చీకటిలో చిరు దివ్వెలు | two blind mens are teaching to peoples | Sakshi
Sakshi News home page

చీకటిలో చిరు దివ్వెలు

Published Wed, Nov 26 2014 12:45 AM | Last Updated on Wed, Apr 3 2019 4:04 PM

చీకటిలో చిరు దివ్వెలు - Sakshi

చీకటిలో చిరు దివ్వెలు

కారు చీకట్లు కమ్ముకున్న జీవనయూనంలో వారు వెలుగు దారులు వేసుకున్నారు. అలముకున్న అంధకారాన్ని పారద్రోలి విజ్ఞాన జ్యోతులు వెలిగిస్తున్నారు. నిరాశ, నిస్ప­ృహలు వారిలో ఏ కోశానా కనిపించవు. కళ్లులేవన్న కలత దరిచేరదు. వైకల్యం కేవలం శరీరానికే గానీ మనసుకు కాదని నిరూపిస్తూ ముందుకు సాగుతున్నారు వారు.

ఇద్దరు అంధులు టీచర్లుగా మారి విద్యార్థులకు పాఠాలు చెబుతూ బంగారు భవితను నిర్దేశిస్తుంటే.. మరొకరు బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణిస్తూ అన్నింటిలోనూ విజయ పతాకం ఎగురవేస్తున్నారు. అంతేకాదు.. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సకలాంగులతో సమానంగా వినియోగిస్తూ అబ్బుర పరుస్తున్నారు. కంప్యూటర్, సెల్‌ఫోన్, లాప్‌ట్యాప్‌లను అందరిలాగే అవలీలగా ఉపయోగిస్తున్నారు. కైకలూరుకు చెందిన ఈ అంధుల విజయగాథ మీకోసం..                   

సూపర్.. సురేష్ మాస్టర్..
‘పిల్లలూ.. తెలుగు నామవాచకం పదో పేజీలోని మూడో లైన్ నాకు చెప్పండి..’ అని ఆ మాస్టార్ అడగ్గానే విద్యార్థి రాము టక్కున లేచి చెప్పాడు. ‘ఆగాగు.. మధ్యలో ఓ పదం చెప్పలేదేంటీ?’ అని ఆ మాస్టారు అడిగారు. అది విన్న ఆ విద్యార్థి ఆశ్చర్యపోయూడు. కళ్లున్న వారే గుర్తించలేని ఇలాంటి చిన్నచిన్న పొరపాట్లను ఓ అంధుడు గుర్తించి విద్యార్థులకు ఉత్తమ బోధన అందిస్తున్నారు. కైకలూరు నిమ్మగడ్డ నాగభూషణం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు మాస్టారుగా పనిచేస్తున్న గాజుల సురేష్‌కు పుట్టుకతోనే రెండు కళ్లు పోయాయి. కలిదిండి మండలం కోరుకొల్లు గ్రామానికి చె ందిన ఆయన రోజామేరి టీచర్ సహకారంతో నర్సాపురం అంధుల స్కూల్‌లో పదో తరగతి వరకు బ్రెరుులీ లిపిలో చదువుకున్నారు.

హైదరాబాద్‌లో డిగ్రీ పూర్తిచేశారు. స్వామి నారాయణ కాలేజీలో బీఈడీ, వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ తెలుగు    చేశారు. 2012-డీఎస్సీలో కైకలూరు స్కూల్‌లో తెలుగు మాస్టార్‌గా ఉద్యోగం వచ్చింది. కళ్లు లేకపోయినా.. విద్యార్థులనే తన నేత్రాలుగా భావిస్తున్నానని సురేష్ చెప్పారు. తనను ఇంతటి వాడిని చేసిన అన్నయ్య, అమ్మ రుణం తీర్చుకుంటానని చెబుతున్నారు. సుజాత అనే అంధురాలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సుజాత ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజోలు స్కూల్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.
 
నాన్న చనిపోయూడని తెలిసినా..

జోరున వర్షం.. ఓవైపు కన్నతండ్రి కాలం చేశారు. బాధను దిగమింగుతూనే డిగ్రీ పరీక్ష రాశాడు కైకలూరుకు చెందిన అంధుడు ఆత్మూరి శ్రీనాగ శ్రీరాముల గుప్తా. తల్లి పుణ్యవతి గుప్తాను అల్లారుముద్దుగా పెంచింది. తండ్రి మరణంతో గుప్తా తమ్ముడు చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతను నెత్తిన వేసుకున్నాడు. అక్కకు వివాహం చేశారు. తన తమ్ముడికి ఎలాగైనా సాయ పడాలనుకున్న గుప్తా ఆ విషయూన్ని జాగృతి స్కూల్ నిర్వాహకుడు అడవి కృష్ణకు చెప్పాడు.

మొదట్లో అంధుడు పిల్లలకు పాఠాలు ఎలా చెబుతాడా.. అని అందరూ సంకోచించారు. తీరా.. గుప్తా పాఠాలు చెబుతున్న తీరు చూసి ఆశ్చర్యపోయూరు. దీంతో ఐదేళ్లుగా ఎంతోమంది విద్యార్థులకు ఆయన సోషల్ పాఠాలు చెబుతున్నారు. నర్సాపురం అంధుల స్కూల్‌లో పదో తరగతి చదివిన గుప్తా ఇంటర్, డిగ్రీ కైకలూరు కాలేజీలో చదివారు. బీఈడీ ముదినేపల్లిలో పూర్తిచేశారు. పీజీ ఇగ్నోలో చదివారు. రానున్న డీఎస్సీలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడమే తన లక్ష్యమని గుప్తా ‘సాక్షి’కి తెలిపారు.
 
విజ్ఞాన జ్యోతులు వెలిగించిన జ్యోత్స్న
ముద్దామందారాన్ని మరిపించే మోముతో.. చెరగని చిరునవ్వుతో అమాయకంగా చూస్తున్న ఈ యువతి అంధురాలంటే నమ్ముతారా. కానీ, అదే నిజం. పుట్టగానే కంటి చూపును కోల్పోరుున జ్యోత్స్న ఫణిజా కైకలూరుకు చెందిన బొల్లా అభిమన్యుకుమార్, సత్యవతి దంపుతుల కుమార్తె. విద్యాభ్యాసం అంతా నర్సాపురంలోని అంధుల పాఠశాలలోనే జరిగింది. కైకలూరులో ఇంటర్ హెచ్‌ఈసీలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించి ప్రతిభా పురస్కారం పొందింది.

దీరుభాయ్ అంబానీ, ఫెరుుర్ అండ్ లవ్లీ మెరిట్ స్కాలర్‌షిప్‌నకు కూడా ఎంపికైంది. వ్యాసరచన, వక్తృత్వం, క్వీజ్‌లో వంద  బహుమతులు సాధించింది. మిస్ కాలేజీ రన్నరప్‌గా నిలిచింది. ఇవేకాకుండా 70 కవితలు, 5 కథలు, 6 పరిశోధన వ్యాసాలు రాసింది. పలు ఇంగ్లిష్ జర్నల్స్‌లో జ్యోత్స్న వ్యాసాలు ప్రచురితమయ్యారుు. మాటీవీ, జెమినీ టీవీల్లో పలు సంగీత పోటీల్లో కూడా ఆమె పాల్గొంది. కువైట్‌లో జరిగిన తెలుగు కళాసమితి కార్యక్రమంలో రాష్ట్రం తరఫున పాల్గొని తన గానంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. 2009లో వరసకు బావ అరుున పామర్తి రాధాకృష్ణను వివాహం చేసుకుంది. హైదరాబాద్‌లో ఇంగ్లిష్ అండ్ ఫరన్ లాంగ్వేజెస్ యూనివర్సీటీలో ఎంఏ పూర్తిచేసి ప్రస్తుతం అక్కడే  పీజీ చేస్తోంది జ్యోత్స్న.  భవిష్యత్తులో ప్రొఫసర్ కావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నానని ‘సాక్షి’కి తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement