
లక్నో : సుప్రీం కోర్టు ఆదేశాలతో ప్రభుత్వ ప్రత్యేక బంగ్లా ఖాళీ చేసిన ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఆదివారం సామాన్య ప్రజలతో సరదాగా గడిపారు. ఈ రోజు ఉదయం గోమతి నది తీరంలోని వాకర్స్‌తో కలసి సైకిల్ తొక్కారు. అలాగే వారితో పాటు సెల్ఫీలు దిగారు. ఆ తర్వాత అక్కడి యువతతో కలసి క్రికెట్ ఆడారు. అఖిలేశ్ సీఎంగా ఉన్నప్పుడు గోమతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా అఖిలేశ్‌తో అక్కడివారు దిగిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
సమాజ్‌వాదీ ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో మరొకటైన జ్ఞానేశ్వర్ మిశ్రా పార్క్‌ను శనివారం సందర్శించిన అఖిలేశ్ ప్రభుత్వ సౌకర్యాలు శాశ్వతం కాదన్నారు. సుప్రీం కోర్టుపై గౌరవంతో ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment