
అమరవీరుల స్థూపానికి నివాళులర్పిస్తున్న సోమనాథ్ భారతి, ఇందిరాశోభన్ తదితరులు
సాక్షి, మేడ్చల్ జిల్లా: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ నేత, ఎమ్మెల్యే, సౌత్ ఇండియా ఇన్‌చార్జీ సోమనాథ్ భారతి అన్నారు. తెలంగాణ లోని ప్రతి గడపకు వెళ్లి, ప్రజలకు పూర్తి భరోసా కల్పిస్తామన్నారు. శనివారం హైదరాబాద్‌లో ఆప్ తెలంగాణ నిర్వహించిన పంజాబ్ విజయోత్సవ ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
దీనికి ముందు శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఆప్ తెలంగాణ సెర్చ్ కమిటీ చైర్‌పర్సన్ ఇందిరాశోభన్ ఆధ్వర్యంలో నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం గన్‌పార్క్ వరకు ర్యాలీ గా వచ్చి, అమరవీరుల స్థూపానికి నివాళులర్పించా రు. ఈ సందర్భంగా సోమనాథ్ మీడియాతో మాట్లాడారు. ఎన్నో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేరలేదన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనకు మూలమైన నీళ్లు, నిధులు, నియామకాలు లేవని, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు, ఉద్యమ లక్ష్యాలు పక్కకు నెట్టివేశారని సోమనాథ్ ఆరోపించారు. ఈ పరిస్థితి మారాలంటే సామాన్యుడికే అధికారం అనే నినాదంతో మీ ముం దుకు వస్తున్న ఆప్‌ను అక్కున చేర్చుకోవాలని కోరా రు. అందరి తెలంగాణ కోసం సబ్బండ వర్గాలు పోరాడితే.. రాష్ట్రం ఏర్పడ్డాక అది కొందరి తెలంగాణగా మారిందని ఇందిరాశోభన్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment