ర వైద్యులు బిస్వజిత్ చక్రవర్తి (60) మృతదేహానికి అటాప్సీ జరిగింది. జోత్స్న కు ముందు అటాప్సీ జరిగిన బ్రోజోరాయ్.. కోల్‌కతాలోని ప్రసిద్ధ అవయవదాన స్వచ్ఛంద సంస్థ ‘గణదర్పణ్’ వ్యవస్థాపకులు. అవయవదానానికి అనుమతినిస్తూ పదేళ్ల క్రితం జ్యోత్స్న సంతకాలు పెట్టి ఇచ్చింది ఆ సంస్థకే. ఇప్పుడీ ముగ్గురి మృతదేహాలపై జరిగిన పరిశోధనల ఫలితాలు వస్తే కరోనాను నివారించేందుకు, నిరోధించేందుకు, నియంత్రించేందుకు దారేదైనా కనిపించవచ్చని ఈ పరీక్షలు నిర్వహించిన వైద్యుల కమిటీ ఆశిస్తోంది. కరోనాతో మరణించినవారిపై విదేశాల్లో అరకొరగా పరిశోధనలు జరుగుతున్నప్పటికీ మన దేశంలో ఇలా జరగడం ఇదే మొదటì సారి. పరిశోధనలకు ఉపయోగపడిన తొలి మహిళ జ్యోత్స్న.. మరణానంతరం కూడా కరోనా యోధురాలిగానే దేశానికి గుర్తుండిపోతారు. జ్యోత్స్న 1927లో చిట్టాగాంగ్ (నేడు బంగ్లాదేశ్‌లో ఉన్న ప్రాంతం) జన్మించారు. ఆనాటి సామాజిక, రాజకీయ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. కార్మిక సంఘాల పోరాటాలలో పాలు పంచుకున్నారు. రాయల్ ఇండియన్ నౌకాదళ తిరుగుబాటుకు మద్దతుగా 1946లో తంతీతపాల కార్మికుల సమ్మెకు ‘నేను సైతం’ అన్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆమె తండ్రి అదృశ్యం అయిపోవడంతో ఆ కుటుంబం ఆర్థికంగా కష్టాలు పడింది. జ్యోత్స్న చదువు కుంటుపడింది. బ్రిటిష్ టెలిఫోన్స్‌లో ఆపరేటర్‌గా చేరి బతుకుబండిని లాక్కొచ్చారు. -
విశాఖ: జ్యోత్స్న మృతిపై వీడని మిస్టరీ
-
భార్య ఆత్మహత్య రహస్యాన్ని చేధించిన భర్త
బెంగళూరు: ప్రేమించిన వాడికి పెళ్లి నిశ్చయమైందనే వార్తతో గత ఏడాది వివాహిత ఆత్మహత్య చేసుకున్న కేసుకు సంబంధించిన చిక్కుముడి వీడింది. తన భార్య ఆత్మహత్యకు గల కారణాలను స్వయంగా ఆమె భర్తే శోధించి పోలీసులకు అందించడం ఇక్కడ మరో విశేషం. వివరాల్లోకి వెళితే...ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన వెంకట్ జగదీశ్‌కు అదే ప్రాంతానికి చెందిన జోత్స్నా వైశ్యరాజుతో 2015 మార్చిలో వివాహమైంది. బెంగళూరులో సాప్ట్ వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న వెంకట్ జగదీశ్ పెళ్లయిన అనంతరం భార్య జోత్స్నను తన వెంట తీసుకొని బెంగళూరులోని కాపురం పెట్టాడు. జోత్స్న కూడా ఇంజనీరింగ్ చదవగా తనకు ఉద్యోం చేయడం ఇష్టం లేకపోవడంతో ఇంట్లోనే ఉండేది. పెళ్లయిన కొద్ది నెలల వరకు వైవాహిక జీవితం సజావుగా సాగుతున్న వెంకట్‌కు అదే ఏడాది డిసెంబర్లో జోత్స్న ఆత్మహత్యకు పాల్పడడంతో ఊహించని షాక్ తగిలింది. అప్పటి వరకు తనను సొంత కొడుకులా భావించిన జోత్స్న తల్లితండ్రులు కుమార్తె ఆత్మహత్యకు తమ అల్లుడైన వెంకట్ కారణమని, అతడి చిత్రహింసలు భరించలేకే తమ జ్యోత్స్న ఆత్మహత్యకు పాల్పడిందని ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంకట్‌ను అరెస్ట్ చేసారు. అనంతరం ఈ ఏడాది జనవరిలో బెయిల్‌పై విడుదలైన వెంకట్ అప్పటి నుండి తన భార్య ఆత్మహత్యకు గల కారణాలపై పరిశోధించడం ప్రారంభించాడు.ఆమె కాలేజీ నాటి ఫోటోలు,పరిచయాలు, ఫేస్బుక్, వాట్సాప్‌లను క్షుణ్ణంగా పరిశీలించిన వెంకట్‌కు తన భార్య జోత్స్నకు,ఆమె సీనియర్ గిరీశ్ పట్నాయక్‌లకు మధ్య ప్రేమ వ్యవహారం బయటపడింది. ఆమె ఫేస్బుక్ అకౌంట్ తెరచి చూడగా అందులో 60వేల మెసేజ్లున్నాయని అందులో ఎక్కువగా గిరీశ్ పట్నాయక్‌తోనే ఛాటింగ్ చేసేదని,అందులో ఇద్దరం కలసి ఎక్కడికైనా పారిపోదామని మాట్లాకున్నట్లు వెంకట్‌కు తెలిసింది.అంతే కాకుండా తన ఆఫీస్‌కు వెళ్లిన అనంతరం ఆమె మొబైల్ నుండి ఎక్కువగా గిరీశ్ పట్నాయక్‌కే కాల్స్ వెళ్లినట్లుగా వెంకట్ తెలుసుకున్నాడు. కాలేజీ నుండి నడుస్తున్న జోత్స్న,గిరీశ్ పట్నాయక్ల ప్రేమ వ్యవహారం జోత్స్నకు వివాహమైన అనంతరం కూడా కొనసాగించినట్లు తెలుసుకున్నాడు. ఈ క్రమంలో గిరీశ్పట్నాయక్కు మరో యువతితో వివాహం నిశ్చయమైందని తెలియడంతో దీనిపై జోత్స్న ప్రశ్నించగా అతడు ఆమెను నిర్లక్ష్యం చేయడం ప్రారంభించాడు. దీంతో గిరీశ్పట్నాయక్ తీరుతో మనస్థాపం చెందిన జోత్స్న ఆత్మహత్యకు పాల్పడింది. ఈ వ్యవహారాన్ని అంతా వెంకట్ సాక్ష్యాలతో సహా పోలీసులకు అందించారు. ఆ సాక్ష్యాల ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు జోత్స్న ఆత్మహత్యకు కారకుడైన గిరీశ్ పట్నాయక్‌ను శ్రీకాకుళంలో అరెస్ట్ చేసి బెంగళూరు తరలించి విచారణ చేస్తున్నారు. -
శవమై తేలిన చిన్నారి జ్యోత్స్న
విశాఖపట్నం: విశాఖ జిల్లాలోని ఆర్కే బీచ్‌లో గల్లంతైన మూడేళ్ల చిన్నారి జ్యోత్స్న ఆదివారం శవమై తేలింది. చిన్నారి మృతదేహం వుడా పార్క్ వద్ద తీరానికి కొట్టుకొచ్చింది. పాండురంగాపురం జాస్తిస్క్వేర్ ఎదురుగా ఆర్కే బీచ్‌లో చిన్నారి జ్యోత్స్న శనివారం రాత్రి ఆడుకుంటుండగా ఒక్కసారిగా భారీ అల రావడంతో గల్లంతైన సంగతి తెలిసిందే. సమాచారం అందుకున్న మెరైన్ పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారి ఆచూకీ కోసం భీమిలి వరకు నేవీ సిబ్బంది సముద్రంలో జల్లెడపట్టారు. తమ గారాల పట్టి చిన్నారి జ్యోత్స్న ఇక లేదనే విషయాన్ని జీర్ణించుకోలేని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమైయ్యారు. -
ఆర్కే బీచ్‌లో చిన్నారి గల్లంతు
తీరంలో ఆడుకుంటున్న చిన్నారిని సాగర అల మింగేసింది. విశాఖపట్నంలోని పాండురంగాపురం జాస్తిస్క్వేర్ ఎదురుగా ఆర్కే బీచ్లోశనివారం రాత్రి మూడేళ్ల జ్యోత్స్న ఆడుకుంటున్న క్రమంలో ఒక్కసారిగా వచ్చిన భారీ అల ఆ చిన్నారిని సముద్రంలోకి లాగేసింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు లబోదిబోమంటూ కేకలు పెట్టారు. వెంటనే మెరైన్ పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారి ఆచూకీ లభించలేదు. -
ఇట్లు.. ఇలియాస్ -జ్యోత్స్న
ఆకాశవాణిలో అనౌన్సర్లుగా ప్రారంభమైన ఇలియాస్, జ్యోత్స్నల జీవితం దాంపత్యబంధంగా మారింది. మతాలు వేరైనా తమ మనసులనొక్కటి చేసింది రేడియోనే అంటున్న ఈ దంపతులు... రిటైర్ అయ్యాక కూడా ఇప్పటికీ సీరియళ్లకు డబ్బింగ్ చేయిస్తూ, లైఫ్‌ను బిజీగా గడుపుతున్నారు. ప్రముఖ రేడియో కళాకారిణి శారదా శ్రీనివాసన్‌తో వారి సంభాషణ... నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ సాగింది. ఆ ముచ్చట్లు ఈ వారం ‘రేడియో తరంగాలు’లో మీ కోసం.. 1972 బ్యాచ్... ఇలియాస్: అప్పట్లో నేను ఐఏఎస్, ఐపీఎస్‌కు అప్పియర్ అవ్వాలనుకునేవాణ్ణి. కానీ ఉద్యోగావసరం నన్ను రేడియోలోకి లాగింది. అందులో అడుగుపెట్టాక కూడా ఎప్పటికైనా వెళ్లిపోవాలి అనుకునేవాణ్ణి కానీ ఇలా శాశ్వతంగా ఆకాశవాణిలో పని చేసి రిటైర్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. జోత్స్న: నేనూ ఇలియాస్ బ్యాచ్‌మేట్స్. నేను 2008లో, ఇలియాస్ 2000లో పదవీ విరమణ చేశాం. ఇద్దరం కలసి ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఆకాశవాణికి వచ్చే వరకు రచనపై మాకు ఆసక్తిలేదు. వారసత్వంగా... జ్యోత్స్న: అమ్మ ‘రేడియో భానుమతి’ నుంచి వారసత్వంగా ఇందులోకి వచ్చాను. కాబట్టే ఇక్కడ త్వరగా ఒదిగిపోగలిగాను. అప్పట్లో బాలానందం కార్యక్రమానికి తరచూ వెళ్లేదాన్ని. దూరదర్శన్‌లో వార్తలు కూడా చదివాను. దాని కోసం డి.వెంకట్రామయ్య గారి దగ్గర శిక్షణ తీసుకున్నాను. నాటకాలపై నాకు ఎక్కువ ఆసక్తి. రంగనాయకమ్మగారు రాసిన ‘స్వీట్‌హోం’ కథ నచ్చి ఆమె దగ్గర నాటకం వేయడానికి అనుమతి తీసుకొని అందులో ‘విమల’ పాత్రలో నటించాను. ఇలా రేడియో నా జీవితంలో ముఖ్య భూమిక పోషించింది. మా ఇద్దరి పేర్ల్లే ‘మధూలత’... ఇలియాస్: నేను ‘రేడియో క్లబ్’ అనే కార్యక్రమం చేశాను. అందులో శ్రోతలకు మెంబర్షిప్ ఉండేది. అంటే వారి నంబర్లు తీసుకొని మేమే ఫోన్ చేసేవాళ్లం.ఆ కార్యక్రమం మాకూ శ్రోతలకు మధ్య బాంధవ్యాన్ని పెంచింది. 1975లో చిన్న చిన్న ముచ్చట్లు పెట్టుకునే కార్యక్రమం చేస్తే బాగుంటుందనిపించింది. అలా నేను, జోత్స్న కలసి ‘పూలజల్లు’ అనే అయిదు నిమిషాల కార్యక్రమం ఏడాదిన్నర పాటు చేశాం. దాంట్లో మా ఇద్దరి పేర్లు ‘మధూలత’. అందులో రోజుకో అంశంపై ముచ్చటించే వాళ్లం. రెండేళ్ల క్రితం నేను ఆస్పత్రికి వెళ్లినప్పుడు మా పేర్లు విని ఓ అమ్మాయి మీరు పూలజల్లులోని మధూలత కదా అని అడిగింది. ఎప్పటి మధూలత అనిపించింది కానీ చాలా ఆనందం కలిగింది. రచనా ప్రస్థానం... ఇలియాస్: నేను రాయడం రేడియోకు వచ్చాకే మొదలెట్టాను. ఏ కథ గురించి అయినా జోత్స్నతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటా. అలా ఇద్దరం కలసి ఎన్నో పత్రికలకు, మ్యాగజీన్లకు ఇలియాస్ జ్యోత్స్న పేరుతో కథానికలు రాశాం . తర్వాత సీరియల్స్ రాయడమూ ప్రారంభించాం. 1988-89లో ఎయిడ్స్ మనం దేశంలో వ్యాపించసాగింది. అప్పుడు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థవారు ప్రజల్లో అవగాహన కల్పించేలా కార్యక్రమం చేయాలని మాకు చెప్పారు. అప్పుడు హెచ్.ఐ.వి వైరస్‌ను గుర్తించిన సైంటిస్ట్ రాబర్ట్ గాల్లోను హైదరాబాద్‌లోని సీసీఎంబీలో కలసి ఇంటర్వ్యూ చేసి ‘మీ నేస్తం’ పేరుతో ప్రాయోజిత కార్యక్రమం నిర్వహించాం. మొదటిసారి రికార్డింగులడిగారు... నేను మీతో (శారదా శ్రీనివాసన్) కలసి చేసిన ‘మెదియా’ నాటకం శ్రోతలందరికీ ఎంతగానో నచ్చింది. ఎంతోమంది స్టూడియోకు వచ్చి రికార్డింగ్స్ అడిగి మరీ తీసుకెళ్లారు. అలాగే ‘లైఫ్ టానిక్’ లో మృత్యు దేవతగా మీరు (శారదా శ్రీనివాసన్) చేసిన పాత్ర అద్భుతం. అది విన్నాక అందరూ మృత్యుదేవతను సైతం ఇష్టపడ్డారు (నవ్వుతూ). టీవీ రంగప్రవేశం... ఇలియాస్: ‘కోడలా కోడలా కొడుకు పెళ్లామా’ కథతో సీరియల్స్ ప్రస్థానం ప్రారంభించా. అది 100 ఎపిసోడ్లు నడిచింది. ‘అలౌకిక’ సీరియల్ తీశా! అది విజయవంతం అయింది. తర్వాత ‘అన్వేషిత’ సీరియల్ చేశాను. అది ఎంతలా ప్రేక్షకాదరణ పొందిందో అందరికీ తెలుసు. ఆ సీరియల్‌కు 8 నంది అవార్డులు వచ్చాయి. అలాగే నేను తీసిన పొగమంచు, చిరుదివ్వెలు (బాలల చిత్రం), శ్వేత గులాబీలు లాంటి వాటికీ నందులు అందుకున్నాను. ఇంట్లోనే స్టూడియో... (జ్యోత్స్న) మైక్రోఫోన్ మీదున్న ప్రేమ తగ్గకే ఇంట్లో స్టూడియో ఏర్పాటు చేసుకున్నాం. మొబైల్ కంపెనీలకు కంటెంట్ తయారు చేసిస్తాం. మా దగ్గర కొంతమంది డబ్బింగ్ ఆర్టిస్టులున్నారు. కొన్ని చానళ్లకు హిందీ నుంచి తెలుగు సీరియళ్లకు స్క్రిప్ట్ రాసి ఇంట్లోనే డబ్బింగ్ చేసి ఇస్తాం. రిటైర్ అయ్యాకే ఇంకా ఎక్కువ బిజీ అయ్యాం. అయినా ఈ హైదరాబాద్ ట్రాఫిక్‌లో తిరగడమంటే మామూలు విషయమా... ప్రస్తుతం మా చేతుల్లో ఉన్న కొన్ని డబ్బింగ్ సీరియళ్లతో బిజీబిజీగా ఉన్నాం. నాన్నగారి వల్లే... జ్యోత్స్న: నాన్నే మా పెళ్లి జరిపించారు. ఆయన బ్రహ్మసమాజ సిద్ధాంతాలను పాటించేవారు. ఆ తర్వాత మా కూతురు స్వప్న (టీవీ యాంకర్)కూ బ్రహ్మసమాజం పద్ధతిలోనే దగ్గరుండి వివాహం చేయించారు. మా అమ్మను ఆయనెప్పుడూ కట్టడి చేయలేదు. అలా మా పెళ్ల్లయ్యాక మా అమ్మ(భానుమతి), అత్తయ్య (షాహీన్ ఫాతీమా) చాలా సన్నిహితంగా ఉండేవారు. ఉదాహరణకు వరలక్ష్మీ పూజ వచ్చిందంటే మా అత్తయ్యే అమ్మకు పండ్లు, పూలు, మట్టి కుందులు పంపించేవారు. మనల్ని అర్థం చేసుకోదని సమాజాన్ని తిడుతుంటాం కానీ నిజాయితీ ఉంటే తప్పకుండా మన పనిని స్వీకరిస్తుంది. సమాజానికి విశాల హృదయం ఉంది. మా ఇద్దరి మీద ప్రేమతోనే అందరూ మా ఇంటికి వస్తారు. -
జ్యోత్స్న ఫణిజ పాడితే సంగీతం పరవళ్లు
మిణుగురులు సమాజానికి దివిటీలు జ్యోత్స్న ఫణిజ పాడితే సంగీతం పరవళ్లు తొక్కుతుంది. కలం కదిపితే అక్షరాలు తరంగాలై మనసును తట్టిలేపుతాయి. అంతేనా, కంప్యూటర్ ప్రోగ్రామింగ్లనూ వేగంగా చేస్తారు జ్యోత్స్న. పేద విద్యార్థులకు ఆంగ్ల భాషలో, కంప్యూటర్ అప్లికేషన్లలో ఉచిత శిక్షణ ఇస్తూ, ఆంగ్లసాహిత్యంలో నేడో రేపో డాక్టరేట్ పట్టా అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారామె.ఇవన్నీ ప్రతిభ గలవారందరూ అవలీలగా చేసేవేగా... జ్యోత్స్న ప్రత్యేకత ఏమిటి.. అంటే ఆమెకు చూపు లేదు! అలా అని ఆమె ఏనాడూ దిగులు చెందలేదు. తన జీవితాన్ని చక్కదిద్దుకుంటూ పదిమందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. ఆమె విజయగాథే ఈ వారం ‘మిణుగురులు’ - నిర్మలారెడ్డి కృష్ణా జిల్లా కైకలూరులో పాతికేళ్ల క్రితం... అభిమన్యకుమార్, సత్యవతిలకు అబ్బాయి తర్వాత రెండోసంతానంగా జన్మించింది జోత్స్న. మూడు నెలల వరకు వారు ఆ ఆనందంలోనే ఉన్నారు. తర్వాత ఓ రోజు ఆమె చూపులో ఏదో తేడాను గమనించారు. వైద్యులకు చూపిస్తే పుట్టుకతోనే అంధురాలు అని తేల్చారు! ‘‘అప్పుడు మా అమ్మ చాలా ఏడ్చిందట. నాన్నగారు చాలా బాధపడ్డారట. కానీ, అంత బాధలోనూ వారో నిర్ణయం తీసుకున్నారు. నా భవిష్యత్తును చక్కగా మలచాలని. అన్నయ్యతో పాటు నన్నూ స్కూల్లో చేర్పించారు. ఇంటర్మీడియెట్‌కి వచ్చాక చూపులేనివారికి సీట్ ఇవ్వలేమని కాలేజీ యాజమాన్యం చెప్పింది. నేనే కాలేజీ ప్రిన్సిపల్‌తో ‘మిగతా అందరికన్నా మంచి మార్కులు సాధించి చూపిస్తాను’ అని వాదించి, ఒప్పించాను. ఇంటర్మీడియెట్ వరకు ఉన్న ఊర్లోనే చదువుకున్న నేను డిగ్రీకి హైదరాబాద్‌కు వచ్చాను’’ అని చెప్పారు జ్యోత్స్న. అన్నింటా మేటి..! హైదరాబాద్‌లో ఓ అంధుల పాఠశాలలో చేరారు జ్యోత్స్న. ఇంటర్మీడియట్ వరకు తెలుగు మాధ్యమంగా చదివినప్పటికీ డిగ్రీలో ఇంగ్లిష్ లిటరేచర్ని ఎంచుకున్నారు. యూనివర్శిటీ స్థాయిలో మొదటిస్థానంలో నిలిచి బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. ఆ తర్వాత మెరిట్ స్కాలర్షిప్లు వరించి ఆమె తండ్రి కష్టాన్ని సగానికి తగ్గించాయి. కాలేజీ స్థాయిలో ఫెయిర్ అండ్ లవ్లీ వారి మెరిట్స్కాలర్షిప్తో జ్యోత్స్నకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. మూడు లక్షల మంది విద్యార్థినులతో పోటీపడి ఆ విజయాన్ని అందుకోగలిగారు. మరోవైపు ఎమ్.ఎ చేసి యు.సి.జి నెట్ క్వాలిఫై అయ్యారు. కువైట్, కెనడియన్ దేశాలలో మహిళల అభ్యున్నతికోసం ప్రసంగాలు ఇచ్చే అవకాశాలనూ వినియోగించుకున్నారు.. ఎక్కడకు వెళ్లినా ఒంటరిగానే వెళ్లడం అలవాటు చేసుకున్నారు. ఇందుకు అమ్మానాన్నలే జ్యోత్స్నను ప్రోత్సహించారు. ప్రస్తుతం ఆమె ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీలో పీహెచ్డీ చేస్తున్నారు. కంప్యూటర్ పరిజ్ఞానం ముంబయ్‌లో అడ్వాన్స్డ్ కంప్యూటర్ కోర్స్ చేశారు జ్యోత్స్న. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో టీ.సి.ఎస్ సంస్థ పెట్టిన పరీక్షలో మెరిట్ సాధించడంతో ఆ అవకాశం లభించింది. అంధులైన యువతీ యువకులకు మార్గదర్శకం చేసే కేంద్రాన్ని నెలకొల్పాలన్నది తన ఆశయం అని తెలిపారు జ్యోత్స్న. ఆధారపడటం తను ఇష్టపడదు జ్యోత్స్న నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మాకు దూరపు బంధుత్వం కూడా ఉంది. తన వ్యక్తిత్వం, ఎవరిమీదా ఆధారపడని తత్త్వం నన్ను ఎప్పుడూ అబ్బురపరిచేవి. పట్టుదల, ఇతరులకు సాయపడాలనే ఆలోచన కలిగిన ఆమెకు వెన్నుదన్నుగా నిలవాలనుకుని, తన చేయందుకున్నాను. నేను ఎం.బి.ఎ చేస్తున్నాను. నా సబ్జెక్ట్‌ల్లో వచ్చే సందేహాలనే కాదు జీవితంలో వచ్చే సవాళ్లనూ ఎలా ఎదుర్కోవాలో చెబుతుంది. - రాధాకృష్ణ (జ్యోత్స్న భర్త) -
బిడ్డ బరువైపోయింది.. బావిలో పడేసింది
ఓ కన్నతల్లి ఘాతుకం చీపురుపల్లి: నవ మాసాలు మోసింది. ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇంతలోనే భర్త ఆమెను వదిలేశాడు. ‘అసలే ఆడపిల్ల. ఆపైన అనారోగ్యంతో ఎదుగుబొదుగు లేని శరీరం. అత్తారింటి ఆదరణ లేదు.. కన్నవారికీ భారంగా మారాను..’ అనుకుందో, మరేమనుకుందో కానీ ఆ తల్లి కఠిన నిర్ణయం తీసుకుంది. విజయనగరం జిల్లా చీపురుపల్లి రామాంజనేయకాలనీకి చెందిన టేకు ఇందు అనే మహిళ తన ఏడాదిన్నర పాప జ్యోత్స్నను మంగళవారం రాత్రి బావిలో పడేసింది. వెంటనే పాపను బావిలో పడేశానంటూ కేకలు పెట్టింది. దీంతో అక్కడికి చేరుకున్న ఇందు తల్లిదండ్రులు బోరున విలపించారు. కేసు నమోదు చేయనున్నట్టు పట్టణ ఎస్ఐ ఎం.నాగేశ్వరరావు తెలిపారు. అర్ధరాత్రి వరకు పాపను బయటకు వెలికి తీయలేదు. తాను పుట్టింటికి, పాప తనకు భారంగా మారిన పరిస్థితుల్లోనే ఇలా చేయాల్సి వచ్చిందని ఇందు చెప్పింది. -
చీకటిలో చిరు దివ్వెలు
కారు చీకట్లు కమ్ముకున్న జీవనయూనంలో వారు వెలుగు దారులు వేసుకున్నారు. అలముకున్న అంధకారాన్ని పారద్రోలి విజ్ఞాన జ్యోతులు వెలిగిస్తున్నారు. నిరాశ, నిస్పృహలు వారిలో ఏ కోశానా కనిపించవు. కళ్లులేవన్న కలత దరిచేరదు. వైకల్యం కేవలం శరీరానికే గానీ మనసుకు కాదని నిరూపిస్తూ ముందుకు సాగుతున్నారు వారు. ఇద్దరు అంధులు టీచర్లుగా మారి విద్యార్థులకు పాఠాలు చెబుతూ బంగారు భవితను నిర్దేశిస్తుంటే.. మరొకరు బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణిస్తూ అన్నింటిలోనూ విజయ పతాకం ఎగురవేస్తున్నారు. అంతేకాదు.. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సకలాంగులతో సమానంగా వినియోగిస్తూ అబ్బుర పరుస్తున్నారు. కంప్యూటర్, సెల్‌ఫోన్, లాప్‌ట్యాప్‌లను అందరిలాగే అవలీలగా ఉపయోగిస్తున్నారు. కైకలూరుకు చెందిన ఈ అంధుల విజయగాథ మీకోసం.. సూపర్.. సురేష్ మాస్టర్.. ‘పిల్లలూ.. తెలుగు నామవాచకం పదో పేజీలోని మూడో లైన్ నాకు చెప్పండి..’ అని ఆ మాస్టార్ అడగ్గానే విద్యార్థి రాము టక్కున లేచి చెప్పాడు. ‘ఆగాగు.. మధ్యలో ఓ పదం చెప్పలేదేంటీ?’ అని ఆ మాస్టారు అడిగారు. అది విన్న ఆ విద్యార్థి ఆశ్చర్యపోయూడు. కళ్లున్న వారే గుర్తించలేని ఇలాంటి చిన్నచిన్న పొరపాట్లను ఓ అంధుడు గుర్తించి విద్యార్థులకు ఉత్తమ బోధన అందిస్తున్నారు. కైకలూరు నిమ్మగడ్డ నాగభూషణం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు మాస్టారుగా పనిచేస్తున్న గాజుల సురేష్‌కు పుట్టుకతోనే రెండు కళ్లు పోయాయి. కలిదిండి మండలం కోరుకొల్లు గ్రామానికి చె ందిన ఆయన రోజామేరి టీచర్ సహకారంతో నర్సాపురం అంధుల స్కూల్లో పదో తరగతి వరకు బ్రెరుులీ లిపిలో చదువుకున్నారు. హైదరాబాద్‌లో డిగ్రీ పూర్తిచేశారు. స్వామి నారాయణ కాలేజీలో బీఈడీ, వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ తెలుగు చేశారు. 2012-డీఎస్సీలో కైకలూరు స్కూల్లో తెలుగు మాస్టార్‌గా ఉద్యోగం వచ్చింది. కళ్లు లేకపోయినా.. విద్యార్థులనే తన నేత్రాలుగా భావిస్తున్నానని సురేష్ చెప్పారు. తనను ఇంతటి వాడిని చేసిన అన్నయ్య, అమ్మ రుణం తీర్చుకుంటానని చెబుతున్నారు. సుజాత అనే అంధురాలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సుజాత ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజోలు స్కూల్లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. నాన్న చనిపోయూడని తెలిసినా.. జోరున వర్షం.. ఓవైపు కన్నతండ్రి కాలం చేశారు. బాధను దిగమింగుతూనే డిగ్రీ పరీక్ష రాశాడు కైకలూరుకు చెందిన అంధుడు ఆత్మూరి శ్రీనాగ శ్రీరాముల గుప్తా. తల్లి పుణ్యవతి గుప్తాను అల్లారుముద్దుగా పెంచింది. తండ్రి మరణంతో గుప్తా తమ్ముడు చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతను నెత్తిన వేసుకున్నాడు. అక్కకు వివాహం చేశారు. తన తమ్ముడికి ఎలాగైనా సాయ పడాలనుకున్న గుప్తా ఆ విషయూన్ని జాగృతి స్కూల్ నిర్వాహకుడు అడవి కృష్ణకు చెప్పాడు. మొదట్లో అంధుడు పిల్లలకు పాఠాలు ఎలా చెబుతాడా.. అని అందరూ సంకోచించారు. తీరా.. గుప్తా పాఠాలు చెబుతున్న తీరు చూసి ఆశ్చర్యపోయూరు. దీంతో ఐదేళ్లుగా ఎంతోమంది విద్యార్థులకు ఆయన సోషల్ పాఠాలు చెబుతున్నారు. నర్సాపురం అంధుల స్కూల్లో పదో తరగతి చదివిన గుప్తా ఇంటర్, డిగ్రీ కైకలూరు కాలేజీలో చదివారు. బీఈడీ ముదినేపల్లిలో పూర్తిచేశారు. పీజీ ఇగ్నోలో చదివారు. రానున్న డీఎస్సీలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడమే తన లక్ష్యమని గుప్తా ‘సాక్షి’కి తెలిపారు. విజ్ఞాన జ్యోతులు వెలిగించిన జ్యోత్స్న ముద్దామందారాన్ని మరిపించే మోముతో.. చెరగని చిరునవ్వుతో అమాయకంగా చూస్తున్న ఈ యువతి అంధురాలంటే నమ్ముతారా. కానీ, అదే నిజం. పుట్టగానే కంటి చూపును కోల్పోరుున జ్యోత్స్న ఫణిజా కైకలూరుకు చెందిన బొల్లా అభిమన్యుకుమార్, సత్యవతి దంపుతుల కుమార్తె. విద్యాభ్యాసం అంతా నర్సాపురంలోని అంధుల పాఠశాలలోనే జరిగింది. కైకలూరులో ఇంటర్ హెచ్ఈసీలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించి ప్రతిభా పురస్కారం పొందింది. దీరుభాయ్ అంబానీ, ఫెరుుర్ అండ్ లవ్లీ మెరిట్ స్కాలర్‌షిప్‌నకు కూడా ఎంపికైంది. వ్యాసరచన, వక్తృత్వం, క్వీజ్‌లో వంద బహుమతులు సాధించింది. మిస్ కాలేజీ రన్నరప్‌గా నిలిచింది. ఇవేకాకుండా 70 కవితలు, 5 కథలు, 6 పరిశోధన వ్యాసాలు రాసింది. పలు ఇంగ్లిష్ జర్నల్స్‌లో జ్యోత్స్న వ్యాసాలు ప్రచురితమయ్యారుు. మాటీవీ, జెమినీ టీవీల్లో పలు సంగీత పోటీల్లో కూడా ఆమె పాల్గొంది. కువైట్‌లో జరిగిన తెలుగు కళాసమితి కార్యక్రమంలో రాష్ట్రం తరఫున పాల్గొని తన గానంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. 2009లో వరసకు బావ అరుున పామర్తి రాధాకృష్ణను వివాహం చేసుకుంది. హైదరాబాద్‌లో ఇంగ్లిష్ అండ్ ఫరన్ లాంగ్వేజెస్ యూనివర్సీటీలో ఎంఏ పూర్తిచేసి ప్రస్తుతం అక్కడే పీజీ చేస్తోంది జ్యోత్స్న. భవిష్యత్తులో ప్రొఫసర్ కావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నానని ‘సాక్షి’కి తెలిపింది. -
పెళ్లి మరో పదేళ్ల తర్వాతే..!
న్యూఢిల్లీ: మరో పది సంవత్సరాల తర్వాతే వివాహం చేసుకుంటానని బాలీవుడ్ నటి ఇషా గుప్తా తన మనసులో మాట చెప్పింది. నగరంలో జరుగుతున్న బీఎండబ్ల్యూ ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్‌లో భాగంగా ర్యాంప్‌పై నడిచిన ఈ సుందరి నవవధువు అవతారంలో అందరినీ ఔరా అనిపించింది. అయితే నిజజీవితంలో వివాహానికి మాత్రం మరో పది సంవత్సరాల సమయం కావాలని చెబుతోంది. ఫ్యాషన్ వీక్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం నగరానికి వచ్చిన ఈ మోడల్ తన కెరీర్ గురించి, పెళ్లి గురించిన ఆలోచనలను మీడియాతో పంచుకుంది. ‘ఓ మై గాడ్. పెళ్లా... దాని గురించి మరో పది సంవత్సరాల తర్వాత అడగండి. అంతకంటే ముందు నా అక్కకు పెళ్లి కావాలి’ అని తెలిపింది. ర్యాంప్‌పై సంప్రదాయబద్ధమైన గౌనును తొడిగినప్పటికీ పెళ్లికి మాత్రం అటువంటివి ధరించనని చెప్పింది. ‘పెళ్లికి మరో పది సంవత్సరాల వ్యవధి ఉందనే విషయం నాకు తెలుసు. ఫ్యాషన్ షోలో పాల్గొనేందుకు డిజైనర్ జ్యోత్స్న రూపొందించిన దుస్తులు ఎంతో బాగున్నాయి. ఆమె సృజనాత్మకత నాకు నచ్చింది. ఏదిఏమైనప్పటికీ పెళ్లి సమయంలో మాత్రం భారతీయత ఉట్టిపడే దుస్తులను మాత్రమే ధరిస్తా. అటువంటి దుస్తులను ధరించకపోతే మా అమ్మ కూడా ఊరుకోదు.’ అని తెలిపింది. కాగా ఇషా.. ఇండో బ్రిటిష్ ప్రొడక్షన్ సినిమాలో నటించేందుకు సన్నద్ధమవుతోంది. సినిమా రంగంలోకి రాకముందు మోడల్‌గా పనిచేసింది. ఈ ఫ్యాషన్‌షోలో తనను షోస్టాపర్‌గా నిలిపినందుకు జ్యోత్స్నకు ధన్యవాదాలు తెలియజేసింది. జ్యోత్స్న తివారి విభిన్నమైన దుస్తులను రూపొందించిందని, దీంతో తాను అందంగా, సరికొత్తగా కనిపించానంది. మోడలింగ్ కారణంగానే తాను షోస్టాపర్ కాగలిగానంది.