Viral: నడిరోడ్డుపై ఆ తాత ఎందుకలా చేశాడంటే.. | Maharashtra Old man Cycle Stunts Goes Viral | Sakshi
Sakshi News home page

వీడియో: నడిరోడ్డులో సైకిల్‌పై హుషారుగా స్టంట్స్‌.. పాపం తాత దీనగాథ!

Nov 30 2022 10:10 PM | Updated on Dec 1 2022 10:36 AM

Maharashtra Old man Cycle Stunts Goes Viral - Sakshi

నడిరోడ్డులో సైకిల్‌ హ్యాండిల్‌ వదిలేసి.. హుషారుగా సైకిల్‌ తొక్కుతూ ఆ తాత.. 

వైరల్‌: దగ్గర దగ్గర ఏడు పదుల వయసు. నడిరోడ్డులో సైకిల్‌ హ్యాండిల్‌ వదిలేసి..  హుషారుగా సైకిల్‌ తొక్కుతున్న ఓ వీడియో ట్విటర్‌ ద్వారా విపరీతంగా వైరల్‌ అవుతోంది. వయసు అనేది కేవలం అంకె మాత్రమే అనే విషయం మరోసారి ఈ వీడియో ద్వారా రుజువైందని, అనుభవశాలి అయిన ఆ తాత సంతోషంగా జీవితాన్ని ఆస్వాదిస్తున్నారంటూ పలువురు కామెంట్లు చేయడం చూస్తున్నాం. అదే సమయంలో.. 

నెగెటివ్‌ కామెంట్లు కూడా కొన్ని వస్తున్నాయి. తాగి అలా చేసి ఉంటాడని కామెంట్లు చేశారు కొందరు. ఏది ఏమైనా.. జీవితంలోని ప్రతిక్షణాన్ని ఆస్వాదించాలంటూ ‘‘జిందగీ గుల్జార్‌ హై’’ అనే ట్విటర్‌ పేజీ నుంచి ఈ వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. అయితే.. ఈ వీడియో వెనుక దీనగాథ ఉందని తర్వాతే తేలింది. 

ముంబైకి చెందిన ఓ వెబ్‌సైట్‌ కథనం ప్రకారం.. మహారాష్ట్ర థానే చెందిన భీమ్‌జీ(66/68 ఏళ్లు).. పదేళ్ల కిందట భార్యను పొగొట్టుకున్నాడు. ఏడాది కిందట ఒక్కగానొక్క కొడుకు కూడా రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. అప్పటి నుంచి ఆ తాత కష్టాలు రెట్టింపు అయ్యాయి. కోడలు భీమ్‌జీని ఇంట్లో నుంచి వెళ్లగొట్టింది. తినడానికి తిండి.. ఉండడానికి గూడు లేని ఆ పెద్దాయన వసాయ్‌(పాల్ఘడ్‌) వద్ద బస్‌ షెల్టర్‌లో కాలం వెల్లదీస్తున్నాడు. అక్కడే ఉంటూ.. దొరికిన పని చేసుకుంటూ కడుపు నింపుకుంటున్నాడు. పని లేనప్పుడు ఇలా సైకిల్‌ మీద స్టంట్స్‌ చేస్తూ డబ్బులు అడుక్కుంటున్నాడట. ఇదీ సైకిల్‌ తొక్కుతూ, విన్యాసాలు చేస్తూ దూసుకెళ్లిన వృద్ధుడి వీడియో వెనుక ఉన్న కథ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement