
మేడ్చల్ జిల్లా: ఘట్కేసర్ లో దారుణం జరిగింది. మాజీ ఎంపీటీసీ గడ్డం మహేశ్‌ను కొందరు దుండగులు హత్య చేశారు. 2024, జూన్ 17వ తేదీ నుంచి మహేశ్ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా. గడ్డం మహేష్‌ను హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. జేసీబీ సాయంతో ఘట్‌కేసర్ డంపింగ్ యార్డ్‌లో కారును పాతి పెట్టినట్లు పోలీసులకు వెల్లడించినట్లు తెలుస్తోంది.
నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా మృతదేహం కోసం డంపింగ్ యార్డులో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఈ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments
Please login to add a commentAdd a comment