సాక్షి, మేడ్చల్: మేడ్చల్ జిల్లాలోని పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. మంగళవారం తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో ఐరన్ లోడుతో వచ్చిన ఓ లారీ... వెనక్కి చూసుకోకుండా నిర్మాణంలో ఉన్న ఇంటి ముందు నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బీహార్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వలస కార్మికులు చనిపోయారు. చనిపోయిన వారిని చందన్‌రామ్, చందన్ కుమార్ సహరిగా గుర్తించారు. బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోదావరి హోమ్స్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment