శవమై తేలిన చిన్నారి జ్యోత్స్న | Three year girl found dead at wooda park after she go missing into coastal | Sakshi
Sakshi News home page

శవమై తేలిన చిన్నారి జ్యోత్స్న

Published Sun, May 29 2016 4:00 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

శవమై తేలిన చిన్నారి జ్యోత్స్న - Sakshi

శవమై తేలిన చిన్నారి జ్యోత్స్న

విశాఖపట్నం: విశాఖ జిల్లాలోని ఆర్కే బీచ్‌లో గల్లంతైన మూడేళ్ల చిన్నారి జ్యోత్స్న ఆదివారం శవమై తేలింది. చిన్నారి మృతదేహం వుడా పార్క్‌ వద్ద తీరానికి కొట్టుకొచ్చింది. పాండురంగాపురం జాస్తిస్క్వేర్‌ ఎదురుగా ఆర్కే బీచ్‌లో  చిన్నారి జ్యోత్స్న శనివారం రాత్రి ఆడుకుంటుండగా ఒక్కసారిగా భారీ అల రావడంతో గల్లంతైన సంగతి తెలిసిందే.

సమాచారం అందుకున్న మెరైన్‌ పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారి ఆచూకీ కోసం భీమిలి వరకు నేవీ సిబ్బంది సముద్రంలో జల్లెడపట్టారు. తమ గారాల పట్టి చిన్నారి జ్యోత్స్న ఇక లేదనే విషయాన్ని జీర్ణించుకోలేని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమైయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement