
సాక్షి, మేడ్చల్: సాఫ్ట్ వేర్ ఉద్యోగి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఘట్ కేసర్ మండలం కొండాపూర్ గ్రామంలో రెండు రోజుల క్రితం సాఫ్ట్ వేర్ ఉద్యోగి కొత్త నరేష్(32) అదృశ్యమయ్యాడు. శుక్రవారం సాయంత్రం ఇంటి నుండి బయటకొచ్చిన నరేశ్ ఆచూకి లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అయితే గ్రామంలోని మంగళ కుంట చెరువు దగ్గర శనివారం నరేష్ ద్విచక్ర వాహనం, చెప్పులను కుటుంబ సభ్యులు గుర్తించారు. దీంతో ఈ విషయాన్ని పోలీసలకు తెలపగా నిన్నటి నుంచి గజ ఈతగాళ్ల సహాయంతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు.
చదవండి: వివాహమైనా తమ కళ్లెదుటే ఉండాలనుకున్నారు.. కానీ..
ఈ క్రమంలో ఈ రోజు చెరువులో నుంచి నరేష్ మృతదేహన్ని గజ ఈతగాళ్ళు వెలికి తీశారు. మృతదేహంపై ఎటువంటి గాయాలు లేకపోవడంతో ఆత్మహత్యగా భావిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేయించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా నరేష్‌కు గత నెల 26న కోకాపేటకు చెందిన యువతితో వివాహం అయ్యింది. పెళ్లైన 15 రోజులకే నరేష్ విగత జీవిగా మారడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నరేష్‌ది హత్యా? ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: Hyderabad: ఇంట్లో చెప్పకుండా ఇద్దరు పిల్లలతో కలిసి..
Comments
Please login to add a commentAdd a comment