మేడ్చల్‌జిల్లా శామీర్‌పేటలో బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో పది మంది తీవ్రంగా గాయపడ్డారు.
మేడ్చల్‌జిల్లా శామీర్‌పేటలో బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. మెట్‌పల్లి డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు శామీర్‌పేట హనీబర్గ్ రిసార్టు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ సహా పది మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని మెడిసిటీ ఆస్పత్రికి తరలించారు. మిగతా ప్రయాణికులను వేర్వేరు బస్సుల్లో గమ్యస్థానాలకు చేర్చారు.