ఆరెస్సెస్‌ జాతీయ బైఠక్‌కు జేపీ నడ్డా..  | BJP National President Jagat Prakash Nadda Is Coming To Hyderabad | Sakshi
Sakshi News home page

ఆరెస్సెస్‌ జాతీయ బైఠక్‌కు జేపీ నడ్డా.. 

Published Mon, Jan 3 2022 4:03 AM | Last Updated on Mon, Jan 3 2022 4:03 AM

BJP National President Jagat Prakash Nadda Is Coming To Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) అఖిల భారత కార్యకారిణి సమావేశాల్లో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాష్‌ నడ్డా నేడు హైదరాబాద్‌కు వస్తున్నారు. బుధవారం నుంచి 7వ తేదీ వరకు మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ సమీపంలోని అన్నోజిగూడలో ఈ సమావేశాలు జరగనున్నాయి.

ఆరెస్సెస్‌ సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భగవత్, వివిధ అనుబంధ విభాగాలకు చెందిన నాయకులు సమావేశంలో పాల్గొంటారు. ఆరెస్సెస్‌ ఆధ్వర్యంలో ఏడాదిలో చేపట్టిన కార్యక్రమాలు, నిర్వహణ, వాటిలో ఏబీవీపీ, బీఎంఎస్, బీకేఎస్, తదితర సంఘాల భాగస్వామ్యం, భవిష్యత్‌ కార్యాచరణపై ఈ సమావేశాల్లో చర్చిస్తారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement