
స్వామీజీ మూత్ర విసర్జనకు దిగిన సమయంలో డ్రైవర్ కారుతో ఉడాయించాడు.
సాక్షి, మేడ్చల్ : విశ్వనాథ పీఠాధిపతి విశ్వానాథ స్వామీజీకి సోమవారం వింత అనుభవం ఎదురైంది. శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై స్వామిజీ కారును సొంత డ్రైవరే తస్కరించే ప్రయత్నం చేశాడు. స్వామీజీ మూత్ర విసర్జనకు దిగిన సమయంలో డ్రైవర్ కారుతో ఉడాయించాడు. దీంతో స్వామీజీ శామీర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగిన పోలీసులు జీపీఆర్‌ఎస్ సాయంతో కారు పటాన్ చెరులో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులను గమనించిన నిందితుడు కారును పటాన్‌చెరువు రహదారిపై వదిలేసి పరారయ్యాడు. అందులో ఉన్న రూ.40 వేల నగదు, ఏటీఎం కార్డులు తీసుకెళ్లాడు. కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు స్వామీజీకి అప్పగించి.. నిందితుడు కోసం గాలిస్తున్నారు.